Eesha Rebba: సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రిటీల గురించి నిత్యం సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వినపడుతూ ఉంటాయి. అయితే ఆ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలి అంటే సెలబ్రిటీలు స్పందిస్తే తప్ప ఆ వార్తలు నిజమని తెలియదు. ఇక ఇండస్ట్రీలో కొనసాగే సెలబ్రిటీల గురించి ఎక్కువగా రిలేషన్షిప్ రూమర్స్ వైరల్ అవుతూ ఉంటాయి. ఇక సెలబ్రిటీలు కూడా ఇలాంటి విషయాలను చూసి చూడనట్టు వదిలేస్తూ ఉంటారు. తాజాగా ఇలాంటి వార్తలు నటి ఈషా రెబ్బ విషయంలో చక్కర్లు కొడుతున్నాయి. గత కొంతకాలంగా ఈమె టాలీవుడ్ దర్శకుడితో ప్రేమలో ఉందనే వార్తలు వినపడుతున్న సంగతి తెలిసిందే.
పెళ్లిచూపులు ఈ నగరానికి ఏమైంది వంటి సినిమాల ద్వారా దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న తరుణ్ భాస్కర్(Tarun Bhaskar) కేవలం డైరెక్టర్ గా మాత్రమే కాకుండా నటుడిగా కూడా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఈయన సీతారామం సినిమాలో బాలాజీ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు. ప్రస్తుతం తరుణ్ భాస్కర్ హీరోగా కూడా సినిమా చేసిన సంగతి తెలిసిందే. తరుణ్ భాస్కర్ హీరోగా “ఓం శాంతి శాంతి శాంతిహి” అనే సినిమాలో నటించారు. ఈ సినిమా మలయాళ చిత్రం” జయ జయ జయ జయ హే”అనే సినిమాకు రీమేక్ చిత్రంగా తెరకెక్కింది. ఇక ఈ సినిమాలో తరుణ్ భాస్కర్ కు జోడిగా నటి ఈషా రెబ్బ(Eesha Rebba) నటించారు.
ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి రిలేషన్ గురించి వార్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వినపడుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు బయటకు వచ్చాయి కానీ ఈ వార్తలపై ఈ జంట ఎక్కడ స్పందించలేదు. ఇక తరుణ్ భాస్కర్ కు ఇదివరకే వివాహం కావడం తన భార్యకు విడాకులు ఇవ్వడం కూడా జరిగింది. అయితే తాజాగా మరోసారి వీరిద్దరి రిలేషన్ గురించి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీపావళి(Diwali) పండుగను పురస్కరించుకొని సెలబ్రిటీలు పెద్ద ఎత్తున వారి సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తున్నారు.
దీపావళి సెలబ్రేషన్స్ లో సెలబ్రిటీలు..
ఈ క్రమంలోనే నటుడు విశ్వక్ సేన్(Vishwak Sen) కూడా దీపావళి పండుగకు సంబంధించిన కొన్ని ఫోటోలు వీడియోలను తన ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు. అయితే ఈ సెలబ్రేషన్స్ లో భాగంగా డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఈషా రెబ్బ జంటగా కనిపించడం విశేషం. అంతేకాకుండా ఈ ఫోటోలలో వీరిద్దరూ ఒకరిపై మరొకరు చేతులు వేసుకొని చాలా చనువుగా కనిపించడంతో వీరిద్దరి రిలేషన్ గురించి వస్తున్న వార్తలు నిజమేనని, ఆ విషయాన్ని ఇలా క్లారిటీ ఇచ్చారు అంటూ పలువురు అభిమానులు ఈ ఫోటోలపై కామెంట్లు చేస్తున్నారు. మరి నిజంగానే ఈ ఇద్దరు రిలేషన్ లో ఉన్నారా? లేదా? అనేది తెలియాలి అంటే ఇద్దరిలో ఎవరో ఒకరు స్పందించాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Also Read: The Paradise: వెనక్కి తగ్గేదే లేదు..చరణ్ కు పోటీగా నాని..పోస్టర్ తో క్లారిటీ!