Peddi Movie: టాలీవుడ్ స్టార్ హీరో, మెగా పవన్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చెర్రీ ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇకపోతే రామ్ చరణ్ చివరగా గేమ్ చేంజర్ మూవీతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ఊహించని విధంగా ఘోరమైన డిజాస్టర్ ని చవిచూసింది. ఈ సినిమా కంటే ముందు ఆర్ఆర్ఆర్ తో ప్రేక్షకులను పలకరించడంతో పాటు ఈ సినిమాతో పాన్ ఇండియా హీరోగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు చెర్రీ.
ఆ సంగతి పక్కన పెడితే రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది(Peddi). ఈ సినిమాకు బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్ లో, కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ(janvi Kapoor) కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఎక్సైటింగ్ గా ఎదురుచూస్తున్నారు.
పెద్ది ఫస్ట్ ఆఫ్ లాక్..
కాగా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి వినిపించిన వార్తలు సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది. అదేంటంటే.. పెద్ది సినిమా ఫస్ట్ ఆఫ్ లాక్ అయిపోయిందట. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ 60% పూర్తి అవ్వడంతో ఈ సినిమా అవుట్ ఫుట్ పై రాంచరణ్ సూపర్ హ్యాపీగా ఉన్నారట. ఇకపోతే తదుపరి షెడ్యూల్ రేపటి నుంచి మొదలు కాబోతుండగా, ఆ షెడ్యూల్ లో పూణె(pune)లో రామ్ చరణ్, జాన్వీ కపూర్ లపై పాట చిత్రీకరణ ఉన్నారట మూవీ మేకర్స్.
మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా ఉంటుందంటూ..
ఈ సినిమాకు జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే రెహమాన్(Rehaman) ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన అందించిన ట్యూన్ వినగానే కిక్ ఎక్కేస్తుందని, ఈ ఆల్బమ్ లో మళ్లీ మళ్లీ వినాలపించే పాట అవుతుందని ఇన్ సైడ్ వర్గాల టాక్ గట్టిగానే నడుస్తోంది. ప్రస్తుతం ఇదే విషయం సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది. కాగా త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్లు సినిమా విడుదల తేదీ వంటివి తెలియనున్నాయి.
Also Read: Brahmakalasha song: కాంతార1 బ్రహ్మకలశ ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్..పూనకాలు తెప్పిస్తోందిగా!