Parineeti Chopra:సాధారణంగా సినిమా అనే రంగుల ప్రపంచంలో తమకంటూ ఒక గుర్తింపు ఉండాలని ఎంతోమంది ఈ ప్రపంచంలోకి అడుగు పెడతారు. అయితే అలా వచ్చిన వారికి అదృష్టం తలుపు తడుతుందా అంటే చెప్పలేని పరిస్థితి. కొంతమంది మొదటి సినిమాతోనే స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంటే.. మరికొంతమంది ఎంత కష్టపడినా సరే ఆ సక్సెస్ లభించదు. అయితే ఇండస్ట్రీపై ఉండే ఇష్టంతో ఇండస్ట్రీని వదిలి వెళ్ళలేక సినీ పరిశ్రమలోనే చిన్న చిన్న ఉద్యోగాలు చేసి ఇప్పుడు ఇండస్ట్రీని శాసించే స్టార్డంను కూడా అందుకుంటున్నారు. అలాంటి వారిలో పరిణితి చోప్రా (Parineeti Chopra) కూడా ఒకరు. ఒకప్పుడు స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకోవాలని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. దాంతో ఒకప్పటి స్టార్ హీరోయిన్ కు పీ ఆర్ గా కూడా పనిచేసింది పరిణీతి చోప్రా.
ఇక ఇప్పుడు ఇండస్ట్రీలో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్ గా పేరు సొంతం చేసుకోవడమే కాకుండా తల్లిగా ప్రమోషన్ కూడా పొందింది. ప్రస్తుతం మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్న ఈమె తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా “ఆస్క్ మీ ఎనీథింగ్” సెషన్ లో తన ప్రారంభ కెరియర్ గురించి వెల్లడించింది.. హీరోయిన్ గా సినిమాలలో కనిపించడానికి ముందు తాను చేసిన పని గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది.
ALSO READ:Bigg Boss 9 Promo: మాధురికి ఝలక్ ఇచ్చిన ఇమ్ము… ఫైనల్‌గా తల్లీ కొడుకులు ఒక్కటైయ్యారు!
పరిణీతి చోప్రా మాట్లాడుతూ..” నేను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో అనుష్క శర్మకి పిఆర్ గా పనిచేశాను. బ్యాండ్ బాజా భారత్ కోసం ఆమె ఇంటర్వ్యూలను షెడ్యూల్ చేయడం నుండి లేడీస్ వర్సెస్ రికీ బహల్ లో నటిగా మారడం వరకు పనిచేశాను. అయితే కేవలం మూడు నెలలు మాత్రమే ఆమె దగ్గర పని చేశాను. అప్పటినుండి నాకు ఆమెపై అపారమైన గౌరవం ఉంది” అంటూ చెప్పుకొచ్చింది.
ఇకపోతే అనుష్క శర్మ దగ్గర పనిచేస్తున్నప్పుడే.. 2011లో వచ్చిన లేడీస్ వర్సెస్ రికీ బహల్ సినిమాలో చిన్న పాత్ర ద్వారా తన కెరీర్ ను ఆరంభించింది పరిణీతి చోప్రా. ఆ తర్వాత నెమ్మదిగా బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంది. ఇకపోతే సినిమాల్లోకి రాకముందు యష్ రాజ్ ఫిలిమ్స్ లో మార్కెటింగ్ విభాగంలో కూడా పనిచేసింది. ఈమె ఎవరో కాదు గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) సోదరి. ప్రియాంక చోప్రానే ఈమెను స్టూడియో బృందానికి పరిచయం చేసింది. ఆ తర్వాత మనీష్ శర్మ మూడు చిత్రాలకు ఈమెను ఎంపిక చేశారు. తర్వాత స్టూడియో నుండి నటన రంగంలోకి అడుగుపెట్టిన పరిణీతి చోప్రా ఒక్కో మెట్టు ఎదుగుతూ.. స్టార్ హీరోయిన్గా పేరు సొంతం చేసుకుంది. అంతేకాదు బాలీవుడ్ లో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న నటీమణిగా కూడా పేరు సంపాదించింది. ఇటీవల పండంటి మగ బిడ్డకు కూడా జన్మనిచ్చింది.