Prabhas Hanu Title : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో లవ్ స్టోరీస్ తెరకెక్కించే అతి తక్కువ మంది దర్శకులలో హను రాఘవపూడి ఒకరు. హను రాఘవపూడి సినిమాను చాలా అందంగా తెరకెక్కిస్తాడు. తన మొదటి సినిమా అందాల రాక్షసి నుంచి గమనిస్తే, హను ఇప్పటివరకు చేసిన ప్రతి సినిమా చాలా కలర్ ఫుల్ గా ఉంటుంది. లై, పడి పడి లేచే మనసు సినిమాలు మినహాయిస్తే హను చేసిన సినిమాలు అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించుకున్నాయి.
హను రాఘవపూడి సెకండాఫ్ విషయంలో కన్ఫ్యూజ్ అవుతాడు అనే కామెంట్స్ చాలామంది దగ్గర వినిపిస్తూ ఉంటాయి. అవి హనువరకు కూడా చేరాయి. అందుకే సీతారామం విషయంలో కేర్ తీసుకొని బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకునేలా డిజైన్ చేసుకున్నాడు. ఇక మొదటిసారి ప్రభాస్ వంటి పాన్ ఇండియా హీరోతో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి ఫౌజీ అనే టైటిల్ ఖరారు చేసినట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఫౌజీ అనే టైటిల్ ఇప్పటి నుంచే కాదు చాలా రోజుల క్రితం నుంచి వినిపిస్తూ వస్తుంది. అయితే సినిమా టైటిల్ విషయంలో ఏ రోజు కూడా మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు. రీసెంట్ గా దర్శకుడు హనీ మాట్లాడుతూ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా పోస్టర్ వస్తుంది దానితోనే టైటిల్ కూడా రివీల్ చేస్తాం అంటూ చెప్పారు.
అయితే హను కొత్తగా ఏదైనా టైటిల్ పెట్టాడేమో అనే క్యూరియాసిటీ చాలామందికి ఉంది. కానీ తాజా సమాచారం ప్రకారం ఫౌజీ టైటిల్ ఖరారు చేసినట్లే సమాచారం వస్తుంది. అయితే దీనికి సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్ రేపు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదల కానుంది.
అయితే తెలిసిన టైటిల్ కాబట్టి పెద్దగా ప్రభాస్ అభిమానులకు కిక్ ఉండదు. ప్రస్తుతం ఈ మ్యాటర్ తెలిసిన వెంటనే ఈ సినిమా అప్డేట్ మీద పెద్దగా ఆశలు పెట్టుకోవలసిన అవసరం లేదు అని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమా విషయంలో ఇంకో సెంటిమెంట్ కూడా ఉంది. ఫౌజీ అనేది ఇంగ్లీష్ టైటిల్. మామూలుగా హను రాఘవపూడి ఎక్కువగా తెలుగు టైటిల్స్ పెడుతూ ఉంటాడు. అలా తెలుగు టైటిల్స్ పెట్టిన అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమ గాధ, సీతారామం వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించాయి. ఇంగ్లీష్ టైటిల్ పెట్టిన లై ఊహించిన సక్సెస్ సాధించలేదు. ఇది కూడా కొంతమంది ప్రస్తావన లోకి తీసుకొచ్చి సోషల్ మీడియాలో డిస్కషన్ మొదలుపెట్టారు.
Also Read: NTR Neel : హీరో దర్శకుడు గొడవపై క్లారిటీ, స్పెషల్ వీడియో కూడా