YS Jagan: గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను ఎందుకు ప్రైవేట్ పరం చేస్తున్నారని వైసీపీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పైరయ్యారు. చంద్రబాబు పేదలకు అన్యాయం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. అంతా ప్రైవేట్ పరం చేస్తే పేదవాళ్లకు వైద్యం ఎలా అందుతోందని ప్రశ్నించారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీ భవనాన్ని పరిశీలించిన అనంతరం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పీపీపీ మోడల్ లో కాలేజీలు నిర్మాణం చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించడంపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉత్తరాంధ్ర జిల్లాల్లో పేద ప్రజలకు ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే విశాఖ కేజీహెచ్ ఆసరగా ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో లక్షలాది పేద ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో తాము 17 కాలేజీలను నిర్మించేందుకు శ్రీకారం చుట్టామని చెప్పారు. నర్సీంపట్నం లో నిర్మిస్తున్న మెడికల్ కాలేజీకి నిధులు విడుదల చేసి త్వరగా నిర్మాణం చేస్తే పేదలకు మంచి జరగుతుందని వివరించారు.
ఉత్తరాంధ్ర ప్రాంతంలో బ్రిటీష్ వారు నిర్మించిన కేజీహెచ్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కట్టించిన ఓ ప్రభుత్వ మెడికల్ కాలేజీ మాత్రమే ఇక్కడి ప్రజలకు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో ఉత్తరాంధ్రలో నాలుగు మెడికల్ కాలేజీలను నిర్మించేందుకు శ్రీకారం చుట్టినట్టు చెప్పారు. ఈ కాలేజీలకు సీఎం చంద్రబాబు త్వరగా నిధులు విడుదల చేసి నిర్మాణం త్వరగా పూర్తి చేసి ఉంటే ఇప్పటికే విద్యార్థులకు క్లాసెస్ స్టార్ట్ అయ్యేవని అన్నారు. పేదలకు భవిష్యత్ లేని పనులను కూటమి ప్రభుత్వం చేస్తోందని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ALSO READ: R Krishnaiah: హైకోర్టు వద్ద బీసీ సంఘాల ఆందోళన.. రేపు రాష్ట్ర బంద్‌కు ఆర్. కృష్ణయ్య పిలుపు..?