Anirudh Ravichandran: కోలీవుడ్ ఇండస్ట్రీలో సంగీత దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో అనిరుద్ రవిచంద్రన్ (Anirudh Ravichandran)ఒకరు. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ల జాబితాలో ఈయన కూడా ముందు వరుసలో ఉన్నారు. ప్రస్తుతం వరుస సినిమాలకు సంగీతం అందిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న అనిరుద్ రవిచంద్రన్ కి సంబంధించి ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిజానికి ఈయనకు సంగీత దర్శకుడిగా కంటే కూడా హీరోగా అవకాశం వచ్చిందని తెలుస్తోంది.
ప్రముఖ తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్(Vignesh Shivan) దర్శకత్వంలో నయనతార(Nayanatara) విజయ్ సేతుపతి(Vijay Sethupathi) ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం “నానుం రౌడీదాన్”(Naanum Rowdy Dhaan). ఈ సినిమా 2015 వ సంవత్సరంలో తమిళంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఇదే సినిమాని 2016వ సంవత్సరంలో “నేను రౌడీ” అనే పేరుతో విడుదలై ఇక్కడ కూడా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇలా ఈ సినిమా తర్వాత విజయ్ సేతుపతికి కూడా కోలీవుడ్ ఇండస్ట్రీలో మంచి అవకాశాలు రావడం జరిగింది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి కంటే ముందుగా అనిరుద్ రవిచంద్రన్ కు నటించే అవకాశం వచ్చిందని తెలుస్తోంది. ఇలా ఈ సినిమాలో ప్రధాన పాత్రలో చేసే అవకాశం వచ్చినప్పటికీ అనిరుద్ మాత్రం సంగీతంపై మక్కువతో ఈ అవకాశాన్ని వదులుకున్నారు.
ఇలా సంగీతం అంటే ఎంతో ఇష్టమున్న అనిరుద్ నటనను కూడా కాదనుకొని సంగీతం వైపు అడుగులు వేస్తూ సంగీత దర్శకుడిగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందారు. ఇక ఈయన ఒక్కో సినిమాకు సుమారు 5 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకుంటున్న విషయం తెలిసిందే. సౌత్ సినీ ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ల జాబితాలో అనిరుద్ కూడా ఉండటం విశేషం. ఇటీవల కాలంలో కేవలం తమిళ సినిమాలను మాత్రమే కాకుండా తెలుగు సినిమాలకు కూడా ఈయన కమిట్ అవుతూ బిజీగా ఉన్నారు. ఇటీవల అనిరుద్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటించిన కూలీ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అనిరుద్ తెలుగులో నాని హీరోగా నటిస్తున్న ది ప్యారడైజ్ సినిమా పనులలో బిజీగా ఉన్నారు.
నిర్మాతలుగా నయన్ దంపతులు..
ఇక నానుం రౌడీదాన్ సినిమా విషయానికి వస్తే.. విగ్నేష్ ఈ సినిమాకు దర్శకుడిగా మాత్రమే కాకుండా కథ కూడా అందించారు. ఇక ఈ సినిమా సమయంలోనే డైరెక్టర్ విగ్నేష్ నయనతారతో ప్రేమలో పడటం జరిగింది. ఇలా కొంతకాలం పాటు ప్రేమలో ఉన్న ఈ దంపతులు ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. అనంతరం సరోగసి ద్వారా ఇద్దరు కవల మగ పిల్లలకు తల్లిదండ్రులుగా మారిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత విగ్నేష్ నయనతార నిర్మాతలుగా మారి పలు సినిమాలను నిర్మిస్తూనే మరోవైపు విగ్నేష్ దర్శకుడిగా, నయనతార హీరోయిన్ గా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.
Also Read: Jayashankarr: మూల స్తంభాలను కోల్పోయాను.. అనసూయ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్