Ajay Bhupathi: అజయ్ భూపతి(Ajay Bhupathi) ఆర్ఎక్స్ 100 చిత్రంతో తెలుగు సినీ ఇండస్ట్రీలో సెన్సేషనల్ దర్శకుడుగా పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న ఈయన తదుపరి పలు సినిమాలకు దర్శకుడిగా వ్యవహరించారు. అయితే అజయ్ భూపతి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రాలలో మంగళవారం సినిమా కూడా ఒకటి. సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాగా 2023వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ చిత్రం ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్(Payal Raj Puth), నందిత శ్వేత(Nanditha Swetha), అజయ్ ఘోష్, అజ్మల్, దివ్య పిళ్లై వంటి తదితరులు నటించారు.
ఈ సినిమా హిందీ తెలుగు, తమిళ, కన్నడ మలయాళ భాషలలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా మంగళవారం 2 సినిమాని కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సీక్వెల్ సినిమాకి సంబంధించి మరొక వార్తా ప్రస్తుతం వైరల్ అవుతుంది. మంగళవారం సినిమా పాన్ ఇండియా స్థాయిలో మంచి సక్సెస్ ఆయిల్ నేపథ్యంలో డైరెక్టర్ అజయ్ భూపతి ఈ సూపర్ హిట్ ఫ్రాంచైజీస్ కోసం బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ తో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తుంది.
ఈ సినిమాని కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న నేపథ్యంలో బాలీవుడ్ ను టార్గెట్ చేస్తూ ప్రొడక్షన్ హౌస్ తో చర్చలు జరిపినట్టు సమాచారం. ఇలా అజయ్ భూపతి ఇప్పటికే బాలీవుడ్ హౌస్ తో చర్చలు జరపగా ఈ సినిమా చేయటానికి సదరు బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ కూడా సానుకూలంగా వ్యవహరించినట్టు సమాచారం. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులను 2026 వ సంవత్సరం మొదట్లో ప్రారంభం కాబోతున్నాయని తెలుస్తోంది. మరి ఈ సినిమా ఫ్రాంచైజీస్ గురించి వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలి అంటే చిత్ర బృందం అధికారకంగా తెలియజేయాల్సి ఉంది.
ఆర్ఎక్స్ 100..
ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి. అజయ్ భూపతి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆర్ఎక్స్ 100 సినిమా ద్వారా నటి పాయల్ రాజ్ పుత్ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న నేపథ్యంలో తదుపరి మంగళవారం సినిమాలో కూడా ఆమెకి అవకాశం కల్పించారు. ఇక మంగళవారం సినిమాని ఏ క్రియేటివ్ వర్క్స్, ముద్రమీడియా వర్క్స్ పతాకంపై స్వాతి సురేష్ వర్మ నిర్మించిన సంగతి తెలిసిందే.. ఇక సీక్వెల్ సినిమా మాత్రం బాలీవుడ్ నిర్మాణ సంస్థ నిర్మించబోతున్నట్టు తెలుస్తోంది. మరి ఈ సినిమాలో కూడా మొదటి భాగంలో నటించిన నటీనటులే నటించబోతున్నారా ?లేకపోతే కొత్తవారిని తీసుకోబోతున్నారా? అన్న పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: Sekhar Kammula: ఆర్జీవీ ఎవరో నాకు తెలీదు… కాంట్రవర్సీ కింగ్‌తోనే ఆటలా ?