Shahrukh Khan:బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బాద్ షా గా గుర్తింపు తెచ్చుకున్న షారుఖ్ ఖాన్ (Shahrukh Khan) కి భారీ షాక్ తగిలింది అని చెప్పవచ్చు. అంతేకాదు ఢిల్లీ హైకోర్టు ఈయనకు ఈ – సమన్లు జారీ చేసింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ (Aryan Khan) తొలి దర్శకత్వంలో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘ది బ్యాడ్స్ అఫ్ బాలీవుడ్’. అయితే ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం లీగల్ సమస్యలలో చిక్కుకుంది. ఈ సిరీస్ లో చూపించిన ఒక పాత్ర తన నిజ జీవితాన్ని పోలి ఉంది అని.. దానివల్ల తన ఇమేజ్ కూడా దెబ్బతింటుంది అంటూ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మాజీ అధికారి సమీర్ వాంఖడే (Sameer wankhede) కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఒక పిటిషన్ కూడా వేశారు. తన పిటీషన్ లో… “ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ సిరీస్ విడుదలైన తర్వాత ప్రేక్షకులు నన్ను, నా కుటుంబాన్ని సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోల్స్ చేస్తున్నారు. వాస్తవానికి నాతో ఎలాంటి సంబంధం లేకపోయినా.. ఈ సీరిస్ లో చూపిన పాత్రను నాతో పోలుస్తూ అనవసరమైన అపార్ధాలు సృష్టిస్తున్నారు. దీని వల్ల నేను వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను” అంటూ కోర్టును ఆశ్రయించారు.
ALSO READ:Bigg Boss : హౌస్‌లో వాటర్‌మిలన్ స్టార్ రచ్చ… ఇతని బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా ?
దీంతో ఈ కేసు పై ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపి.. ఈ వెబ్ సిరీస్ ను నిర్మించిన నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ అలాగే స్ట్రీమింగ్ జెయింట్ నెట్ ఫ్లిక్స్ లకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 30కి వాయిదా వేస్తూ.. అప్పటిలోగా ఈ అంశంపై మేకర్స్ తమ వివరణ ఇవ్వాలి అని కూడా కోరుతూ ఆదేశాలు జారీ చేసింది. ఇకపోతే రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ అధినేత షారుఖ్ ఖాన్, వెబ్ సిరీస్ దర్శకుడు ఆర్యన్ ఖాన్ ఇప్పుడు చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది.
వాస్తవానికి ది బ్యాడ్స్ అఫ్ బాలీవుడ్ వెబ్ సిరీస్ ప్రారంభమైన మొదటి నుంచే ప్రేక్షకులలో ఆసక్తి రేపింది. దీనికి తోడు ఇప్పుడు లీగల్ వివాదంలో చిక్కుకోవడంతో మరొకసారి ఈ వెబ్ సిరీస్ హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు ఈ కేసు తీర్పు కోసం అందరూ ఎదురుచూస్తూ ఉండగా.. ఈ వివాదం కారణంగా అనూహ్యంగా ఈ సీరిస్ కి భారీ పబ్లిసిటీ లభిస్తోంది అని చెప్పవచ్చు. ఆయన వేసిన పిటిషన్ కారణంగా ఆయన పాత్ర చూడడానికి వీక్షకులు పదేపదే ఈ సిరీస్ చూస్తూ ఉండడం గమనార్హం. ఇక ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ వెబ్ సిరీస్ విషయానికొస్తే.. ఇందులో అమీర్ ఖాన్, రాజమౌళి లాంటి దిగ్గజ వ్యక్తులు కూడా నటించడంతో ఈ వెబ్ సిరీస్ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.ప్రస్తుతం లీగల్ ఇబ్బందులు ఎదుర్కొంటున్న షారుక్ ఖాన్, నెట్ ఫ్లిక్స్ ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి.