BigTV English
Advertisement

OTT Movie : మాజీ ప్రియుడి బ్లాక్ మెయిల్… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్, టర్న్ ఉన్న సినిమా… నరాలు కట్టయ్యే సస్పెన్స్

OTT Movie : మాజీ ప్రియుడి బ్లాక్ మెయిల్… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్, టర్న్ ఉన్న సినిమా… నరాలు కట్టయ్యే సస్పెన్స్

OTT Movie : జి. వి. ప్రకాష్ కుమార్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ సినిమా ‘బ్లాక్‌ మెయిల్’ ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో మిక్స్డ్ టాక్ తెచ్చుకుని, నెల రోజుల తరువాత డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. బాక్సాఫీస్ వద్ద 25 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ సినిమా, ఈ రోజు నుంచి థ్రిల్లర్ అభిమానులను ఎంటర్టైన్ చేస్తోంది. ఈ కథ బ్లాక్‌ మైలింగ్ కాన్సెప్ట్ తో ఉత్కంఠంగా నడుస్తుంది. ఈ సినిమా ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..


ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే

‘బ్లాక్‌ మెయిల్’ (Black mail) 2025 సెప్టెంబర్ 12న విడుదలైన తమిళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా. మ్యూ మారన్ (Iravukku Aayiram Kangal ఫేమ్) దీనికి దర్శకత్వం వహించగా, జయకొడి అమల్‌రాజ్ నిర్మించారు. ఇందులో జి. వి. ప్రకాష్ కుమార్, తేజు అశ్విని, శ్రీకాంత్, బిందు మాధవి
ప్రధాన పాత్రల్లో నటించారు. 2 గంటల 15 నిమిషాల రన్‌ టైమ్ ఉన్న ఈ సినిమా, ఐయండిబిలో 6.5/10 రేటింగ్ పొందింది. బాక్సాఫీస్ వద్ద 25 కోట్లకు పైగా వసూలు చేసింది. Sun NXTలో ఈ సినిమా 2025 అక్టోబర్ 30 నుండి స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీలోకి వెళ్తే

మణి (జి.వి. ప్రకాష్) చెన్నైలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. అతని లవర్ సునీతా (తేజు అశ్విని)తో 2 ఏళ్లుగా హ్యాపీగా ఉంటాడు. ఒక రోజు మణికి ఒక అనామక కాల్ వస్తుంది. నీ పాస్ట్ వీడియో నా దగ్గర ఉంది. 5 లక్షలు ఇవ్వు, లేదంటే సునీతాకు, ఆఫీసుకు పంపుతాను అని బెదిరిస్తారు. ఆ వీడియో మణి 3 ఏళ్ల క్రితం ఎక్స్-లవర్ అర్చనా (బిందు మాధవి)తో ఇంటిమేట్ సీన్. మణి ఇప్పుడు బాగా భయపడతాడు. సునీతాకు చెప్పలేడు. భయంతో ఆ డబ్బును ఒక చోట డ్రాప్ చేస్తాడు. కానీ కాల్స్ ఆగవు, మరో 10 లక్షలు డిమాండ్ చేస్తారు. మణి టెన్షనలో పడతాడు. ఆఫీసు లీవ్ తీసుకుంటాడు. సునీతా ఏమైంది? అని అడుగుతుంది. మణి ఏదో సాకు చెప్పి తప్పించుకుంటాడు. మరోవైపు అశోక్ అనే వ్యక్తికి ఒక కాల్ వస్తుంది. అతని 8 ఏళ్ల కూతురుని స్కూల్ నుండి కిడ్నాప్ చేశామని, 20 లక్షలు ఇవ్వకంటే చంపేస్తామని బెదిరిస్తారు. అశోక్ పోలీసులకు చెప్పకుండా, ఇంటి ఆస్తులు అమ్ముతాడు.


Read Also : వివాదాలతో విజయ్ సేతుపతిని ఆగమాగం చేసిన కాంట్రవర్సీ మూవీ… స్ట్రీమింగ్ డేట్ ఇదే

ఒక రోజు మణి, అశోక్ ఒకే ATM దగ్గర మీట్ అవుతారు. ఇద్దరూ డబ్బు విత్‌డ్రా చేస్తుంటారు. మాటల్లో అశోక్ కిడ్నాప్ స్టోరీ చెబుతాడు. మణి షాక్ అవుతాడు. కిడ్నాపర్ కాల్ నంబర్ మణి బ్లాక్‌మెయిలర్ నంబర్‌తో మ్యాచ్ అవుతుంది. మణి అర్చనాకు కాల్ చేస్తాడు. నువ్వేనా బ్లాక్‌మెయిల్ చేస్తున్నది? అని అడుగుతాడు. అర్చనా: “నేను కాదు, నాకు కూడా బ్లాక్‌ మెయిల్ వచ్చింది. అని కంగారు పడుతుంది. ముగ్గురూ ఒకే బ్లాక్‌ మెయిలర్ కి టార్గెట్ అవుతారు. ఇప్పుడు స్టోరీలో ఉండే అసలు ట్విస్ట్లు బయటికి వస్తాయి. క్లైమాక్స్ ఇంటెన్స్ గా ఉంటుంది. అసలు బ్లాక్‌ మెయిలర్ ఎవరు ? మణి వీడియో అతనికి ఎలా వచ్చింది ? వీళ్ళంతా బ్లాక్‌ మెయిలర్ నుంచి బయట పడతారా ? అనే విషయాలను, ఈ తమిళ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోండి.

 

 

Related News

OTT Movie : అబ్బాయిలకు వలపు వల… పడిపోయారో పరలోకానికే… గ్రిప్పింగ్ లేడీ కిల్లర్ థ్రిల్లర్

OTT Movie : ఒకే రోజు ఓటీటీని షేక్ చేయబోతున్న రెండు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్… ఒక్కోటి ఒక్కో ఓటీటీలో

OTT Movie : మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి ”లోకా చాప్టర్ 1: చంద్ర’… ఈ మూవీ ఎన్ని రికార్డులు బ్రేక్ చేసిందో తెలుసా?

OTT Movie : భర్త ఫ్రెండ్ తోనే ఆ పాడు పని… మైండ్ బెండింగ్ మలయాళ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : మొగుడి శవంతో పెళ్ళాన్ని కుడా వదలకుండా… ఈ అరాచకాన్ని చూడలేం భయ్యా

OTT Movie : మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి బాసిల్ జోసెఫ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్… డోంట్ మిస్

OTT Movie : భర్త లేని టైమ్ లో భార్య గదిలోకి… ఎర్ర చీర కట్టుకున్న అమ్మాయి కన్పిస్తే కథ కంచికే… పిచ్చెక్కించే క్రైమ్ థ్రిల్లర్

Big Stories

×