Illu Illalu Pillalu ToIlluday Episode August 23rd : నిన్నటి ఎపిసోడ్ లో.. శ్రీవల్లి ఇంట్లో ఎవరు లేరని తెలుసుకున్న శ్రీవల్లి ఆగమేఘాల మీద పుట్టింటికి వెళ్తుంది.జరిగిన విషయాన్ని తన తల్లితో పంచుకుంటుంది. ఇంట్లో భాగ్యం ఆనందరావు టెన్షన్ పడుతూ ఉంటారు. శ్రీవల్లి ఇంట్లోకి రావడం చూసి అమ్ముడు ఇంట్లోంచి గెంటేసారా అని అడుగుతాడు.. భాగ్యం ఏమైంది అమ్మడు ఏం జరిగింది చెప్పవే అని కంగారుపడుతూ అడుగుతుంది.. నేను నువ్వు చెప్పినట్లే అంతా చెప్పానమ్మా కానీ వాళ్ళు నా మాటని అస్సలు వినడం లేదు.. రైస్ మిల్లు దొంగలు పడ్డారని వెళ్లారు ఇప్పుడు ఇంటికి రాగానే కచ్చితంగా ఈ విషయాన్ని మావయ్యకి చెప్పేస్తారు అని కంగారుపడుతూ చెప్తుంది శ్రీవల్లి.. భాగ్యం మాత్రం ఏదో ఒకటి చేద్దాం నువ్వు టెన్షన్ పడకు అని శ్రీవల్లికి ధైర్యం చెబుతుంది.. కాపురం ఎక్కడ కూలిపోతుందో అని భయపడుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. మమ్మల్ని అందరూ మోసం చేసి ఐపి పెట్టేశారు. మేము ఈ పరిస్థితికి వచ్చేసాము మమ్మల్ని క్షమించండి అని అంటారు. భాగ్యం మరో ప్లాను సక్సెస్ అవుతుంది. నిజంగానే ఆస్తులు పోయాయని అందరూ నమ్ముతారు. ప్రేమ మాత్రం వీళ్ళ మోసం ఎలాగైనా బయట పెట్టాలని చెప్పబోతుంది.. నర్మద వద్దని అంటుంది. భాగ్యం నిజంగానే మోసపోయారని అందరూ గుడ్డిగా నమ్మేస్తారు. ఇక భాగ్యం ఆనందరావు చందు దగ్గరికి వెళ్లి కాళ్ళ మీద పడతారు. మీకు 10 లక్షలు ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నాము పరిస్థితి మీకు అర్థమైందని అనుకుంటున్నాము ఎలాగైనా సరే మీకు ఆరు నెలల్లో ఆ పది లక్షలు తిరిగి ఇస్తాము అని భాగ్యం అంటుంది.
నేను ఆ వడ్డీకి తీసుకొచ్చాను అతని దగ్గర నేను ఎలా మొహం చూపించాలి అని చందు అంటున్న సరే భాగ్యం ఆనందరావు మా పరిస్థితిని మీరు అర్థం చేసుకోవాలి అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. చందు మాత్రం బాధపడుతూ ఉంటాడు. మీరు ఇలా అంటారు అని నేను అస్సలు ఊహించలేదండి అని చందు అంటాడు. మళ్ళి అర్థం చేసుకో బాబు అని భాగ్యం వాళ్ళు చెప్తారు. ఇక రామరాజు దగ్గరికి తిరుపతి చెంబును తీసిన మార్గం చెప్పు బావ అంటూ వస్తాడు.. నీవు నమ్మినబంటుని ఆ మాత్రం చేయలేవా అని తిరుపతి. నా పరిస్థితి నువ్వు అర్థం చేసుకోవేంటి బావ ఒకటి రెండు అన్ని దీంతోనే చేయాల్సి వస్తుంది బావ అని తిరుపతి ఏడుస్తాడు.
రామరాజు మేమందరం మా పనుల మేము బిజీగా ఉంటే నువ్వు పెద్ద పోటుగాడిలాగా దాంట్లో చేయి పెట్టి ఇది చేసావు కదా ఎందుకు పెట్టావు అని అడుగుతాడు.. నీలాగే కాదు బావ నా అల్లుళ్ళు.. చెంబు తీసే మార్గం కనుక్కొని వస్తామని వెళ్లారు అని తిరుపతి అంటారు.. సాగర్ ధీరజ్ ఇద్దరు కూడా మారినాయుధాలను తీసుకొని వస్తారు అవాటిని చూసినా రామరాజు నవ్వుకుంటాడు. తిరుపతి షాక్ అవుతాడు. ఏంట్రా ఏదో ఐడియా అని చెప్పేసి మారినాయిదాలు తీసుకొచ్చారు అని అంటాడు. తో కోస్తే చెంబు తెగిపోతుంది నీ చెయ్యి బయటకు వస్తుంది మామ అనేసి ఇద్దరు కూడా ప్రయత్నాలు చేస్తారు. దాంతో తిరుపతి అరే వాటితో కోస్తే నా చెయ్యి పోతుందిరా అని అంటాడు.
Also Read: అవని పై పల్లవి కుట్ర.. మారిపోయిన పార్వతి.. ప్రణతి, భరత్ లతో వ్రతం..?
చందు ఒంటరిగా కూర్చుని బాధపడుతూ ఉంటాడు. శ్రీవల్లి చందు దగ్గరకు వచ్చి ఆట మాట్లాడుకున్నామంటే బాధ తగ్గిపోతుందా బావ.. మా అమ్మ నాన్న పరిస్థితి తెలుసు కదా నీకు. ఇలా అయితుందని అసలు ఊహించలేదు బావ అని దగ్గరకు వస్తుంది.. నన్ను మాత్రం నన్ను ఒంటరిగా వదిలేయ్ అని చెప్పేసి శ్రీవల్లికి షాక్ ఇస్తాడు.. అయితే శ్రీవల్లి చందు మాటలు తలుచుకొని బాధపడుతూ ఒంటరిగా కూర్చుని ఉంటుంది. శ్రీవల్లిని చూసిన వేదవతి ఆస్తులు పోయాయని అందరూ చులకనగా చూస్తారని బాధపడుతుందేమో అని దగ్గరికి వెళ్లి ఓదారుస్తుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. సోమవారం ఎపిసోడ్లో ప్రేమ నర్మదల మధ్య దూరం పెరుగుతుందేమో చూడాలి…