Katrina Kaif-Vicky Kaushal First Child: బాలీవుడ్ క్యూట్ కపుల్లో కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ జంట ఒకటి. ఇటీవల ఈ జంట గుడ్‌న్యూస్ చెప్పింది. త్వరలోనే తాము తల్లిదండ్రులుగా ప్రమోట్ అవుతున్నామని ప్రకటించింది. పెళ్లయిన మూడేళ్ల తర్వాత ఈ జంట నుంచి శుభవార్త రావడంతో ఫ్యాన్స్ అంత ఫుల్ ఖుష్ అయ్యారు. ఈ జంటకు ఫ్యాన్స్, సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం కత్రినా మాతృత్వ క్షణాలను ఆస్వాదిస్తోంది. ప్రస్తుతం ఈ జంటతో పాటు అభిమానులంత పుట్టిబోయే బిడ్డ కోసం ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో కత్రినా–విక్కిల పుట్టబోయే బిడ్డపై ప్రముఖ జ్యోతిష్యుడు చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
బి–టౌన్ సెలబ్రిటీ జ్యోతిష్యుడు అనిరుధ్ కుమార్ మిశ్రా గురించి తెలిసిందే. తరచూ సెలబ్రిటీలపై జాతకాలు చెబుతూ అతడు వైరల్ అవుతుంటాడు. తాజాగా కత్రినా–విక్కీ కౌశల్ పుట్టిబోయే బిడ్డ గురించి ట్విటర్లో ఓ పోస్ట్ పెట్టాడు. విక్కీ కౌశల్-కత్రినా కైఫ్లు మొదటి బిడ్డగా కూతురు పుడుతుందని ఆయన జోస్యం చెప్పారు. ఇదే విషయాన్ని చెబుతూ ట్విటర్లో పోస్ట్ కూడా చేశాడు. కత్రినా, విక్కీ కౌశల్ పెళ్లి ఫోటో షేర్ చేస్తూ ఆయన ఈ కామెంట్స్ చేశారు. ఇది కాస్తా వైరల్ అవ్వడంతో నెటిజన్స్, ఫ్యాన్స్ నుంచి భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. ఇది కేవలం మీ అంచనా మాత్రమే.. అదే నిజం కాదు అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
అతడు కామెంట్ని ఉద్దేశిస్తూ ఓ నెటిజన్ ఫన్నీగా రియాక్ట్ అయ్యాడు. ప్రస్తుతం కూతుళ్ల సీజన్ నడుస్తోందంటూ నవ్వుతున్న ఎమోజీతో కామెంట్ చేశారు. ప్రస్తుతం పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. కాగా కొంతకాలం సీక్రెట్ డేటింగ్ అనంతరం విక్కీ కౌశల్, కత్రినాలు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. 2021 డిసెంబర్ 9న పెద్ద సమక్షంలో కత్రినా, విక్కీలు మూడుమూళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. అప్పటి నుంచి ఈ జంట గుడ్‌న్యూస్ ఎప్పుడు చెబుతుందా ఇటూ ఇండస్ట్రీ వర్గాలతో పాటు అభిమానుల సైతం ఆశగా ఎదురు చూశారు. ఈ క్రమంలో తరచూ కత్రినా ప్రెగ్నెన్సీ రూమర్స్ వార్తల్లో నిలిచాయి. కానీ అవి ప్రచారం వరకే పరిమితం అయ్యాయి.
దీంతో కత్రినా–విక్కీల నుంచి ఈ తీపి కబురు ఎప్పుడెప్పుడు వస్తుందా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్కి సడెన్గా బెబీ బంప్తో సర్ప్రైజ్ చేసింది కత్రినా. పెళ్లయిన నాలుగేళ్ల తర్వాత కత్రినా గర్భం దాల్చడంతో వారి ఇంట సంబరాలు అంబరాన్ని అంటాయి. తెలుగు మల్లీశ్వరి, అల్లరి ప్రియుడు వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన కత్రినా.. ఆ తర్వాత బాలీవుడ్ కి మాకాం మార్చింది. హిందీతో ఎన్నో చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. పెళ్లికి ముందు వరుస సినిమాలు చేసిన ఆమె ప్రస్తుతం నటనకు గుడ్బై చెప్పి వైవాహిక జీవితంపై ఫోకస్ పెట్టింది. సినిమాలు వదిలేసి గ్రుహిణిగా భర్త, ఇంటి బాధ్యతలు చూసుకుంటోంది. మరోవైపు విక్కీ కౌశల్ సినీ కెరీర్ వరుస హిట్స్ ఫుల్ స్విగ్లో ఉంది. ఇటీవల ఛావాతో సూపర్ బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన విక్కీ ప్రస్తుతం లవ్ అండ్ వార్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. కత్రినా చివరిగా మేరీ క్రిస్మస్ మూవీలో నటించింది.
The first child of Vicky Kaushal and Katrina Kaif will be a daughter. pic.twitter.com/2wjWk7SaKN
— Anirudh Kumar Mishra (Astrologer) (@Anirudh_Astro) October 8, 2025