Allu Sirish: ఇటీవల కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఒక సరి కొత్త ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పుడు ఏదైనా పండుగలు అంటే కేవలం బాలీవుడ్ సెలబ్రిటీలు మాత్రమే పెద్ద ఎత్తున పార్టీలు చేసుకుంటూ పండుగలను సెలెబ్రేట్ చేసేవారు. అయితే ఈ సంస్కృతి టాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా పాకిందని తెలుస్తుంది. దీపావళి పండుగ వచ్చిందంటే చాలు సెలబ్రిటీలు పెద్ద ఎత్తున వేడుకలను నిర్వహిస్తూ ఉంటారు. ఇటీవల ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ బండ్ల దీవాలి అంటూ ఎంతో ఘనంగా దీపావళి సెలబ్రేషన్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఈ వేడుకలో భాగంగా టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన సెలెబ్రిటీలందరూ కూడా పాల్గొని సందడి చేశారు. అయితే మరొక నటుడు అల్లు అర్జున్(Allu Arjun) సైతం దీపావళి వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారని తెలుస్తుంది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ దివాలి సెలబ్రేషన్స్ లో భాగంగా అల్లు శిరీష్(Allu Sirish) తనకు కాబోయే భార్య నైనిక(Nainika) స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. అల్లు శిరీష్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా అల్లు శిరీష్ తెలియజేశారు.
తన తాతయ్య అల్లు రామలింగయ్య జయంతిని పురస్కరించుకొని అల్లు శిరీష్ తాను త్వరలోనే నైనిక రెడ్డి అనే అమ్మాయితో నిశ్చితార్థం(Engagment) జరుపుకోబోతున్నానని తెలియజేశారు. వీరి నిశ్చితార్థం అక్టోబర్ 31వ తేదీ జరగబోతోంది. ఇప్పటికే నయనికకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. తాజాగా అల్లు ఇంట నిర్వహించిన దీపావళి సెలబ్రేషన్స్ లో భాగంగా నైనిక రెడ్డి పాల్గొనడంతో ఈ వేడుక కాస్త స్పెషల్ గా మారింది. ఇలా నైనిక అల్లు శిరీష్ తమ స్నేహితులతో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సూపర్ లుక్ లో బన్నీ, స్నేహ..
ఇక దీపావళి సెలబ్రేషన్స్ లో భాగంగా అల్లు అర్జున్ కూడా పాల్గొని సందడి చేశారు. అల్లు అర్జున్ అట్లీ సినిమా షూటింగ్ పనుల నిమిత్తం ముంబైలోనే ఉంటున్న సంగతి తెలిసిందే. ఇక దీపావళి పండుగను పురస్కరించుకొని ఈయన హైదరాబాద్ చేరుకున్నారు. గత రాత్రి అల్లు ఇంట ఈ దీపావళి సెలబ్రేషన్స్ ఎంతో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాలలో అల్లు అర్జున్ తన భార్య స్నేహ రెడ్డికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక అల్లు అర్జున్ స్నేహ ఇద్దరు సూపర్ క్లాసిక్ లుక్ లో కనిపించడంతో అభిమానులు ఈ ఫోటోలను మరింత వైరల్ చేస్తున్నారు. అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. అట్లీ డైరెక్షన్ లో రాబోయే ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.
Also Read: Eesha Rebba: ఆ డైరెక్టర్ ప్రేమలో ఈషా రెబ్బ.. ఫోటోలతో క్లారిటీ ఇచ్చారుగా!