BigTV English

Andhra Pradesh Investment: ఏపీ చరిత్రలోనే రికార్డు.. రూ.1,14,824 కోట్ల పెట్టుబడులకు ఆమోదం!

Andhra Pradesh Investment: ఏపీ చరిత్రలోనే రికార్డు.. రూ.1,14,824 కోట్ల పెట్టుబడులకు ఆమోదం!

Andhra Pradesh Investment: పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. దేశంలోనే కాకుండా, అమెరికా వెలుపల అతిపెద్ద డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయబోతున్న.. రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా లిమిటెడ్ (గూగుల్ అనుబంధ సంస్థ) విశాఖపట్నంలో రూ.87,520 కోట్ల భారీ పెట్టుబడితో ఆంధ్రప్రదేశ్‌లో డేటా సెంటర్ స్థాపనకు ముందుకు వచ్చింది. రాష్ట్ర సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 11వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) సమావేశంలో.. ఈ ప్రాజెక్టుకు అధికారిక ఆమోదం లభించింది.


ఈ డేటా సెంటర్‌ను విశాఖ జిల్లాలోని తర్లువాడ, అడవివరం, అచ్యుతాపురం సమీపంలోని రాంబిల్లి ప్రాంతాల్లో మూడు క్యాంపస్‌లుగా అభివృద్ధి చేయనున్నారు. రాబోయే విశాఖ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్‌తో ఈ డేటా సెంటర్లు అనుసంధానమవుతాయి. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అమలైతే, దాదాపు 200 మందికి నేరుగా ఉద్యోగాలు లభించనున్నాయి.

మొత్తం రూ.1,14,824 కోట్ల పెట్టుబడులకు ఆమోదం


11వ ఎస్ఐపీబీ సమావేశంలో మొత్తం 26 ప్రాజెక్టులకు రూ.1.14 లక్షల కోట్ల పెట్టుబడులు ఆమోదించబడ్డాయి. వీటి ద్వారా 67,218 మందికి ఉద్యోగ అవకాశాలు కలుగనున్నాయి. ఈ ప్రాజెక్టుల్లో విద్యుత్, ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ, ఏరోస్పేస్, ఆటోమొబైల్, పర్యాటక రంగాలు ప్రాధాన్యత పొందాయి.

కేవలం 15 నెలల కాలంలో పెట్టుబడుల ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని సీఎం ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. డేటా సెంటర్లతో ఓ ఎకో సిస్టం వస్తోందని.. విశాఖ నగరం తదుపరి స్థాయి ఏఐ సిటీగా మారుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. విద్యుత్ తక్కువ ధరకు అందిస్తే ఐటీ రంగానికి మేలు జరుగుతుందని సీఎం వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకూ జరిగిన 11 ఎస్ఐపీబీల ద్వారా రూ.7.07 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. ఈ ప్రాజెక్టుల ద్వారా 6.20 లక్షల మందికి నేరుగా ఉద్యోగాలు దక్కనున్నాయి.

ప్రాంతాల వారీగా పారిశ్రామిక ప్రగతి

ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్రాన్ని మూడు ఆర్థిక అభివృద్ధి రీజియన్లుగా విభజించాలని సూచించారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ – తూర్పుగోదావరి నుంచి శ్రీకాకుళం వరకూ. అమరావతి రీజియన్ – పశ్చిమ గోదావరి నుంచి ప్రకాశం వరకు. దక్షిణ ఎకనామిక్ రీజియన్ – నెల్లూరు, రాయలసీమ జిల్లాలపై ఆధారంగా.

ఈ మూడు రీజియన్లతోపాటు రాయలసీమలో ఏరోస్పేస్, డ్రోన్ సిటీలు, ఆటోమొబైల్ కారిడార్లు, ఆగ్రో ప్రాసెసింగ్ హబ్‌లు ఏర్పడనున్నాయి. కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లును అతిపెద్ద పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దాలనే ప్రణాళిక కూడా ఉంది.

మెగా ప్రాజెక్టులకు ప్రత్యేక అధికారులు

రైడెన్ డేటా సెంటర్, భారత్ పెట్రోలియం రిఫైనరీ, ఆర్సెలార్ మిట్టల్ వంటి మెగా ప్రాజెక్టులను పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారులను నియమించాలని సీఎం ఆదేశించారు. పారిశ్రామిక ప్రాజెక్టులను రైల్వే లైన్‌లతో అనుసంధానం చేసి లాజిస్టిక్స్ వ్యయాన్ని తగ్గించే దిశగా చర్యలు చేపట్టాలని కూడా సూచించారు.

మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, నారాయణ, టీజీ భరత్, కందుల దుర్గేష్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

11వ ఎస్ఐపీబీ ఆమోదం పొందిన ప్రధాన ప్రాజెక్టులు ఇవే..

1. యాక్మే ఊర్జా ఒన్ లిమిటెడ్ – అనంతపురం జిల్లాలో సౌర విద్యుత్ ప్రాజెక్టులో రూ.2 వేల కోట్ల పెట్టుబడి, 1380 మందికి ఉద్యోగాలు
2.టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ అనంతపురం జిల్లాలో 400 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు రూ.2 వేల కోట్ల పెట్టుబడి, 1,380 మందికి ఉద్యోగాలు
3.చింతా గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ విజయనగరం జిల్లాలో.. పంప్డ్ ఎనర్జీ ప్రాజెక్టు రూ.12,905 కోట్ల పెట్టుబడి, 3వేల మందికి ఉద్యోగాలు
4.ఆంఫ్లిన్ ఎనర్జీ ట్రాన్సిషన్ కర్నూలు, నంద్యాల జిల్లాల్లో సౌరవిద్యుత్ ప్రాజెక్టు రూ.15.10 కోట్లు పెట్టుబడి
5. రిలయన్స్ కన్సూమర్ ప్రోడక్స్ట్ కర్నూలు జిల్లా ఓర్వకల్లు లో ఎఫ్ఎంసీజీలో రూ.758 కోట్ల పెట్టుబడులు, 500 మందికి ఉద్యోగాలు
6. గోద్రేజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ రూ.208 కోట్ల పెట్టుబడులు, 66 మందికి ఉద్యోగాలు
7.ఎస్వీఎఫ్ సోయా ప్రైవేట్ లిమిటెడ్ రూ.201 కోట్ల పెట్టుబడి, 436 మందికి ఉద్యోగాలు
8.ఫ్రెష్ బౌల్ హార్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.33 కోట్ల పెట్టుబడి, 200 మందికి ఉద్యోగాలు
9.దస్పల్లా అమరావతి హోటల్స్ అమరావతిలో రూ.200 కోట్ల పెట్టుబడి, 400 మందికి ఉద్యోగాలు
10.వీఎస్కే హోటల్స్ రిసార్ట్స్ అరకు వ్యాలీలో రూ.55 కోట్ల పెట్టుబడి, 98 మందికి ఉద్యోగాలు
11.శ్రీవేంకటేశ్వరా లాడ్జ్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీశైలంలో రూ.83 కోట్ల పెట్టుబడి, 300 మందికి ఉద్యోగాలు
12. సదరన్ గ్లోబ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ అమరావతిలో రూ.117 కోట్ల పెట్టుబడి, 300 మందికి ఉద్యోగాలు
13.. మైరా బే వ్యూ రిసార్ట్స్ కొత్తవలసలో కన్వెన్షన్ సెంటర్ కు రూ.256 కోట్ల పెట్టుబడి
14.ఎస్వీఎస్ కనస్ట్రక్షన్స్ కాకినాడ లో రూ.87 కోట్ల పెట్టుబడి,
15.రైడన్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ డేటా సెంటర్ ఏర్పాటుకు రూ.87,520 కోట్ల పెట్టుబడి, 200 మందికి ఉద్యోగాలు.
16. ఇమాజినేటివ్ టెక్నో సొల్యూషన్స్ ఇండియా విశాఖ కాపులుప్పాడ లో ఐటీ లాజిస్టిక్స్ రూ.140 కోట్ల పెట్టుబడి, 2600 మందికి ఉద్యోగాలు
17. శాన్వీరా ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనకాపల్లిలో అడ్వాన్స్డ్ కార్బన్ కాంప్లెక్స్ రూ.2600 కోట్ల పెట్టుబడి, 800 మందికి ఉద్యోగాలు
18. శ్రీ సిమెంట్ లిమిటెడ్, పలనాడులో సిమెంట్ ఫ్యాక్టరీ విస్తరణ రూ.2260 కోట్ల పెట్టుబడి, 350 మందికి ఉద్యోగాలు
19.రేమండ్, జేకే మైనీ ప్రెసిషన్ టెక్నాలజీ అనంతపురంలో ఏరో స్పేస్ ఆటోమోటివ్ కాంపోనెంట్ రూ.430 కోట్ల పెట్టుబడి, 4,096 మందికి ఉద్యోగాలు
20. రేమాండ్ జేకే మైనీ గ్లోబల్ ఎరోస్పేస్ లిమిటెడ్, అనంతపురంలో ఏరోస్పేస్ కాంపోనెంట్లు రూ.510 కోట్ల పెట్టుబడి, 1400 మందికి ఉద్యోగాలు.
21. భారత్ డైనమిక్స్ లిమిటెడ్, ప్రకాశం జిల్లా దొనకొండ వద్ద రూ.1200 కోట్ల పెట్టుబడి, 1400 మందికి ఉద్యోగాలు
22. అలీప్ ఓర్వకల్లు వద్ద మహిళా ఇండస్ట్రియల్ ఎస్టేట్ కోసం రూ.36.25 కోట్ల పెట్టుబడి, 3000 మందికి ఉద్యోగాలు
23. అవంతీ వేర్ హౌసింగ్ సర్వీసెస్ విశాఖలో గుర్రమ్ పాలెం, రూ.319 కోట్ల పెట్టుబడి
24.అస్సెల్ ఈఎస్ జీ కర్నూలు జిల్లా కృష్ణగిరిలో రూ.300 కోట్ల పెట్టుబడి, 300 మందికి ఉద్యోగాలు
25. ఫెయిర్ ఎక్స్ పోర్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, విజయవాడ మల్లవెల్లి లో మెగా ఫుడ్ పార్క్ కోర్ ప్రాసెసింగ్ సెంటర్
26. జెఎస్ డబ్ల్యూ ఇండస్ట్రియల్ పార్క్, విజయనగరంలో ప్రైవేట్ మెగా ఇండస్ట్రియల్ పార్క్, రూ.531 కోట్ల పెట్టుబడి, 45000 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి.

Related News

TTD 2026 Calendars: శ్రీవారి భక్తులకు అందుబాటులోకి.. టీటీడీ 2026 డైరీలు, క్యాలెండర్లు

AP Weather Alert: ఏపీపై ద్రోణి ఎఫెక్ట్.. రానున్న రెండు రోజులు భారీ వర్షాలు

AP Roads: రోడ్ల మరమ్మత్తులకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్.. రూ.1000 కోట్లు మంజూరు

Simhachalam Appanna: సింహాద్రి అప్పన్న ఆభరణాలు ఏమయ్యాయి.. ఏఈవో, ప్రధానార్చకులకు నోటీసులు

Nara Lokesh: ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు నాణ్యమైన భోజనం.. మాటనిలబెట్టుకున్న మంత్రి లోకేశ్!

Jagan Tour: జగన్‌ నర్సీపట్నం టూర్‌.. పోలీసులు పర్మీషన్.. వార్నింగ్‌తో వెళ్తారా? డ్రాపవుతారా?

YS Jagan: వైఎస్ జగన్‌కు పోలీసులు షాక్.. విశాఖ రోడ్ షోకి నో పర్మిషన్

Big Stories

×