అంతా చూస్తునే ఉన్నారు.. వాటిని చూసి కళ్లు తిప్పుకోలేకపోతున్నారు.. మిరుమిట్లుగొలిపే మణులు.. మెరిసిపోతున్న వజ్రాలు.. ఆనాటి రాణుల వైభవానికి చెందిన ఆభరణాలు.. కానీ ఇంతలో కాస్త అలజడి.. అటు ఇటు చూసేలోపు మణులు, వజ్రాలు పొదిగిన ఆభరణాలు, కిరిటాలు మాయం.. ఇదేదో బాలీవుడ్ మూవీ, హాలీవుడ్ మూవీ సీన్ కాదు.. జస్ట్ ఏడండే ఏడే నిమిషాల్లో వెలకట్టలేని చారిత్రక సంపదను దోచేసి చెక్కేశారు. మొత్తం ఎనిమిది ఆభరణాలను దోచేశారు. ఇంతకీ ఆ ఏడు నిమిషాల్లో ఏం జరిగింది? ఆ ఎనిమిది ఆభరణాల కథేంటి?
ఫుల్ టైట్ సెక్యూరిటీ.. ప్రతి ఒక్కరిని కవర్ చేసేలా సీసీ కెమెరాలు.. 24 X 7 ఆర్మ్‌డ్ గార్డ్స్‌తో నిఘా.. అయినా ప్రపంచంలోని అత్యంత విలువైన ఆభరణాలు మాయం.. ఇది బాలీవుడ్డో.. హాలీవుడ్ మూవీలోని సీన్ కాదు.. పారిస్ నగరం నడిబొడ్డున ఉన్న అత్యంత ప్రతిష్టాత్మకమైన లూవ్ మ్యూజియంలో అందరూ చూస్తుండగా.. జరిగిన ఘరానా చోరీ.. ఇంకా పక్కగా చెప్పాలంటే హెయిస్ట్ ఆఫ్ ది డికెడ్.. కాదు సెంచరీ అని చెప్పవచ్చు.
లూవ్ మ్యూజియం.. ఆకర్షణీయమైన కట్టడమే కాదు.. ఫ్రాన్స్ చారిత్రక సంపదకు ఓ కేరాఫ్. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మోనాలిసా ఆర్ట్‌తో పాటు.. అసలు వెలకట్టలేని ఆభరణాలకు కొలువు ఈ మ్యూజియం. అలాంటి మ్యూజియం ఉదయం తెరుచుకున్నవెంటనే సింపుల్‌గా బైక్‌లపై వచ్చి నెపొలియన్ కాలానికి చెందిన ఆభరణాలను కొట్టేశారు నలుగురు దొంగలు. అది కూడా జస్ట్ ఏడు నిమిషాల్లో. ఈ ఏడు నిమిషాల్లోనే వారు రావడం.. ఆభరణాలను దొంగిలించడం.. వాళ్లు బయటపడటం.. మళ్లీ బైక్‌లపై వెళ్లిపోవడం అన్నీ జరిగిపోయాయి. అదేదో మూవీలో చెప్పినట్టు.. వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి.. కళ్లముందే డబ్బు ఉంది.. ఇంతలో ఢమాల్ అని శబ్ధం.. చూస్తే డబ్బు మాయం అన్నట్టుగా.. ఇక్కడ కూడా నలుగురు ముసుకు వేసుకొని రావడం… అందరిని బెదిరించడం.. ఆ నగలను పట్టుకోవడం.. వెళ్లిపోవడం జరిగిపోయింది. ఈ టోటల్ హెయిస్ట్‌లో జరిగిన మంచి విషయం ఏదైనా ఉందంటే.. వారు ఎవరిని గాయపరచలేదు.. ఎవరిని ఇబ్బంది పెట్టలేదు.. అవసరం లేని డ్రామా అస్సలు చేయలేదు.
మరి ఈ దొంగలు దోచుకెళ్లిన ఆభరణాలేంటి? నేపోలియన్ వన్.. తన రెండో భార్య అయిన రాణి మేరి లూసీకి ఇచ్చిన ఓ నెక్లెస్.. దాని మ్యాచింగ్ ఇయర్ రింగ్స్. (Green) నేపోలియన్ త్రీ తన మూడో భార్య రాణి యుగ్నేయికి గిఫ్ట్‌గా ఇచ్చిన కిరీటం.. ఇందులో 2000 డైమండ్స్ ఉన్నాయి .. ( White Pearls ) ఫ్రాన్స్ చివరి రాణి అయిన మేరీ అమెలీకి చెందిన ఓ కిరీటం, నెక్లెస్, సింగిల్ ఇయర్ రింగ్.. (Blue) ఈ కిరీటంలో 8 మణులతో పాటు.. 631 డైమండ్స్ ఉన్నాయి. దొంగలు హడావుడిలో తాము దొంగిలించిన మరో అత్యంత విలువైన కిరిటాన్నీ అక్కడే పడేశారు. క్వీన్ యుగ్నేయికి చెందిన కిరీటం అది. ఇందులో 1354 డైమెండ్స్.. 56 ఎమరాల్డ్స్ ఉన్నాయి. సో.. ఇవన్నీ వెల కట్టలేనివి. ఎందుకంటే.. అందులో పొదిగి ఉన్న డైమెండ్లు, మణులతో పాటు.. వాటికున్న చారిత్రక నేపథ్యం అలాంటిది. అందుకే ఈ చోరిని హెయిస్ట్ ఆఫ్ ది సెంచరీ అని అంటున్నారు నిపుణులు.
కానీ ఈ చోరి విధానాన్ని చూస్తే పక్కా ప్లానింగ్ ప్రకారమే జరిగిందని అర్థమవుతోంది. ఎందుకంటే మ్యూజియంలో ప్రస్తుతం రెనోవేషన్ వర్క్ జరుగుతోంది. నలుగురు దొంగల ఎంట్రీ కూడా మ్యూజియం సెక్యూరిటీ గార్డ్స్ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మ్యూజియం రెనోవేషన్ వర్క్స్ కోసం వచ్చిన ఓ క్రేన్ మ్యూజియం ముందు పార్క్ చేసి ఉంది. నలుగురు దొంగలు ఆ క్రేన్‌ను ఎక్కి.. ఫస్ట్ ఫ్లోర్‌కు వచ్చేశారు. అక్కడున్న గ్లాస్‌ను ఎలక్ట్రిక్ కట్టర్‌తో కట్ చేశారు.. లోపలికి ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రేన్ పుణ్యమా అని వారు నేరుగా అపోలో గ్యాలరీలోకి ఎంట్రీ ఇచ్చారు.
ఈ అపోలో గ్యాలరీ చాలా స్పెషల్ అనే చెప్పాలి. ఫ్రెంచ్ చారిత్రక సంపద అంతా ఈ గ్యాలరీలోనే ఉంటుంది. దీనిని లూయిస్ 14.. 1661లో నిర్మించారు. ఈ గ్యాలరీలో మధ్యలో ఉన్నాయి ఈ చోరి అయిన ఆభరణాలు. దీన్ని బట్టి అర్థమైంది ఏందంటే.. వారి చేతికి అందింది దోచుకెళ్లాలన్నది దొంగల ప్లాన్ అస్సలే కాదు. అదే నిజమైతే.. కిటికీకి దగ్గరగా ఉన్న ఆభరణాలను పట్టుకొని ఉడాయించాలి. కానీ అలా జరగలేదు. గ్యాలరీ మధ్యలో ఉన్న విలువైన ఆభరణాల వద్దకు వచ్చి చోరి చేశారు.
ఆభరణాల చోరీ జరగ్గానే అలారం మోగింది.. సెక్యూరిటీ గార్డ్స్ విజిటర్స్‌ను బయటికి పంపే పనిలో ఉన్నారు.. కానీ చోరి చేసిన వారు ఏ కిటికీ గుండా లోపలికి వెళ్లారో.. అలానే బయటికి వచ్చారు.. అలానే ఆ ట్రక్ నుంచి కిందకు దిగారు. బైక్‌లపైనే వెళ్లిపోయారు. వెళ్లేప్పుడు ఆ ట్రక్‌ను కాల్చేయాలని చూశారు. నిప్పు కూడా పెట్టారు. కానీ మ్యూజియం స్టాఫ్ ఆ నిప్పును ఆర్పేశారు. ఈ టోటల్ చోరీలో మ్యూజియం స్టాఫ్ అడ్డుకున్నది ఆ మంటలను మాత్రమే.
ఈ కథ మొత్తం జస్ట్ ఏడు నిమిషాల్లో జరిగింది. ఇప్పుడు వీరిని పట్టుకోవడం అధికారులకు సవాల్‌గా మారింది. మొత్తం 60 మంది అధికారులను ఈ చోరీ దర్యాప్తు కోసం నియమించారు. కానీ కొన్ని ప్రశ్నలు మాత్రం అలానే మిగిలి ఉన్నాయి. ఆ ట్రక్‌ను దొంగలే ప్లాన్ చేసి అక్కడ ప్లేస్ చేశారా? లేక అనుకోకుండా జరిగిందా? నెపొలియన్ కాలంనాటి ఆభరణాలనే టార్గెట్ చేయడం వెనకున్న కథేంటి? ఈ కొట్టేసిన ఆభరణాలతో ఏం చేయబోతున్నారు? ఈ ఆభరణాలను బహిరంగ మార్కెట్‌లో అమ్మలేరు.. మరి బ్లాక్ మార్కెట్‌లో ఎవరు కొంటారు? ఇంత రిస్క్ చేసి చేసిన హెయిస్ట్ అసలు దేని గురించి?
ఈ చోరి ఇప్పుడు మళ్లీ చరిత్రను గుర్తు చేసింది. ఈ లూవ్ మ్యూజియంలో జరిగిన దొంగతనాలను కళ్ల ముందుకు తీసుకొచ్చింది. మోనాలిసా ఆర్ట్ చోరి ఉదంతాన్ని గుర్తు చేసింది. ఇంతకీ అప్పుడు నిందితుడిని ఎలా పట్టుకున్నారు? ఇప్పుడు ఈ నిందితులను పట్టుకునే చాన్స్ ఉందా?
లూవ్ మ్యూజియం.. యూరోపియన్ యూనియన్ చారిత్రక సంపదకు కేరాఫ్. వరల్డ్ ఫేమస్ మోనాలిసా పెయింటింగ్ నుంచి మొదలుపెడితే యూరోప్‌ను పాలించిన చివరి రాజుల వరకు అన్నింటికి సంబంధించిన చారిత్రక గుర్తులు కొలువై ఉన్న మ్యూజియం అది. అలాంటి లూవ్‌ను టార్గెట్‌గా చేసుకున్నారు దొంగలు. నాటో ఓన్లీ లూవ్.. పారిస్‌లోని అనేక మ్యూజియాలు ఇప్పుడు దొంగల టార్గెట్‌గా మారాయి. ఇంతకీ ఈ వరుస చోరీల వెనక రీజన్సేంటి? అసలు ఈ చోరీ వస్తువులను కొనేదెవరు?
లూవ్ మ్యూజియంలో చోరీ జరగడం ఇది చివరిసారి అవుతుందో లేదో తెలియదు కానీ.. మొదటిసారి మాత్రం అస్సలు కాదు. ప్రపంచప్రఖ్యాతి గాంచిన చిత్రాలు, ఆభరణాలకే కేరాఫ్ అయిన ఈ లూవ్ మ్యూజియంలో గతంలో కూడా చోరీలు జరిగాయి. మోనాలిసా… ప్రపంచంలో ఈ పేరు తెలియని వారు ఉండరు.. ఈ మోనాలిసా చిత్రం కూడా ఈ లూవా మ్యూజియంలోనే ఉంటుంది. 1911లో ఈ చిత్రం చోరీ అయ్యింది. లియోనార్డో డావిన్సి గీసిన ఈ చిత్రాన్ని ఈ మ్యూజియంలో పనిచేసే ఉద్యోగి ఎత్తుకు పోయాడు. శుభ్రం చేసే సమయంలో ఆ చిత్ర పటాన్ని సింపుల్‌గా తన కోట్ కింద దాచేసి తీసుకెళ్లాడు. రెండేళ్ల తర్వాత అతడిని పట్టుకుని ఈ చిత్రాన్ని తెచ్చి మళ్లీ సేమ్ ప్లేస్‌లో పెట్టారు.
మళ్లీ 1956లో కూడా మోనాలిసా పెయింటింగ్‌నే టార్గెట్ చేశారు. ఓ విజిటర్ ఈ పెయింటింగ్‌పై రాయి విసరడంతో ఈ పెయింటింగ్ కాస్త దెబ్బతిన్నది. దీంతో అప్పటి నుంచి ఓ ప్రొటెక్టెడ్ గ్లాస్‌లో ఈ పెయింటింగ్‌ను ఉంచారు. ఆ తర్వాత 1998లో 19వ శతాబ్ధానికి చెందిన ది లుషెమన్ డూసెప్రూ పెయింటింగ్‌ను దొంగలించారు. దీన్ని ఇప్పటి వరకు కనిపెట్టలేకపోయారు. ఈ చోరీ తర్వాత మ్యూజియం భద్రతను భారీగా పెంచారు. ఆ తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు ఓ భారీ చోరీ జరిగింది.
నాట్ ఓన్లీ లూవ్.. ఈ మధ్య పారిస్‌లో వరుస చోరీలు జరుగుతున్నాయి. అదీ కూడా మ్యూజియంలోనే జరుగుతుండటం ఇప్పుడు కొత్త అనుమానాలకు తెర లేపుతోంది. 2024 నవంబర్‌లో కాగ్నాక్ జే మ్యూజియంలో ఏడు చారిత్రక వస్తువులను దోచుకెళ్లారు. ఇందులో ఐదింటిని రికవరీ చేశారు. అదే నెలలో బుర్గుండీలోని హిరోన్ మ్యూజియంలో కూడా చోరీ జరిగింది. అత్యంత విలువైన కళాఖండాలను దోచుకెళ్లారు. ఇక లాస్ట్ మంత్ ఆడ్రియన్ డూబూష్ మ్యూజియంలో కూడా చోరి జరిగింది. ఇందులో 11 మిలియన్ డాలర్ల విలువైన పింగాణి వస్తువులను చోరీ చేశారు. ఇందులోని గోల్డ్ విలువే 7 లక్షల డాలర్ల వరకు ఉంటుంది.
ఇప్పుడు.. పారిస్‌లోని మ్యూజియాలను కొందరు టార్గెట్ చేశారు. ఇది ఒకే గ్యాంగ్ చేస్తున్న పనా? లేక వేరువేరుగా జరుగుతున్న చోరీలా? అనేది ఇప్పటి వరకు తేలలేదు. ఇప్పటికే వందల మంది అధికారులు.. అందులో మ్యూజియం చోరీల దర్యాప్తులో ఎక్స్‌పర్ట్స్‌ను రంగంలోకి దించారు.
చోరీ చేశారు సరే.. మరి వీటిని మార్కెట్‌లో ఎలా అమ్ముతారు? ఇప్పుడిదే అసలైన ప్రశ్న. ఎందుకంటే ఇలాంటి అమూల్యమైన, విలువైన వస్తువులను కొనడం అనేది సాధారణ వ్యక్తులు కలలో కూడా ఊహించని విషయం. అందుకే బ్లాక్ మార్కెట్‌లో వీటిని ఎవరు కొనుగోలు చేస్తారనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది. అయితే ఇక్కడ మరో ప్రమాదం ఉంది. అదేంటంటే.. ఈ విలువైన ఆభరణాల్లో వందల కొద్ది డైమండ్స్, మణులు ఉంటాయి. వీటిని వేరు చేసి మార్కెట్‌లో అమ్ముకుంటు వెళితే మాత్రం వాటిని కనిపెట్టడం అంత సులువు కాదు. మరో విషయం ఏంటంటే.. ఈ ఆభరణాల్లో ఇక్కడ బంగారం కంటే విలువైనవి.. వందల ఏళ్ల కాలం నాటి వజ్రాలవి. వాటిని ముక్కలు చేస్తే దాని విలువ కూడా వందరెట్లు పడిపోయినట్టే. అంతేకాదు దీని వల్ల రెండు నష్టాలు ఉన్నాయి. ఒకటి.. దొంగలను పట్టుకోవడం కాస్త కష్టంగా ఉంటుంది. రెండోది.. చరిత్రకు సంబంధించి ఓ ఆనవాలు తుడిచిపెట్టుకుపోయినట్టే.
ఈ చోరి ఇప్పుడు వరల్డ్‌వైడ్ అటెన్షన్ గ్రాబ్ చేయడంతో ఈయూలోని మ్యూజియాల భద్రతపై కొత్త ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. ఇంత భారీ స్థాయిలో భద్రతా ఉన్నా.. దొంగలు అంత సింపుల్‌గా ఎలా చోరి చేశారు? అనేది ఇప్పుడు అధికారులను వేధిస్తున్న ప్రశ్న. అంతేకాదు చోరీ జరిగిన తర్వాత కూడా వారిని కనిపెట్టలేని పరిస్థితి ఉంది. పారిస్ అనేది వెల్ డెవలపుడ్ ఏరియా.. ప్రతి అడుగుకు ఓ సీసీ కెమెరా ఉంటుంది. వారిని మ్యూజియంలోనే అడ్డుకోలేకపోవడం ఓ అవమానమైతే.. పారిస్ లాంటి నగరంలో వారిని గుర్తించలేకపోవడం మరో అవమానం.
కానీ హిస్టరీని చూస్తే ఇలాంటి చోరీలు జరిగినప్పుడు దొంగలను పట్టుకునేందుకు కొన్ని సార్లు సంవత్సరాల సమయం పట్టింది. కానీ ఇంత టెక్నాలజీ ఉన్న ఈ సమయంలో కూడా ఇలాంటి చోరీలు జరగడం.. వారిని ఇంకా గుర్తించలేకపోవడం ఇప్పుడు పారిస్ పోలీసులకు అస్సలు డైజెస్ట్ అవ్వడం లేదు. మరి వారిని పట్టుకోగలరా? పోయిన చారిత్రక ఆనవాళ్లను తిరిగి అదే మ్యూజియానికి చేర్చగలరా? ఆ దొంగలను తగిన గుణపాఠం చెప్పగలరా? మరోసారి ఇలాంటి భద్రతా లోపాలు తలెత్తకుండా జాగ్రత్త పడగలరా? ఏమో కాలమే సమాధానం చెప్పాలి.
ఇప్పటికే ఆభరణాలు చేజారాయి. దొంగల కోసం వేట ప్రారంభమైంది. మరి ఈ వేట సక్సెస్ అవుతుందా? ఒకవేళ సక్సెస్ అయినా పోయిన ఆభరణాలు తిరిగి వస్తాయా? యూరోప్ చారిత్రక సంపద తిరిగి మ్యూజియానికి చెరుతుందా? ఇప్పుడీ ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతోంది. అప్పటి వరకు ఎదురు చూడటం తప్ప మరేం చేయలేని పరిస్థితి.
Story By Vamshi, Big Tv