Bunny Vasu On Bandla Ganesh: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నటుడుగా తన కెరియర్ స్టార్ట్ చేసి, తర్వాత దర్శకుడుగా మారాడు బండ్ల గణేష్. ప్రొడ్యూసర్ గా మారిన తరువాత అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోలు అందరినీ పట్టుకొని సినిమాలు చేశాడు. బండ్ల గణేష్ స్పీడ్ చూసినప్పుడు అంత త్వరగా స్టార్ హీరోలు అతనికి డేట్లు ఎలా ఇస్తున్నారు అని అందరూ ఆశ్చర్యపోయారు.
కొంతమంది స్టార్ హీరోలతో రెండు సార్లు కూడా పనిచేసే అవకాశం దొరికింది. మొత్తానికి ఒక్కొక్కరిది ఒక్కొక్క టైం నడుస్తుంది అన్నట్లు బండ్ల గణేష్ టైము కూడా కొంతవరకు నడిచింది. ఎక్కువ శాతం హిట్ సినిమాలు ఉన్నా కూడా ఇప్పుడు సినిమాలు నిర్మించకుండా దూరంగా ఉన్నారు బండ్ల. సినిమాలైతే నిర్మించడం లేదు గానీ సోషల్ మీడియాలో నిత్యం దర్శనమిస్తుంటారు. సినిమా ఫంక్షన్లకు హాజరవుతుంటారు. బండ్ల గణేష్ స్పీచ్ కోసం చాలామంది ఎదురు చూస్తుంటారు.
లిటిల్ హార్ట్స్ అనే సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిన విషయమే. ఆ సినిమా తక్కువ బడ్జెట్లో నిర్మితమైంది. కానీ కలెక్షన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో వచ్చాయి. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. చాలామంది ఆ సినిమా గురించి ట్వీట్ కూడా వేశారు.
అయితే ఈ సినిమాకి సంబంధించిన సక్సెస్ మీట్ కు బండ్ల గణేష్ వచ్చారు. గణేష్ వచ్చి స్పీచ్ ఇచ్చారు. బండ్ల గణేష్ స్పీచ్ అంటే ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు కొన్ని కాంట్రవర్సీలకి కేరాఫ్ అడ్రస్ గా ఉంటుంది. అల్లు అరవింద్ గురించి కూడా బండ్ల ప్రస్తావించిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. దీనివలన గాడ్ ఫాదర్ లాంటి అల్లు అరవింద్ ను అలా మాట్లాడటం తనను బాధపెట్టాయి అని బన్నీ వాసు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
బండ్ల గణేష్ మాట్లాడుతూ మౌళిని ఉద్దేశించి, మౌళి నువ్వేమీ నమ్మకు. నీ సినిమా ఈరోజు హిట్ అయింది కాబట్టి ఇంతమంది వచ్చారు. ఇన్ని మాట్లాడుతున్నారు. కేవలం సక్సెస్ వల్లనే వీళ్ళందరూ వచ్చారు.
దీనిని నువ్వు దృష్టిలో పెట్టుకోకు, 20 రోజులు జరిగింది ఒక మాయ. మహేష్ బాబు ట్విట్ వేశాడు, విజయ్ దేవరకొండ షర్ట్ ఇచ్చాడు అని ఎక్కువ దృష్టిలో పెట్టుకోకు. అని అన్నాడు.
ఇండస్ట్రీలో కష్టపడితేనే నిలబడగలం, కోటి మందికి ఒకటి మాత్రమే మెగాస్టార్ కు బావమరిదిగా, అల్లు రామలింగయ్య వంటి వాళ్లకి కొడుకుగా పుడతారు. వాళ్ళు ఏమీ చేయక్కర్లే మనమంతా కష్టపడితే చివర్లో వచ్చి కూర్చొని క్రెడిట్ మొత్తం తీసుకుంటారు. అలా జరగడం అనేది కారణజన్ములకు మాత్రమే. అని మాట్లాడిన మాటలు బన్నీ వాస్ ను ఇబ్బంది పెట్టాయి. ఈ ఒక్క విషయం గురించే బన్నీ వాస్ కూడా ఆ రోజే స్టేజ్ పైన క్లారిటీ ఇచ్చారు. ఇక రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ పైన తన అసంతృప్తిని బయటపెట్టేసారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే బండ్ల మాటలను ఎక్కువమంది సపోర్ట్ చేస్తున్నారు.
Also Read : Sandeep Reddy Vanga Kurtas : సందీప్ రెడ్డి వంగ ఎక్కువగా కుర్తాల్లో కనిపించటానికి కారణం ఇదే