Actress Trisha : సినీనటి త్రిష(Trisha) ఇటీవల కాలంలో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఒకానొక సమయంలో తెలుగు తమిళ భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న త్రిష కొత్త కాలం పాటు సినిమాలను కాస్త తగ్గిస్తూ ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే మణిరత్నం దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పొన్నియన్ సెల్వన్ సినిమా ద్వారా సూపర్ హిట్ అందుకున్న త్రిష తిరిగి వరుస తెలుగు తమిళ భాషలలో అవకాశాలు అందుకుంటూ కొత్త హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తున్నారు.
ఇలా సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉన్నా త్రిషకు సంబంధించి తరచూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఈమె రిలేషన్ గురించి పెళ్లి గురించి ఎన్నో వార్తలు వినపడుతున్నాయి. త్రిష గతంలో ఓ వ్యాపారవేత్తతో నిశ్చితార్థం జరుపుకున్నారు అయితే కొన్ని కారణాల వల్ల వీరు తమ నిశ్చితార్థానికి బ్రేకప్ చెప్పుకున్నారు. అప్పటినుంచి త్రిష పెళ్లికి సంబంధించి ఎన్నో వార్తలు బయటకు వస్తూనే ఉన్నాయి. ఈమె ప్రముఖ హీరో విజయ్ దళపతితో రిలేషన్ లో ఉన్నారని ఈమె కారణంగా విజయ్ తన భార్యకు విడాకులు ఇవ్వబోతున్నారని వార్తలు కూడా వినిపించాయి.
ఇలా వీరిద్దరి రిలేషన్ గురించి ఎన్నో రకాల వార్తలు వచ్చిన ఇద్దరు మాత్రం ఎక్కడ స్పందించిన దాఖలాలు లేవు. అయితే తాజాగా త్రిష పెళ్లికి సంబంధించి మరొక వార్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రముఖ వ్యాపారవేత్తతో ఈమెకు వివాహం నిశ్చయమైందని త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వినపడుతున్నాయి. చండీగర్ కు చెందిన ఓ వ్యాపార కుటుంబంతో త్రిషకు పెళ్లి నిశ్చయమైందని, ఆ వ్యక్తి ఆస్ట్రేలియాలో స్థిరపడి పెద్ద ఎత్తున వ్యాపారాలను నిర్వహిస్తున్నారని, ఆయన వ్యాపారం ఇండియాలో కూడా ప్రారంభించారని తెలుస్తోంది. ఇలా వ్యాపార రంగంలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న ఈ వ్యక్తితో వివాహానికి త్రిష కూడా ఓకే చెప్పడంతో ఈమె ఇంట పెళ్లి పనులు కూడా ప్రారంభమయ్యాయి అంటూ వార్తలు ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతున్నాయి.
చిరంజీవికి జోడిగా త్రిష..
మరి త్రిష పెళ్లి గురించి వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది అయితే గతంలో ఈమె పెళ్లి గురించి ఈ తరహా రూమర్లు భారీగా వినిపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇప్పుడైనా త్రిష నిజంగానే పెళ్లి చేసుకుంటుందా? లేదా? అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక త్రిష నాలుగు పదుల వయసులో కూడా యంగ్ లుక్ లో కనిపిస్తూ కొత్త హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమా అవకాశాలను అందుకుంటున్నారు. ఇక తెలుగులో ఈమె మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న విశ్వంభర (Vishwambhara) సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.. స్టాలిన్ సినిమా తర్వాత మరోసారి చిరంజీవి త్రిష కాంబోలో సినిమా రాబోతున్న నేపథ్యంలో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Ajay Bhupathi: బాలీవుడ్ ను టార్గెట్ చేసిన అజయ్ భూపతి.. ఫ్రాంచైజీస్ గా హిట్ సినిమా!