Rashmika: నటి రష్మిక మందన్న(Rashmika Mandanna) ప్రస్తుతం తన కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో వరుస సినిమాలలో నటిస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్న రష్మిక ఏకంగా పది రోజుల వ్యవధిలోనే రెండు సినిమాలను విడుదల చేయబోతోంది. ఇప్పటికే ఈమె నటించిన థామా (Thamaa)సినిమా అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. హర్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 21వ తేదీ విడుదల అయ్యి మంచి టాక్ సొంతం చేసుకొని భారీ కలెక్షన్లను రాబడుతుంది. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రష్మిక ఈ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తూనే మరోవైపు ది గర్ల్ ఫ్రెండ్ (The Girl Friend)సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో కూడా ఎంతో బిజీగా గడుపుతున్నారు. సినీ నటుడు రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran)దర్శకత్వంలో రష్మిక, దీక్షిత్ శెట్టి (Deekshith Shetty)జంటగా నటించిన ఈ రొమాంటిక్ చిత్రం నవంబర్ 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. గీత ఆర్ట్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరికెక్కిన ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే నటుడు దీక్షిత్ శెట్టితో పాటు రష్మిక, రాహుల్ రవీందర్ ముగ్గురు కలిసి సింగర్ చిన్మయితో ఒక ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఎన్నో విషయాల గురించి ప్రస్తావించారు.
ఈ క్రమంలోనే చిన్మయి రష్మికను ప్రశ్నిస్తూ.. ప్రేమ అంటే ఒకరిని ఒకరు కంట్రోల్ చేసుకోవడమేనా ? అని అడిగారు. ఈ ప్రశ్నకు రష్మిక సమాధానం చెబుతూ.. ఈ విషయం సాడ్ రియాలిటీ అని తెలిపారు. మనలో చాలామందికి ఒకరిని మరొకరు కంట్రోల్ చేసే అలవాటు ఉంది. అలాగే మరొక వ్యక్తిని వారికి సంబంధించిన వస్తువుగా చూస్తారే తప్ప ప్రేమతో చూడరని వెల్లడించారు. ప్రేమ అనేది కంట్రోల్ చేయడం కాదని, గౌరవంతో కూడుకున్నదని రష్మిక తెలిపారు.
విజయ్ దేవరకొండతో నిశ్చితార్థం ..
ఇలా ప్రేమ గురించి రష్మిక చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా ఈమె చెప్పిన మాటలు వాస్తవమే అంటూ అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇక రష్మిక వ్యక్తిగత విషయానికి వస్తే ఈమె గత కొంతకాలంగా నటుడు విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరూ నిశ్చితార్థం కూడా జరుపుకున్నారని వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని విజయ్ దేవరకొండ టీం అధికారికంగా వెల్లడించింది కానీ ఇప్పటివరకు విజయ్ దేవరకొండ రష్మిక ఎక్కడ కూడా తమ నిశ్చితార్థానికి సంబంధించిన విషయాలను కానీ ఫోటోలను కానీ అభిమానులతో పంచుకోలేదు. అక్టోబర్ 4న నిశ్చితార్థ జరుపుకున్న ఈ జంట 2026 ఫిబ్రవరిలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపారు. ఇక కెరియర్ పరంగా విజయ్ దేవరకొండ రష్మిక ఎంతో బిజీగా ఉంటున్నారు.
Also Read: Siddu Jonnalagadda: సిద్దు జొన్నలగడ్డ కోహినూరుకు బ్రేక్ …ఆ సమస్యలే కారణమా?