E-Paper
Advertisement

Jayashankarr: మూల స్తంభాలను కోల్పోయాను.. అనసూయ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్

Jayashankarr: మూల స్తంభాలను కోల్పోయాను.. అనసూయ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్
Advertisement

Jayashankarr: టాలీవుడ్ దర్శకుడు జయశంకర్ (Jayashankarr)తాజాగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఒక ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. అరి సినిమా(Ari Movie)  దర్శకుడిగా జయశంకర్ అందరికీ ఎంతో సుపరిచితమే. గత ఏడు సంవత్సరాల క్రితం ప్రకటించిన ఈ సినిమా కొన్ని కారణాలవల్ల కార్యరూపం దాల్చలేదు. ఇలా ఏడు సంవత్సరాల తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో డైరెక్టర్ జయశంకర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఎన్నో అడ్డంకులను అవాంతరాలను ఎదుర్కొంటూ అరి సినిమా అక్టోబర్ పదవ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ సినిమా వారిద్దరికీ అంకితం..

ఈ సందర్భంగా డైరెక్టర్ జయశంకర్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ..” రేపటి నుంచి ఈ అరి సినిమా ప్రేక్షకులదని తెలిపారు. ఈ ప్రయాణంలో ఈ చిత్రం నాకు ఎప్పుడూ ప్రత్యేకమైన సినిమాగా నిలిచిపోతుంది. ఈ సినిమా ప్రయాణంలో నా తండ్రిని అలాగే నా బావను నేను కోల్పోయాను. నా జీవితంలో వీరిద్దరూ రెండు స్తంభాలు లాంటివారు. ఈ రెండు స్తంభాలను తాను కోల్పోయాను. ఈ సినిమా ప్రతి ఫ్రేమ్ వారి ఆశీర్వాదాలను నా బాబోద్వేగాలను కలిగి ఉంటుందని వెల్లడించారు. ఈ సినిమా కోసం నేను పడిన ఈ కష్టాన్ని, వారి ప్రేమ, జ్ఞాపకాలకు అంకితం చేస్తున్నాను” అంటూ ఈ సందర్భంగా జయశంకర్ చేసిన ఈ ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

హిమాలయాలకు వెళ్లిన డైరెక్టర్..

Advertisement

ఈ విధంగా సినిమా మరికొన్ని గంటలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో దర్శకుడు తన తండ్రి, బావను కోల్పోయాను అంటూ ఈ సందర్భంగా వెల్లడించడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది. ఇక జయశంకర్ ఇదివరకు పేపర్ బాయ్ అనే సినిమాకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం కూడా ఎంతో మంచి విజయాన్ని అందుకుంది. ఇక అరి సినిమా విషయానికి వస్తే.. వినోద్ వర్మ (Vinod Varma) అనసూయ భరద్వాజ్ (Anasuya Bhardwaj)ప్రధాన పాత్రలలో నటించారు. ఇక ఈ సినిమాలో నటుడు సాయికుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కూడా కీలక పాత్రలు పోషించారు.

Advertisement

ఇక ఈ సినిమా ప్రకటించి దాదాపు ఏడు సంవత్సరాలకు విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా ఆలస్యానికి గల కారణాలను వివరించారు. ఈ సినిమా ప్రకటించిన తర్వాత ఈయన హిమాలయాలకు వెళ్లి అక్కడ ఎంతోమంది ఆధ్యాత్మిక గురువులను కూడా కలిసినట్టు తెలిపారు. ఈ సినిమా కోసమే ఆయన హిమాలయాలకు వెళ్లడంతో ఇంత ఆలస్యమైందని తెలియజేశారు. ఇలా ఏడు సంవత్సరాల తర్వాత ఈ సినిమా రేపు విడుదల కాబోతున్న నేపథ్యంలో ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటుంది ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా అనేది తెలియాల్సి ఉంది.

Also Read: Mohan lal: మోహన్ లాల్ వృషభ రిలీజ్ డేట్ లాక్.. ఓకే ఏడాదిలో 5 సినిమాలు రిలీజ్..చూసి నేర్చుకోండయ్యా!

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×