IND-W vs SA-W : ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ ( ICC Womens World Cup 2025 ) చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఈ టోర్నమెంట్ లో 9 మ్యాచ్ లు పూర్తిగా గాక ఇవాళ 10వ మ్యాచ్ నడుస్తోంది. ఇందులో భాగంగానే టీమిండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మహిళల జట్ల మధ్య ఫైట్ జరుగుతోంది. విశాఖపట్నంలోని వైయస్ రాజశేఖర్ రెడ్డి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ నిర్వహిస్తున్నారు. అయితే ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా కాస్త తడబడింది. అయితే ఆ తర్వాత వికెట్ కీపర్ రిచా ఘోష్ అద్భుతంగా రాణించి, టీమిండియాను ఆదుకున్నారు. 94 పరుగులు చేసి ఔట్ అయింది. ఈ నేపథ్యంలోనే నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా 251 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక ఈ మ్యాచ్ లో 252 పరుగులు చేస్తే దక్షిణాఫ్రికా గెలుస్తుంది.
Also Read: Abhishek Sharma Car: అభిషేక్ కారుకు ఇండియాలో నో పర్మిషన్…దుబాయ్ లో వదిలేశాడుగా !
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో టీమిండియా బ్యాటర్ రీఛార్జ్ ఘోష్ రెచ్చిపోయింది. కష్టాల్లో ఉన్న టీమిండియాను ఆదుకుంది. దీంతో 49.5 ఓవర్లలో 251 పరుగులు చేసింది టీమిండియా. అయితే మొదట్లో టీమ్ ఇండియా కాస్త తడబడినా, ఆ తర్వాత సెటిల్ అయింది. టీమిండియా వికెట్ కీపర్ రీఛార్జ్ ఘోష్ 77 బంతుల్లో ఏకంగా 94 పరుగులతో రెచ్చిపోయింది. సెంచరీ మిస్ చేసుకున్నా, జట్టుకు అమూల్యమైన పరుగులు అందించింది. రీఛార్జ్ ఘోష్ కు ( RICHA GHOSH ) స్నేహ రాణా అండగా నిలిచి 33 పరుగులు చేసింది. దీంతో టీమిండియా మాత్రం స్కోర్ చేయగలిగింది. ఇక ఈ మ్యాచ్ లో జెమిమా రో డ్రిగ్స్ ( Jemimah Rodrigues ) క్రాంతి గౌడ్, శ్రీ చరణ్ సున్న పరుగులకే వెనిదిరిగారు. మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంటులో స్నేహ రాణా అద్భుతంగా రాణిస్తున్నారు. చివరలో వచ్చి జట్టును ఆదుకుంటున్నారు. శ్రీలంకపై 28 పరుగులు, పాకిస్తాన్ పై 20 పరుగులు అలాగే సౌత్ ఆఫ్రికా పై 33 పరుగులు చేసి జట్టుకు అమూల్యమైన సహాయం చేశారు స్నేహ రాణా.
మహిళల మండే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో స్మృతి మందాన ( Smriti Mandhana ) సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒకే సంవత్సరంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా రికార్డు సృష్టించింది స్మృతి మందాన. దాదాపు 28 సంవత్సరాల తర్వాత ఈ రికార్డు క్రియేట్ చేసుకుంది. అంతకుముందు ఇంగ్లాండ్ ప్లేయర్ క్లాక్ 1997 సంవత్సరంలో ఏడాది మొత్తంగా 970 పరుగులు చేసింది. అయితే ఈ 2025 సంవత్సరంలో 973 పరుగులు చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది స్మృతి మందాన. 2024 లో కూడా ఇలాంటి హిస్టరీ క్రియేట్ చేసింది. కానీ ఆ సమయంలో 800 కంటే తక్కువ పరుగులు చేసింది.
RICHA GHOSH – THE POWERHOUSE 🦁
– What an innings, India down & out then Richa smashed a fanstatic fifty under pressure against South Africa.
A Game changing innings for the country. pic.twitter.com/l5Z2Of0Jmq
— Johns. (@CricCrazyJohns) October 9, 2025