BigTV English

Mithra Mandali : తెలివితేటలు ప్రదర్శించొద్దు, మిత్రమండలి సినిమా పైన ఓపెన్ అయిన బన్నీ వాస్

Mithra Mandali : తెలివితేటలు ప్రదర్శించొద్దు, మిత్రమండలి సినిమా పైన ఓపెన్ అయిన బన్నీ వాస్

Mithra Mandali : దీపావళి కానుకగా మిత్రమండలి అనే ఒక సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రియదర్శి, ప్రసాద్ బెహరా, రాగ్ మయూర్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కూడా విడుదలైంది.


అక్టోబర్ 16న ఈ సినిమా రిలీజ్ కి సిద్ధమవుతున్న తరుణంలో బన్నీ వాసు ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ప్రమోషనల్ ఇంటర్వ్యూలో సినిమా గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలివితేటలు ప్రదర్శించొద్దు

రీసెంట్ టైమ్స్ లో చాలామంది యంగ్ దర్శకులు అద్భుతమైన కాన్సెప్ట్ మరియు కథ కంటే కూడా కేవలం వినోదానికి మాత్రమే పెద్దపీట వేస్తున్నారు. ప్రస్తుతం ప్రజల జీవితాల్లో కూడా విపరీతమైన ట్రాజడీ ఎక్కువైపోవడంతో థియేటర్ కి నవ్వుకోవడానికి వెళ్దాం అని కూడా కొంతమంది ఆలోచనలో ఉన్నారు.


అనుదీప్ కె.వి దర్శకత్వం వహించిన జాతి రత్నాలు సినిమా తర్వాత అదే శైలి లో ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేయాలి అని కొంతమంది ఆలోచనలో ఉన్నారు. రీసెంట్ గా మౌళి తనూజ్, శివాని నాగారం నటించిన లిటిల్ హార్ట్స్ అనే సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. ఒక చిన్న కథకు క్యూట్ క్యూట్ ఎలిమెంట్స్ యాడ్ చేసి థియేటర్లో మంచి ఫన్ క్రియేట్ చేశారు.

ఇప్పుడు మిత్రమండలి సినిమా విషయంలో కూడా బన్నీ వాస్ మాట్లాడుతూ అదే విషయాన్ని ప్రస్తావించారు. మిత్రమండలి సినిమా మొదలవడానికి అంటే ముందే మీ బ్రెయిన్ ఆఫ్ చేసేయండి, లాజిక్స్ గురించి ఆలోచించకండి. కేవలం నవ్వుకోండి. ఈ సినిమా మీ ముఖానికి ఒక ఎక్సర్సైజ్ లాంటిది. అంటూ బన్నీ వాస్ చెప్పారు.

ఓపెన్ అయిపోయారు 

ఈ సినిమాను దర్శకుడు దాదాపు మూడు నుంచి నాలుగు గంటల వరకు బన్నీ వాసుకి చెప్పారట. చెప్పిన తరుణంలో కనీసం రెండు గంటలసేపు నేను నవ్వుకున్నాను అని తెలిపారు. మధ్యలో ఈ సినిమా గురించి ఏదైనా లాజిక్ అడిగితే, దర్శకుడు వెంటనే అన్నా నువ్వు నవ్వుకున్నావు కదా దయచేసి లాజిక్ అడక్కు అంటూ బన్నీ వాసుకు చెప్పారట.

బన్నీ వాసుకి దర్శకుడు ఏ మాటలైతే చెప్పారు ఈ ఇంటర్వ్యూలో సినిమా గురించి మాట్లాడుతూ బన్నీ వాస్ కూడా ప్రేక్షకులకు అదే కన్వే చేసే పనిలో ఉన్నారు. సినిమాకి సంబంధించి చిన్న చిన్న వర్క్స్ పెండింగ్ ఉండటం వలన దీని రిలీజ్ డేట్ అక్టోబర్ 16 కు తీసుకెళ్లవలసి వచ్చింది. అలానే అదే రోజు దాదాపు నాలుగు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీపడి ఉన్నాయి. బాగున్న సినిమాకే వెళ్తారు అనే కాన్ఫిడెన్స్ నాకుంది అని బన్నీ వాస్ ఓపెన్ గా చెప్పారు.

Also Read: Venkatesh X Trivikram : సెట్స్‌లో త్రివిక్రమ్, వెంకటేష్, మొత్తానికి అజ్ఞాతవాసం వీడిని గురూజీ

Related News

AA22xA6 : అట్లీ అల్లు అర్జున్ సినిమాపై నోరు విప్పలేదు, తెలివిగా ప్రశ్నను దాటేశారు

‎Zarina Wahab -Prabhas: ప్రభాస్ బాలీవుడ్ హీరోల మాదిరి కాదు.. ప్రశంసలు కురిపించిన నటి!

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ కాంబో రిపీట్‌… దర్శకుడు య‌దు వంశీతో నిహారిక మ‌రో మూవీ

‎Peddi Movie: పెద్ది సినిమా పై బిగ్ అప్డేట్.. రాంచరణ్ సూపర్ హ్యాపీ!‎

Brahmakalasha song: కాంతార1 బ్రహ్మకలశ ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్..పూనకాలు తెప్పిస్తోందిగా!

‎SSMB 29: మహేష్ రాజమౌళి సినిమా టైటిల్ ఇదేనా.. ఇలాంటి టైటిల్ ఏంటీ జక్కన్న!

Shahrukh Khan: షారుఖ్ ఖాన్ కు షాక్.. సమన్లు జారీ చేసిన హైకోర్టు!

Big Stories

×