Siddu Jonnalagadda: నటుడు సిద్ధూ జొన్నలగడ్డ (Siddu Jonnalagadda)తాజాగా తెలుసు కదా (Telusu Kada)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నీరజ కోనా దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ రాశిఖన్నా(Rashi Khanna), శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty)హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా దీపావళి పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో సిద్దు జొన్నలగడ్డ తన తదుపరి సినిమాలపై ఫోకస్ చేశారు. ఇకపోతే తాజాగా సిద్దు జొన్నలగడ్డ సినిమాలకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
సిద్దు జొన్నలగడ్డ హీరోగా రవికాంత్ పేరేపు దర్శకత్వంలో “కోహినూర్ ” (kohinoor)అనే సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ఇటీవల చిత్ర బృందం వెల్లడించారు. ఇక ఈ సినిమా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భక్తి థ్రిల్లర్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలియజేశారు. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ కు బ్రేకులు పడ్డాయని తెలుస్తోంది. ఈ సినిమాకు ఆర్థిక ఇబ్బందులతో పాటు నిర్మాణా కారణాల వల్ల వాయిదా పడిందని తెలుస్తోంది.
ఇలా ఈ సినిమా షూటింగ్ ఆగిపోవడంతో డైరెక్టర్ రవికాంత్ పేరెపు(Ravikanth Perepu) దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ బ్యాడాస్ సినిమా పనులలో బిజీ అవుతున్నారు. ఈ సినిమా ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా పూర్తి అయిన తరువాత సిద్దు జొన్నలగడ్డ టిల్లు క్యూబ్ లో నటించబోతున్నారు. ఇలా కోహినూర్ సినిమా ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆగిపోయిందనే వార్త సోషల్ మీడియాలో సంచలనగా మారింది. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలి అంటే సితార ఎంటర్టైన్మెంట్ స్పందించాల్సి ఉంది. ఇక ఇటీవల జాక్ సినిమాతో డిజాస్టర్ సొంతం చేసుకున్న సిద్దు జొన్నలగడ్డకు తెలుసు కదా సినిమా మంచి సక్సెస్ అందించింది.
వరుణ్ పాత్రలో మెప్పించిన సిద్దు..
ఈ సినిమా ట్రయాంగిల్ లవ్ స్టోరీతో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇన్ని రోజులు కాస్ట్యూమ్ డిజైనర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న నీరజ కోన మొదటిసారి దర్శకురాలిగా మారిన సంగతి తెలిసిందే. మొదటి సినిమాతోనే డైరెక్టర్ గా నీరజకోన ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమాలో సిద్దు వరుణ్ అనే పాత్రలో కనిపిస్తారు. ఈయన అనాధగా పుట్టి పెరిగి, కాలేజీ రోజుల్లోనే ప్రేమలో పడతారు .అయితే తన ప్రేమను రాగ (శ్రీనిధి శెట్టి) తిరస్కరిస్తుంది.ఆ బాధ నుంచి బయటపడిన వరుణ్ తిరిగి అంజలి (రాశి ఖన్నా) ప్రేమలో పడి తనని పెళ్లి చేసుకుంటారు. ఇలా పెళ్లి తర్వాత వీరి జీవితంలో ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి అనేదే ఈ సినిమా కథ . ఇలా విభిన్నమైన ట్రయాంగిల్ లవ్ స్టోరీ తో సిద్దు జొన్నలగడ్డ హిట్ కొట్టారు.
Also Read: Sravana Bhargavi: సింగర్ హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకులు..సోషల్ మీడియా పోస్టుతో కన్ఫర్మ్?