E-Paper
Advertisement

Year Ender 2025 : ఈ ఏడాది డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చి గత్తర లేపిన సినిమాలు… డైరెక్ట్ డిజిటల్ స్ట్రీమింగ్

Year Ender 2025 : ఈ ఏడాది డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చి గత్తర లేపిన సినిమాలు… డైరెక్ట్ డిజిటల్ స్ట్రీమింగ్
Advertisement

Year Ender 2025 : 2025 సంవత్సరం థియేటర్లలో కాకుండా డైరెక్ట్ డిజిటల్ స్ట్రీమింగ్ బాట పట్టిన సినిమాలు అదిరిపోయే రెస్పాన్స్ దక్కించుకున్నాయి. చాలా చిత్రాలు అండర్‌రేటెడ్‌గా మిగిలిపోయినప్పటికీ, కొన్ని ప్రేక్షకుల భారీ సంచలనం సృష్టించాయి. 2025లో అలా డైరెక్ట్ OTTలో విడుదలై దుమ్మురేపిన సినిమాలు ఏంటో చూసేద్దాం పదండి.

Mrs – Zee 5

మలయాళం హిట్ ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’ హిందీ అడాప్టేషన్ ‘మిసెస్’. ఎన్నో కలలు ఉన్న మహిళ అన్నీ వదులుకుని కుటుంబాన్ని పోషించాలా? అనే ఆన్‌లైన్ చర్చను రేకెత్తించింది ఈ మూవీ. అలాగే ఈ ఏడాది టాక్ ఆఫ్ ది టౌన్ అయిన మోస్ట్ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ మూవీ కూడా ఇదే. ఈ మూవీ జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది.

స్టోలెన్ (Stolen) – Amazon Prime Video

Advertisement

అభిషేక్ బెనర్జీ డ్యూయల్ రోల్స్‌లో నటించిన ఈ సినిమా ఇన్స్టంట్ హిట్. కొన్ని ఇంటెన్స్ సీన్స్‌లో అతని నటనతో మూవీ లవర్స్ కు మరచిపోలేని అనుభవాన్ని ఇచ్చాడు. అభిషేక్ యాక్టింగ్ స్కిల్స్, అద్భుతమైన కథాకథనం, వండర్ ఫుల్ విజువల్స్ దీన్ని మస్ట్ వాచ్ మూవీస్ లిస్ట్ లో చేర్చాయి. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది.

కోస్టావో (Costao) – ZEE5

నవాజుద్దీన్ సిద్దీకీ కస్టమ్స్ ఆఫీసర్ కోస్టావో ఫెర్నాండెస్ అనే పాత్రలో అద్భుతంగా నటించాడు. కథ నుండి ఎగ్జిక్యూషన్ వరకు అన్నీ బాగుండడంతో సినిమా మొత్తం ఆడియన్స్ ను ఆకట్టుకునేలా ఉంటుంది. ఈ సినిమా జీ5లో అందుబాటులో ఉంది.

బారాముల్లా (Baramulla) – Netflix

Advertisement

కశ్మీర్‌లోని బారాముల్లా పట్టణం నేపథ్యంలో సాగే హారర్ మూవీ. చాలా మంది ప్రేక్షకులు ఇలాంటి అనుభవాలు ఫేస్ చేశామని చెప్పేంత రియలిస్టిక్ గా దీన్ని తెరకెక్కించారు. మానవ్ కౌల్ లీడ్ రోల్‌లో నటించిన ఈ మూవీ నవంబర్‌లో విడుదలై, ఆ నెలలో నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ స్ట్రీమ్డ్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది.

ది స్టోరీటెల్లర్ (The Storyteller) – jiohotstar

సత్యజిత్ రే కథ ‘గోల్పో బోలియే తారిణి ఖురో’ ఆధారంగా తీసిన సినిమా ఇది. ఇందులో పరేష్ రావల్, ఆదిల్ హుస్సేన్ నటన అద్భుతం. టైటిల్‌కు తగ్గట్టుగా కథ చెప్పే తీరు ప్రధానంగా ప్రశంసలు అందుకుంది. ఇది జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.

గ్రేటర్ కలేష్ (Greater Kalesh) – Netflix

ఇండియన్ ఫ్యామిలీ నుండి వచ్చిన వార్మ్ హగ్ లాంటి సినిమా ఇది. ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్ ఏరియాలోని ఓ కుటుంబంలో గొడవలు, పరిష్కారాలు చూపిస్తుంది. ఈ గ్రేటర్ కలేష్ మూవీని నెట్‌ఫ్లిక్స్‌లో మనం చూడొచ్చు.

ది మెహతా బాయ్స్ (The Mehta Boys) – Amazon Prime Video

బోమన్ ఇరానీ దర్శకత్వ ఫస్ట్ మూవీ ఇది. బోమన్ ఇరానీ, అవినాష్ తివారీ నటించారు. తండ్రి-కొడుకు మధ్య తరాల గ్యాప్, కమ్యూనికేషన్ సమస్యలు చుట్టూ తిరుగుతుంది కథ. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయింది.

లాగ్‌అవుట్ (Logout)- ZEE5

2025లో బాబిల్ ఖాన్‌ను చర్చనీయాంశం చేసిన సినిమా ఇది. స్టాకర్ ఫ్యాన్ తన ఐడల్‌ను హద్దులు దాటి బ్లాక్‌మెయిల్ చేసే కథ. బాబిల్ నటనతో పాటు కథ చెప్పే తీరు బాగా వర్కౌట్ అయింది. ఈ లాగ్ అవుట్ మూవీ జీ5లో అందుబాటులో ఉంది.

Read Also :  ఈ ఫ్రైడే ఓటీటీలో రిలీజ్ కాబోతున్న మోస్ట్ అవైటింగ్ క్రైమ్ థ్రిల్లర్స్… ఈ 5 అస్సలు మిస్సవ్వొద్దు

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×