Anirudh – Ram: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా ఇటీవల నటిస్తున్న సినిమాలన్నీ ప్రేక్షకులను ఎంతగానో నిరాశ పరుస్తున్నాయి. ఈయన చివరిగా ఇస్మార్ట్ శంకర్(Ismart Shankar) అనే సినిమా ద్వారా మంచి సక్సెస్ అందుకున్నారు అనంతరం రామ్ నటించిన స్కంద, డబల్ ఇస్మార్ట్, వారియర్ వంటి సినిమాలు ప్రేక్షకులను పూర్తిగా నిరాశపరిచాయి. ఇక ప్రస్తుతం ఈయన డైరెక్టర్ మహేష్ బాబు. పి(Mahesh Babu.P) దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం “ఆంధ్ర కింగ్ తాలూకా”(Andhra King Taluka). ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపకుంటుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కోసం హైదరాబాదులో ప్రత్యేకమైన సెట్ ఏర్పాటు చేశారని ఇప్పటికే కొత్త షెడ్యూల్ చిత్రీకరణ కూడా ప్రారంభమైందని తెలుస్తోంది.
సింగర్ గా మారిన అనిరుద్..
తాజా షెడ్యూల్ చిత్రీకరణలో భాగంగా హీరోయిన్ భాగ్యశ్రీ కూడా జాయిన్ అయ్యారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. హీరో రామ్ కోసం సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్(Anirudh Ravi Chandran) సింగర్ గా మారబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాలో అనిరుధ్ స్వయంగా ఓ పాట పాడబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినపడుతున్నాయి.
పాటలు రాసిన హీరో రామ్..
ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా కోసం స్వయంగా హీరో రామ్ కొన్ని పాటలు రాసినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే రామ్ రాసిన ఒక పాటను అనిరుద్ పాడబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ పాటపై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలి అంటే చిత్ర బృందం అధికారక ప్రకటన తెలియజేసే వరకు ఎదురు చూడాల్సిందే. ఇలా రామ్ సినిమాలో అనిరుద్ పాట పాడబోతున్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో సినిమా పట్ల కూడా కాస్త అంచనాలు పెరిగిపోయాయి. మరి ఈ సినిమా ద్వారా అయినా రామ్ హిట్ కొడతారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. అయితే ఇది వరకే సినిమా నుంచి విడుదల చేసిన ఒక గ్లింపు వీడియో మాత్రం ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది.
కీలక పాత్రలో కన్నడ నటుడు ఉపేంద్ర…
ప్రస్తుతం, రామ్, భాగ్యశ్రీ బోర్సే పై ప్రేమ సన్నివేశాలను నైట్ బ్యాక్ డ్రాప్ లో చిత్రీకరిస్తున్నారు. ఈ నైట్ షెడ్యూల్ 10 రోజుల పాటు కొనసాగుతుంది. ఆ తర్వాత క్లైమాక్స్, ఇతర కీలక సన్నివేశాలను 20 రోజులలో పూర్తి చేయబోతున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమాలో కన్నడ నటుడు ఉపేంద్ర కూడా కీలక పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నారు. ఆంధ్ర కింగ్ తాలూకా హిట్ కావటం రామ్ కెరియర్ కు ఎంతో కీలకంగా మారిందని చెప్పాలి. ఈ సినిమా హిట్ అయితేనే ఈయన కెరియర్ కు ఎలాంటి ఇబ్బంది ఉండదని లేకుంటే చిక్కులు తప్పవని చెప్పాలి.
Also Read: Kiara Advani: ప్రెగ్నెన్సీ విషయంలో కియారా కీలక నిర్ణయం… గ్రేట్ అంటూ ప్రశంసలు!