Nayanthara: సినిమా ఇండస్ట్రీలో ఒక్కసారి క్లిక్ అయిన తర్వాత సెలబ్రిటీలు పెద్ద ఎత్తున రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తూ భారీగా సంపాదిస్తుంటారు. ఇక వారికి ఉన్న దృష్టిలో పెట్టుకున్న దర్శక నిర్మాతలు సైతం వారు అడిగింది మొత్తం ఇవ్వటానికి ఏమాత్రం వెనకాడరు. ఇలా ఒకసారి ఒక సెలబ్రిటీకి మంచి క్రేజ్ వచ్చిన తర్వాత ఎన్నో బ్రాండ్స్ వారి చుట్టూ వాలిపోయి తమ బ్రాండ్లను ప్రమోట్ చేయాలి అంటూ భారీ ఆఫర్లు కల్పిస్తుంటారు. ఇప్పటికే స్టార్ హీరోలు అందరూ కూడా సినిమాలకు దీటుగా పలు బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ బ్రాండ్ అంబాసిడర్ లుగా వ్యవహరిస్తున్నారు.
సౌత్ ఇండస్ట్రీలోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్..
ఈ విషయంలో నయనతార(Nayanatara) హీరోలకు ఏమాత్రం తీసుపోరని చెప్పాలి. సౌత్ సినీ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న నయనతార అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్గా కూడా చలామణి అవుతున్నారు. నయనతార ఒక్కో సినిమాకు 15 నుంచి 20 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం. ఇలా ఇప్పటికీ స్టార్ హీరోయిన్గా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న నయనతార ఎన్నో బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ భారీగా సంపాదిస్తున్నారు.
నిమిషానికి 10 కోట్లు..
ఇకపోతే ఇటీవల టాటా స్కైకి(TATA Sky) సంబంధించిన ప్రమోషన్లలో నయనతార కనిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈమె ఇటీవల ఈ బ్రాండ్ ప్రమోట్ చేయడం కోసం ఏకంగా 10 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఇక ఈ బ్రాండ్ కు సంబంధించి ఆ కంపెనీ కోసం నిమిషం నిడివి గల ఒక యాడ్‌లో నయనతార నటించింది. అంతే కాకుండా కొన్ని ఫోటోలను సైతం ఆ కంపెనీకు పంపించారని తెలుస్తోంది. ఇక ఏడాది కాలంలో ఈమె ఒకటి రెండు సార్లు మినహా ఈ బ్రాండ్ గురించి పెద్దగా ప్రమోట్ కూడా చేయరు. ఇలా నిమిషం వీడియోకే ఈమె పది కోట్ల రూపాయల డిమాండ్ చేస్తున్నారు అంటే తన క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
విడాకుల వార్తలకు చెక్..
ఇక ఇప్పటికే ఈమె వివిధ రకాల బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు. ఇక నయనతార వ్యక్తిగత విషయానికి వస్తే విగ్నేష్ శివన్ (Vignesh Shivan)ను పెళ్లి చేసుకున్న నయనతార ఇద్దరు పిల్లలతో తన వ్యక్తిగత జీవితంలో కూడా సంతోషంగా ఉన్నారు. ఇక ఇటీవల వీరిద్దరి విడాకుల గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నా నేపథ్యంలో విడాకుల వార్తలకు నయనతార చెక్ పెట్టారు. ఇక ప్రస్తుతం ఈమె యశ్ టాక్సిక్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాబోతున్న సినిమాల్లో కూడా నయనతార నటించబోతున్న విషయం తెలిసిందే. ఇలా హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే మరో వైపు నిర్మాతగా పలు సినిమాలను నిర్మిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. నయనతార నిర్మాణంలో “లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ” అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.
Also Read: Anirudh – Ram: ఆ యంగ్ హీరో కోసం సింగర్‌గా మారిన అనిరుధ్.. ఇప్పుడైనా హిట్ వచ్చేనా ?