Ramya Krishna Talk About Sivagami Role: రమ్యకృష్ణ.. ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు ఇది. సౌత్ ఇండస్ట్రీలో రమ్యకృష్ణ స్పెషల్ ఇమేజ్ ఉంది. సినిమాల్లో స్ట్రాంగ్ లేడీ రోల్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు రమ్యకృష్ణదే. పాజిటివ్ అయినా నెగిటివ్ రోలైనా స్ట్రాంగ్ లేడీ రోల్స్కి ఆమె కేరాఫ్ అడ్రస్ అన్నట్టుగా మారాయి. 90’sలో హీరోయిన్గా సహా నటీమణలకు గట్టి పోటి ఇచ్చింది. ఇప్పుడు తల్లి, అత్త పాత్రల్లోనూ తనదే పైచేయి. రమ్యకృష్ణ అంటే గ్లామరస్ రోల్స్కి మాత్రమే పరిమితం కాదు.. అమ్మోరు తల్లి లాంటి దేవత పాత్రల్లో నటించిన తనదైన ముద్ర వేసుకుంది.
ఎలాంటి పాత్ర ఇచ్చిన అందులో పరకాయం ప్రవేశం చేసిందా అన్నట్ట ఉంది. ఆమెకు పాత్ర ఇవ్వడం కాదు.. పాత్రే ఆమెను ఎంచుకుంటుంది. అంతలా రమ్యకృష్ణ గుర్తింపు పొందారు. ఇప్పటి వరకు ఆమె నటించిన ఎన్నో పాత్రలు స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేశాయి. అందులో నరసింహాలో నీలాంబరి రోల్ ఓ జనరేషన్ నే శాసించింది. ఇప్పుడు బాహుబలిలో శివగామి పాత్ర మైలురాయిగా నిలిచింది. బాహుబలిలో కట్టప్ప తర్వాత అంతటి ప్రాముఖ్యత సంపాదించుకున్న రోల్ ఇదే. బాహుబలి అంటే ముందుగా గుర్తొచ్చేది శివగామినే. అంతగా ఆకట్టుకున్న ఈ రోల్ రమ్యకృష్ణకు వెళ్లడంతో ఆడియన్స్ తో పాటు మూవీ టీం కూడా ఫుల్ హ్యాపీ.
ఆఖరికి డైరెక్టర్ రాజమౌళి కూడా ఈ పాత్ర ఫైనల్గా రమ్యకృష్ణ రావడం మా టీం అదృష్టం అని కూడా పలు సందర్భాల్లో పేర్కొన్నారు. నిజానికి ఈ పాత్రకు రమ్యకృష్ణ ఫస్ట్ ఛాయిస్ కాదనే విషయం తెలిసిందే. ముందుగా ఈ రోల్ కి దివంగత నటి, అతిలోక సుందరి శ్రీదేవిని అనుకున్నారు. తను పెట్టిన కండిషన్స్, రెమ్యునరేషన్ వల్ల ఈ రోల్ రమ్యకృష్ణ దగ్గరి వెళ్లింది. శ్రీదేవిని వద్దనుకోవడంతో మూవీ టీం శివగామి కోసం రమ్యకృష్ణను తీసుకోవాలని నిర్ణయించుకున్నారట. దీంతో నిర్మాత శోభు యార్లగడ్డ రమ్యకృష్ణకు ఫోన్ చేసి అసలు విషయం చెప్పకుండ 40 రోజులు డేట్స్ అడిగారట.
బాబోయ్ నలభై రోజులా.. అయ్యే నా వల్ల కాదు అని వెంటనే ఫోన్ పెట్టేశారట. అప్పటికీ ఇది బాహుబలి మూవీని తను తెలియదట. బిగ్ బడ్జెట్ ఫిలిం మాత్రమే అని తెలుసు అన్నారు రమ్యకృష్ణ. తాజాగా జగపతి బాబు జయమ్ము నిశ్చయమ్మురా షోలో ఈ విషయాన్ని వెల్లడించింది రమ్యకృష్ణ. కాగా జగపతి బాబు హోస్ట్గా జయమ్ము నిశ్చయమ్మురా అనే టాక్ షో వస్తున్న సంగతి తెలిసిందే. దీని ద్వారా సినీ సెలబ్రిటీలను హోస్ట్ చేస్తూ వారికి సంబంధించిన ఆసక్తికర విషయాలను బయటపెట్టిస్తున్నాడు ఈ ఫ్యామిలీ హీరో. ఇందులో భా గంగా తాజాగా ఎపిసోడ్ రమ్యక్రష్ణ గెస్ట్ గా వచ్చి తనకు సంబంధించిన ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. అంతేకాదు జగపతి బాబు చాలా సరదాగా మాట్లాడుతూ షోలో సందడి చేశారామె.