BigTV English

Sujeeth OG: ప్రభాస్ బర్త్ డే కి పర్ఫెక్ట్ గిఫ్ట్ ఇస్తున్న సుజీత్, అన్ని అలా కలిసొస్తున్నాయి

Sujeeth OG: ప్రభాస్ బర్త్ డే కి పర్ఫెక్ట్ గిఫ్ట్ ఇస్తున్న సుజీత్, అన్ని అలా కలిసొస్తున్నాయి
Advertisement

Sujeeth OG: షార్ట్ ఫిలిం బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిన అతి తక్కువ మంది దర్శకులలో సుజీత్ ఒకడు. సుజిత్ అప్పట్లో విపరీతంగా షార్ట్ ఫిలిమ్స్ చేశాడు. సుజిత్ షార్ట్ ఫిలిమ్స్ చూసి హీరో ప్రభాస్ తనను పిలిపించాడు. అలా యూవి క్రియేషన్స్ లో రన్ రాజా రన్ సినిమాకి దర్శకుడుని చేశారు. ఆ సినిమా కంటే ముందు సుజిత్ ఒక కథను చెప్పాడు. ఆ కథ ఎందుకో చివరి నిమిషంలో ఓకే కాలేదు.


వెంటనే ఆరు నెలల నుంచి ఒక కథ రాస్తున్నాను అని అబద్ధం చెప్పి చాలా త్వరగా రన్ రాజా రన్ సినిమాను యువి క్రియేషన్స్ కి తీసుకెళ్లాడు. అక్కడ శర్వానంద్ హీరోగా కథ ఓకే అయిపోయింది. కట్ చేస్తే సినిమా కూడా రిలీజ్ అయి మంచి సక్సెస్ సాధించింది. మొదటి సినిమా అయిపోయిన తర్వాత ఏకంగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేశాడు సుజిత్. ప్రభాస్ నటించిన సాహో సినిమా తెలుగులో ఊహించిన రేంజ్ లో ఆడలేదు కానీ నార్త్ లో మాత్రం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. సుజిత్ టాలెంట్ చూసి బాలీవుడ్ ఫిదా అయిపోయింది.

ప్రభాస్ బర్త్ డే కి పర్ఫెక్ట్ గిఫ్ట్ 

సుజిత్ స్వతహాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాని. ఈ విషయం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓజి సినిమాను అంతా బాగా తీయడానికి కారణం కూడా సుజిత్ అభిమాని కావడమే. అయితే యాదృచ్ఛికంగా ఓ జి సినిమాను ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు.


ఓ జి సినిమా ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఓటీటీలో విడుదల అవ్వడం అనేది, సుజిత్ ఇస్తున్న గిఫ్ట్ అనుకోవచ్చు. మరోవైపు ప్రభాస్ నటించిన సాహో సినిమాతో కూడా ఆ సినిమాకి లింక్ ఉంది కాబట్టి అది కూడా కలిసి వచ్చినట్లే.

స్ట్రాంగ్ కం బ్యాక్ 

ఒక సక్సెస్ వచ్చినప్పుడు చాలామంది ఎలా అయితే పొగుడుతారో. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కామెంట్ చేయడానికి వెనకాడరు. వకీల్ సాబ్ సినిమా తర్వాత నుంచి పవన్ కళ్యాణ్ అభిమానులు చెప్పుకునేంత సక్సెస్ఫుల్ సినిమా రాలేదు. మరోవైపు సుజిత్ సాహూతో పలు విమర్శలు ఎదుర్కొన్నాడు. వీరిద్దరూ కూడా ఓ జి సినిమాతో ఒక్కసారిగా స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చారు.

ఇక ప్రస్తుతం సుజీత్ నాని హీరోగా ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నాని పారడైజ్ సినిమా తర్వాత సుజిత్ దర్శకత్వంలో సినిమా మొదలుకానుంది. షారుక్ ఖాన్ హీరోగా కూడా సుజిత్ ఒక సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీని గురించి అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.

Also Read: The Raja saab : ప్రభాస్ బర్త్ డే కి ఫస్ట్ సింగిల్ లేదు, ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే

Related News

Akhil -Zainab: అఖిల్ జైనాబ్ మొదటి దీపావళి.. పెళ్లి తరువాత ఫస్ట్ టైం దర్శనమిచ్చిన కొత్త జంట!

Shivanna : గుమ్మడి నరసయ్య పాత్రలో శివన్న, ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్

Ramcharan -Upasana: గుడ్ న్యూస్ చెప్పబోతున్న మెగా కపుల్స్.. వారసుడొస్తున్నాడా?

Rashmika: ప్రేమ అంటే కంట్రోల్ చేయటం కాదు.. గౌరవించడం రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Jr NTR Morphed Pics: అసభ్యకరంగా ఎన్టీఆర్‌ మార్ఫింగ్‌ ఫోటోలు.. సీపీ సజ్జనార్‌కు ఫిర్యాదు

Siddu Jonnalagadda: సిద్దు జొన్నలగడ్డ కోహినూరుకు బ్రేక్ …ఆ సమస్యలే కారణమా?

Parineeti Chopra: పరిణీతి ఒకప్పుడు ఆ స్టార్ హీరోయిన్ కి పీఆర్ గా చేసిందని తెలుసా?

Prabhas Hanu Title : కొత్తదేమీ ఏం లేదు… ప్రభాస్ మూవీ అప్డేట్‌పై హోప్స్ పెట్టుకోవడం దండగ ?

Big Stories

×