SSMB 29: టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రేజీ ప్రాజెక్టు కోసం కోట్లాదిమంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి వినిపించిన వార్తలు సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి. దానికి తోడు స్టార్ డైరెక్టర్ రాజమౌళి(Rajamouli )ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది. ఈ వార్తలు కూడా సినిమాపై అంచనాలను భారీగా పెంచేస్తున్నాయి. ఇది ఇలా ఉంటే డైరెక్టర్ రాజమౌళి, హీరో మహేష్ బాబు(Mahesh Babu) ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలలో భాగంగా బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా అభిమానులు ఈ సినిమా నుంచి విడుదల అయ్యి అప్డేట్ల కోసం ఎదురుచూస్తున్నారు.
మూవీ టైటిల్ ఫిక్స్..
అయితే రాజమౌళి సినిమా అంటే విడుదల అయ్యేవరకు ఎలాంటి అప్డేట్లు ఉండవు అన్న విషయం తెలిసిందే. కానీ అభిమానులు మాత్రం పట్టు వీడని విక్రమార్కుడిలా ఈ సినిమా అప్డేట్ల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. అప్పుడప్పుడు కొన్ని గాసిప్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేమిటంటే ఈ సినిమా టైటిల్ ని ఫిక్స్ చేసినట్టు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
ఆ ప్రాంతాన్ని తలపించేలా భారీ సెట్..
ఈ సినిమాకు మూవీ మేకర్స్ వారణాసి(Varanasi) అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం మూవీ మేకర్స్ ఈ సినిమా షూటింగ్ లో రామోజీ ఫిలిం సిటీలో వారణాసి ప్రాంతాన్ని తలపించే విధంగా ఒక భారీ సెట్ వేశారట. దాంతో ఈ వార్తలు సోషల్ మీడియాలో గుప్పు మన్నాయి. ఇది ఇలా ఉంటే రాజమౌళి, మహేష్ సినిమా అంటే ఒక రేంజ్ లో సినిమా టైటిల్ ని ఊహించుకున్న ఫ్యాన్స్ ఇలా సింపుల్ గా వారణాసి అని పెట్టడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయం గురించి ఇప్పుడు మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Also Read: Rishabh shetty : కరూర్ తొక్కిసలాటపై రిషబ్ శెట్టి రియాక్షన్.. తప్పు కాదు అంటూ..