BigTV English

NTR Neel : హీరో దర్శకుడు గొడవపై క్లారిటీ, స్పెషల్ వీడియో కూడా

NTR Neel : హీరో దర్శకుడు గొడవపై క్లారిటీ, స్పెషల్ వీడియో కూడా
Advertisement

NTR Neel : ఒకప్పుడు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అని మాట్లాడుకునే వాళ్ళం కానీ ఇప్పుడు అంతా కూడా ఇండియన్ సినిమా అని మాట్లాడుకునే స్థాయికి తెలుగు సినిమా ఎదిగిపోయింది. తెలుగులో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలు వస్తున్నాయి. తెలుగు ఆడియన్స్ కూడా ఒక మంచి సినిమాని ఎంకరేజ్ చేయడానికి ఎప్పుడూ ముందుంటారు. కేవలం తెలుగు దర్శకులు మాత్రమే కాకుండా సౌత్ ఇండియా దర్శకులు తీస్తున్న సినిమాలు చూస్తుంటే ఆశ్చర్య పడాల్సిందే.


కే జి ఎఫ్ సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టించాడు ప్రశాంత్ నీల్. ఎస్ నటించిన ఆ సినిమా దాదాపు 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఏ ముహూర్తాన ఆ సినిమాలు హిట్ అయ్యాయో అప్పటినుంచి తెలుగు హీరోలతో ప్రశాంత్ సినిమాలు చేయడం మొదలు పెడుతున్నారు. ప్రభాస్ కి సలార్ రూపంలో అదిరిపోయే సక్సెస్ అందించారు. ఆ సినిమా దాదాపు 500 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా డ్రాగన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

గొడవ పై క్లారిటీ 

గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మరియు ఎన్టీఆర్ మధ్య గొడవలు జరిగినట్లు ఆ వార్తల యొక్క సారాంశం. సినిమా షూటింగ్ కూడా ప్రస్తుతం ఆగిపోయినట్లు కథనాలు వచ్చాయి. అయితే వీటన్నిటిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది చిత్ర యూనిట్.


ఎన్టీఆర్ డ్రాగన్ సెట్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు ఒక వీడియోను చేసి విడుదల చేయనున్నారు. అయితే సినిమా నిర్మాణ దశలో ఉన్నప్పుడే తన తదుపరి సినిమా స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలో ఉంటాడు ప్రశాంత్ నీల్. గతంలో ప్రశాంత్ నీల్ ఇలా చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది అనేది అసలైన విషయం.

హై ఎక్స్పెక్టేషన్స్ 

ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. దీనికి కారణం ఇప్పటివరకు ప్రశాంత్ కు ఉన్న సక్సెస్ రేట్. ఒక కమర్షియల్ సినిమాను ఎలా తీయాలి అనే క్లారిటీ ప్రశాంత్ నీల్ కంప్లీట్ గా ఉంది. ఎలివేషన్స్ తో పాటు ఎమోషన్ రాయడం అనేది ప్రశాంత్ స్ట్రెంత్.

అయితే ఎన్టీఆర్ తో చేయబోయే సినిమాను ఎలా ప్లాన్ చేశాడు అనే క్యూరియాసిటీ చాలామందికి ఉంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ కూడా విపరీతంగా బరువు తగ్గాడు. చాలా ఫంక్షన్స్ లో ఎన్టీఆర్ ను చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. మరోవైపు సినిమాకి తగ్గవలసిన దానికంటే కూడా ఎక్కువ తగ్గిపోయాడు అని వార్తలు కూడా ఉన్నాయి.

Also Read: Sujeeth OG: ప్రభాస్ బర్త్ డే కి పర్ఫెక్ట్ గిఫ్ట్ ఇస్తున్న సుజీత్, అన్ని అలా కలిసొస్తున్నాయి

Related News

Shivanna : గుమ్మడి నరసయ్య పాత్రలో శివన్న, ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్

Ramcharan -Upasana: గుడ్ న్యూస్ చెప్పబోతున్న మెగా కపుల్స్.. వారసుడొస్తున్నాడా?

Rashmika: ప్రేమ అంటే కంట్రోల్ చేయటం కాదు.. గౌరవించడం రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Jr NTR Morphed Pics: అసభ్యకరంగా ఎన్టీఆర్‌ మార్ఫింగ్‌ ఫోటోలు.. సీపీ సజ్జనార్‌కు ఫిర్యాదు

Siddu Jonnalagadda: సిద్దు జొన్నలగడ్డ కోహినూరుకు బ్రేక్ …ఆ సమస్యలే కారణమా?

Parineeti Chopra: పరిణీతి ఒకప్పుడు ఆ స్టార్ హీరోయిన్ కి పీఆర్ గా చేసిందని తెలుసా?

Prabhas Hanu Title : కొత్తదేమీ ఏం లేదు… ప్రభాస్ మూవీ అప్డేట్‌పై హోప్స్ పెట్టుకోవడం దండగ ?

Big Stories

×