Venkatesh X Trivikram : ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్ సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అలాంటి కాంబినేషన్స్ లో వెంకటేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ కూడా ఒకటి. స్వయంవరం సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి రచయితగా ఎంట్రీ ఇచ్చాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆ సినిమా విడుదలైన మరుసటి రోజు చాలామంది ప్రొడ్యూసర్స్ మాటలు మాం చికుడైనటువంటి త్రివిక్రమ్ వెతుక్కుంటూ వచ్చారు.
అయితే త్రివిక్రమ్ స్వయంవరం సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత తన సొంత ఊరు భీమవరం వెళ్లిపోయారు. ఆ టైంలో ప్రముఖ నిర్మాత స్రవంతి రవి కిషోర్ నువ్వే కావాలి సినిమా గురించి త్రివిక్రమ్ తో ప్రస్తావించారు. మళ్లీ తరుణ్ సినిమాకి త్రివిక్రమ్ హైదరాబాద్ వచ్చారు. ఒక రీమేక్ సినిమాను కూడా చాలా అద్భుతంగా డీల్ చేశాడు త్రివిక్రమ్. అయితే త్రివిక్రమ్ మొదటిసారిగా పనిచేసిన పెద్ద హీరో వెంకటేష్.
త్రివిక్రమ్ వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన నువ్వు నాకు నచ్చావు సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలమైన విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సినిమాకి విజయభాస్కర్ దర్శకత్వం వహించారు. కానీ నువ్వు నాకు నచ్చావ్ సినిమా ప్రస్తావని వస్తే మొదటి వినిపించే పేరు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఎందుకంటే రైటింగ్ లో ఆ బ్యూటీ ఉంటుంది.
ఈ సినిమా నిర్మాత స్రవంతి రవి కిషోర్ ఒక బ్రీఫ్ కేసులో ఈ స్క్రిప్టును పట్టుకొని చాలామందికి చెబుతూ ఉండేవారు. ఈ సినిమాను పదే పదే చదువుకుంటూ బాగున్న డైలాగ్ గురించి అర్ధరాత్రిలు కూడా త్రివిక్రమ్ కి ఫోన్ చేసి పొగిడేవారు. వారిద్దరికీ మధ్య అంత బాండింగ్ ఉంది. అందుకే దర్శకుడిగా మొదటి సినిమాను స్రవంతి రవి కిషోర్ కి చేశాడు త్రివిక్రమ్.
ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ వెంకటేష్ కలిసి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మొదటిసారి త్రివిక్రం దర్శకుడుగా వెంకటేష్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ మొదలైంది. కొద్దిసేపటి క్రితమే నిర్మాత నాగ వంశీ వీరిద్దరూ సెట్స్ లో ఫోటోని విడుదల చేశారు.
After 20 long months, the wizard of words #Trivikram garu is back behind the camera, joining hands with everyone’s favourite, Victory @VenkyMama garu! 🙌❤️
The OGs of entertainment are back on sets to recreate the magic once again! ❤️😉🎬
Produced by #SRadhaKrishna (Chinababu)… pic.twitter.com/781uxgmQ5P
— Naga Vamsi (@vamsi84) October 8, 2025
త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక సినిమా చేసిన తర్వాత రెండో సినిమా చేయడానికి చాలా టైం తీసుకుంటారు. అనుకుంటే కథను చాలా తొందరగా రాయగలరు. కానీ అంత త్వరగా రాయడానికి ఇష్టపడరు.అజ్ఞాతవాసి అనే సినిమా ఫెయిల్ అయిన తర్వాత ఎక్కువ రెస్ట్ తీసుకోకుండా అరవింద సమేత సినిమాని త్వరగా మొదలుపెట్టి సంక్రాంతికి పోయిన సక్సెస్ విజయదశమికి అందుకున్నారు.
త్రివిక్రమ్ లాస్ట్ ఫిలిం గుంటూరు కారం సినిమా వచ్చి ఏడాది దాటిపోయింది. దాదాపు 20 నెలలు రెస్ట్ తీసుకున్న తర్వాత త్రివిక్రమ్ మొదటిసారి కెమెరా వెనక్కి వచ్చి యాక్షన్ చెప్పబోతున్నారు అని నాగవంశీ ట్విట్టర్ వేదికగా ఫొటోస్ షేర్ చేస్తూ పోస్ట్ పెట్టారు.
Also Read: Nayanthara: నయనతార ఇంటికి బాంబు బెదిరింపులు, కోలీవుడ్ లో కలకలం