Darshana Banik:దర్శన బాణిక్ (Darshana Banik) తెలుగు ప్రేక్షకులకు ఎక్కువగా తెలియని పేరు అయినప్పటికీ తెలుగులో నాగార్జున(Nagarjuna) నటించిన మూవీలో ఈ హీరోయిన్ ని మనం చూడవచ్చు.. సినిమాలోకి మోడలింగ్ ద్వారా ప్రవేశించిన దర్శన బాణిక్.. ఫస్ట్ టైం బెంగాలీ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అలా హిందీ, బెంగాలీ, తమిళ,తెలుగు సినిమాల్లో రాణించిన దర్శన తాజాగా ఓ ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది..అది అత్యంత క్లిష్టమైన పరిస్థితి అంటూ దర్శన బాణిక్ మాట్లాడిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. మరి ఇంతకీ దర్శన బాణిక్ ఎవర్ని ఉద్దేశించి ఈ కామెంట్లు చేసింది అనేది ఎప్పుడు తెలుసుకుందాం..
నాగార్జున బ్యూటీగా పేరు..
అసచ్చే అబర్ షబార్(Asche abar shabar) అనే బెంగాలీ సినిమా ద్వారా సినిమాల్లోకి వచ్చిన దర్శన తెలుగులో పరుచూరి మురళి (Paruchuri Murali) డైరెక్షన్ వహించిన ఆటగాళ్లు(Aatagallu) అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో నారా రోహిత్(Nara Rohith) హీరోగా నటించారు. ఇక నాగార్జున, నాగచైతన్య (Naga Chaitanya) కాంబోలో వచ్చిన బంగార్రాజు (Bangarraju) సినిమాలో కూడా కనిపిస్తుంది.స్వర్గంలో నాగార్జున డాన్స్ చేసే నటీమణులలో దర్శన బాణిక్ కూడా ఉంటుంది.
క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించిన దర్శన..
అయితే అలాంటి దర్శన బాణిక్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “నేను తెలుగు సినిమా కోసం పని చేస్తున్నప్పుడు డైరెక్టర్ నాకు ఇండస్ట్రీలో ఉన్న అన్ని విషయాలు లిస్ట్ రాసి మరీ చెప్పారు.. తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది హార్డ్ వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. అందుకే టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలోనే మంచి పొజిషన్లో ఉంది.అయితే అక్కడక్కడ కొంతమంది వరస్ట్ పీపుల్స్ కూడా ఉన్నారు.కానీ అలాంటి వరస్ట్ పీపుల్స్ ని బట్టి ఇండస్ట్రీ మొత్తాన్ని జడ్జ్ చేయలేము కదా.. ఇక ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉన్నది అనేది చాలా వరకు వాస్తవం.. నేను బంగ్లాదేశ్ దర్శకుడు తో ఓ సినిమా చేస్తున్నప్పుడు ఇలాంటి ఒక చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాను.
రిసార్ట్ కి వెళ్దామని అసభ్యకరంగా ప్రవర్తించారు..
డైరెక్టర్ మరియు స్క్రీన్ రైటర్ ఏప్రిల్ లో నాకు కథ చెప్పారు. మే చివర్లో సినిమా స్టార్ట్ చేద్దామని చెప్పారు.ఆ తర్వాత ఓరోజు ఎక్కడున్నావని నాకు కాల్ చేశారు.. అంతేకాదు హీరోయిన్ తో అగ్రిమెంట్ చేసుకున్నాక ఏ రిసార్ట్ కు తీసుకువెళ్తావ్ అనడంతో నాకు చాలా కోపం వచ్చింది. ఇలాంటి మాటలు ఇంకోసారి మాట్లాడకండి అని చెప్పాను.కానీ నువ్వు అంత సీరియస్ గా ఉంటే ఇండస్ట్రీలో ఉండలేవు అని చెప్పారు.ఆ తర్వాత వాళ్ళ మాటలు నేను చాలా సీరియస్ గా తీసుకోవడంతో సినిమా నుండి నన్ను తీసేశారు.
అసలు నిజం తెలిసి.. ఆశ్చర్యపోయాను – దర్శన
కానీ ఎందుకు తీసేసారో అర్థం కాక చిత్ర యూనిట్ ని ప్రశ్నిస్తే నీకు వీసా సమస్యలు వచ్చాయి. అందుకే నిన్ను తీసేసాము అని చెప్పారు. కానీ నాకు వాళ్ళ మాటలు అర్థం అయ్యాయి. ఆరోజు నేను రిసార్ట్ కు తీసుకెళ్లడం గురించి సీరియస్ గా మాట్లాడడం వల్లే నన్ను తీసేసారని.. ఆ తర్వాత మరో హీరోయిన్ ని ఆ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారు అంటూ దర్శన బాణిక్ చెప్పుకొచ్చింది. అలా ఇండస్ట్రీలో కొంతమంది మంచి వాళ్ళు కొంత మంది చెడ్డవాళ్ళు ఉంటారు అని క్యాస్టింగ్ కౌచ్ (Casting Couch) గురించి మాట్లాడిన మాటలు మీడియాలో వైరల్ గా మారాయి.
ALSO READ:Fish Venkat: 2 పెళ్లిళ్లు చేసుకున్న ఫిష్ వెంకట్.. నిజాలు బయటపెట్టిన కూతురు!
?utm_source=ig_web_copy_link