Brahmakalasha Song: రిషబ్ శెట్టి(Rishabh Shetty) రుక్మిణి వసంత్(Rukmini Vasanth) ప్రధాన పాత్రలలో నటించిన తాజా చిత్రం కాంతార చాప్టర్ వన్1(Kantara Chapter 1). ఈ సినిమా అక్టోబర్ 2వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యి ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా విడుదలైన ఆరు రోజులకే 500 కోట్ల కలెక్షన్ల దిశగా పరుగులు పెడుతోంది. ఇలా ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా భారీ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ అద్భుతమైన కలెక్షన్లను రాబడుతుంది. ఇక ఈ సినిమాలో ప్రతి సన్నివేశం థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా చూస్తున్న కొంతమంది ప్రేక్షకులకు దేవుడు ఆవహించిన సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. మొత్తానికి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుని ఇప్పటికీ ఫుల్ థియేటర్ రన్ తో దూసుకుపోతుంది. ఇకపోతే తాజాగా ఈ సినిమా నుంచి బ్రహ్మ కలశ ఫుల్ వీడియో సాంగ్ విడుదల చేశారు. ఈ పాట ప్రోమో విడుదల చేసిన సమయంలోనే ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఈ బ్రహ్మ కలశ (Brahmakalasha Song) పాట కూడా వరాహ రూపం పాటను తలపించిందని చెప్పాలి. తాజాగా ఈ పాటకు సంబంధించిన ఫుల్ వీడియోని చిత్ర బృందం విడుదల చేయడంతో యూట్యూబ్ లో ట్రెండింగ్ లోకి వచ్చింది. ఇక ఈ పాటను చూస్తుంటే మాత్రం మనకు తెలియకుండానే మనలో భక్తి భావం కలుగుతుందని చెప్పాలి.
బ్రహ్మకలశ అంటూ సాగిపోయే ఈ పాటకు అజనీష్ లోకనాథ్ స్వరాలు సమకూర్చగా, కృష్ణ కాంత్ సాహిత్యం అందించారు. అబ్బి వి ఈ పాటను ఆలపించారు. ఈ పాట కూడా వరాహ రూపం థీమ్ తో మొదలవడంతో మరింతగా ప్రేక్షకులను ఆకట్టుకుందని చెప్పాలి. థియేటర్ లో కూడా ఈ పాటకు ఎంతో మంచి ఆదరణ లభించిన సంగతి తెలిసిందే. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ ఫుల్ వీడియో సాంగ్ పై ఓ లుక్ వేసేయండి. ఇక కాంతార1 సినిమా విషయానికి వస్తే రిషబ్ స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.
కాంతార సినిమాకు ప్రీక్వెల్ సినిమాగా విడుదలైన ఈ చిత్రం భారీ ఆదరణ సొంతం చేసుకుంది. ఇక కాంతార యూనివర్సల్ నుంచి మరికొన్ని సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయని దర్శకుడు రిషబ్ శెట్టి వెల్లడించారు. ఇక ఈ అద్భుతమైన సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ హోం భలే ఫిల్మ్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమాకి అజనీష్ లోకనాథ్ సంగీత దర్శకుడిగా వ్యవహరించగా, గుల్షన్ దేవయ్య, జయరామ్ వంటి పలువురు కీలక పాత్రలలో నటించారు. కన్నడ చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా కొనసాగుతున్న రిషబ్ శెట్టి కాంతార సినిమాతో నటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. ఇక ఈ సినిమా ద్వారా ఈయన పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఇతర భాషలలో కూడా రిషబ్ శెట్టికి అవకాశాలు వస్తున్న సంగతి తెలిసిందే.
Also Read: SSMB 29: మహేష్ రాజమౌళి సినిమా టైటిల్ ఇదేనా.. ఇలాంటి టైటిల్ ఏంటీ జక్కన్న!