BigTV English

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నిర్మాతగా ‘తిమ్మరాజుపల్లి టీవీ‘.. దీపావలి పోస్టర్ చూశారా?

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నిర్మాతగా ‘తిమ్మరాజుపల్లి టీవీ‘.. దీపావలి పోస్టర్ చూశారా?
Advertisement


Kiran Abbavaram Thimmarajupalli TV: హీరో కిరణ్ అబ్బవరం ఫుల్ జోరుమీదున్నాడు. ఆయన సినిమాల లైనప్ మామూలుగా లేదు. ఒక సినిమా సెట్లో ఉండగానే మరో చిత్రాన్ని లైన్లో పెడుతున్నాడు. ఏడాది కనీసం రెండు చిత్రాలు చేసేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఫలితాలతో సంబంధం లేకుండ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. తాజా దీపావళి సందర్భంగా కె ర్యాంప్ మూవీని రిలీజ్ చేశాడు. మరోవైపు చెన్నై లవ్ స్టోరీ అనే సినిమా చేస్తున్నాడు. కాగా హీరోగా వెండితెర ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి కిరణ్ అబ్బవరంకు ఇంతవరకు గ్యాప్ లేదు.

నిర్మాతగా కొత్త జర్నీ

వరుసగా సినిమాలు చేస్తూనే వెళుతున్నాడు. ఓ సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాతగానూ మారాడు. క అనే పేరుతో ప్రొడక్షన్ కంపెనీ స్థాపించిన సంగతి తెలియదు. ఈ బ్యానర్ లాంచ్ చేస్తూ.. కొత్త వారికి అవకాశాలు ఇస్తూ కొత్త టాలెంట్ ని ప్రొత్సహించడం దీని ఉద్దేశం అన్నాడు. చెప్పినట్టుగానే అందరకు కొత్త నటీనటులతోనే కిరణ్ అబ్బవరం ఓ సినిమాని ప్రకటించారు. ‘తిమ్మరాజుపల్లి టీవీ’ అనే సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇవాళ దీపావళి సందర్భంగా ఈ చిత్రం నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.


తిమ్మరాజుపల్లె.. టీవీ దీపావళి పోస్టర్

దీపావళి శుభాకాంక్షలు అని చెబుతూ విడుదల చేసిన ఈ కొత్త పోస్టర్ లో లైట్లోతో వెంకటేశ్వర స్వామిని రూపొందించి ఉంది. బ్యాగ్రౌండ్ లోనూ ఊరంత దీపాలతో అలంకరించి కాకర పువ్వోత్తులు వెలుగులో దీపాలతో వెంకటేశ్వరస్వామి వెలిగిపోతున్నాడు. దాని ఎదురుగా ఓ వ్యక్తి నిలుచుని కనిపించాడు. కాగా కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్న ఈ సిసినిమాలో సాయి తేజ్, వేదశ్రీలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అలాగే ప్రదీప్ కొట్టె, తేజ విహాన్, స్వాతి కరిమిరెడ్డి, అమ్మ రమేష్, సత్య నారాయణ వడ్డాది, మాధవి ప్రసాద్, టీవీ రామన్, చిట్టిబాబులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా

విలేజ్ బ్యాగ్రౌండ్ లో రొమాంటిక్ లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందుతోంది. దీనికి వి. విముని రాజు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాతోనే అతడు డైరెక్టర్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇప్పటి వరకు విడుదలైన మూవీ పోస్టర్ సినిమాను మంచి ఆసక్తి పెంచుతున్నారు. పైగా కిరణ్ అబ్బవరం ప్రొడక్షన్ నుంచి ఈ సినిమా వస్తుండటంతో మరింత బజ్ నెలకొంది. కాగా షార్టు ఫిల్మ్స్ తో కెరీర్ ప్రారంభించిన కిరణ్ అబ్బవరం రాజా వారు రాణి వారు చిత్రంతో హీరోగా మారాడు. ఆ తర్వాత ఎస్ఆర్ కళ్యాణమండపం, సమ్మేతమే, నేను మీకు బాగా కావాల్సి వాడిని, వినరో భాగ్యము విష్ణుకథ, మీటర్, రూల్స్ రంజన్, క వంటి చిత్రాలతో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ అలరిస్తున్నాడు. ఇటీవల కె ర్యాంప్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరో.. ఓ రొమాంటిక్ లవ్ స్టోరీ చేస్తున్నాడు. ఓ వైపు హీరోగా ఫుల్ స్విగ్ లో ఉండగానే నిర్మాతగా మారి సినిమాలు కూడా నిర్మిస్తున్నాడు. 

Related News

Ram Pothineni: అప్పుడు రామ్ చరణ్ ని చూస్తే జాలేసింది.. రామ్ షాకింగ్ కామెంట్స్

Ram Charan: రామ్ చరణ్ సెంటిమెంట్ మంత్, పెద్ది రిలీజ్ డేట్ కూడా కారణం అదేనా?

Mass Jathara : అర్థం పర్థం లేని పాటను రిలీజ్ చేసిన మాస్ జాతర యూనిట్

Actor Shivaji: సుధీర్ కి విలన్ గా శివాజీ.. మంగపతిని మించిన పాత్ర ఇది, ఇక వెండితెరపై రచ్చే

Renu Desai: సన్యాసిగా రేణూ దేశాయ్.. కఠిన నిర్ణయం వెనుక కారణం?

Allu Shirish: కాబోయే భార్యతో అల్లు శిరీష్ దీపావళి సెలబ్రేషన్స్…ఫోటోలు వైరల్!

Eesha Rebba: ఆ డైరెక్టర్ ప్రేమలో ఈషా రెబ్బ.. ఫోటోలతో క్లారిటీ ఇచ్చారుగా!

Big Stories

×