K-Ramp Pre Release Business Details: యంగ్ టాలంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఫలితాలతో సంబంధం లేకుండ వరుస సినిమాలు ప్రకటిస్తున్నాడు. ఏడాది కనీసం రెండు మూడు సినిమాలైన విడుదలయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. మొదటి నుంచి ఈ హీరోని సక్సెసే పెద్దగా వరించడం లేదు. ఆయన కెరీర్ చెప్పుకోదగ్గ హిట్స్ లేవు. ఎస్ఆర్ కళ్యాణ మండపం, క సినిమాలు తప్పితే కిరణ్ ఖాతాలో పెద్ద హిట్స్ లేవు. వసూళ్లలోనూ ఈ రెండు సినిమాలే నిర్మాతలను గట్టెక్కించాయి. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ఆడియన్స్ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ, అవి పెద్దగా వర్కౌట్ అవ్వడం లేదు. గతేడాది ‘క‘ అంటూ సస్పెన్స్ థ్రిల్లర్‌తో వచ్చాడు.
పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రం ఆడియన్స్ని బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత దిల్రూబ మూవీతో వచ్చాడు. కానీ, ఇంత ఆడియన్స్ని పెద్ద ఆకట్టుకోలేకపోయింది. తాజాగా కె–ర్యాంప్(K-Ramp) చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ దీపావళి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందు రానుంది. ప్రస్తుతం మూవీ టీం ప్రమోషన్స్తో బిజీగా ఉంది. ఇందులో భాగంగా ఇటీవల విడుదల చేసిన టీజర్, ట్రైలర్ మంచి రెస్పాన్స్ వచ్చింది. రొమాంటిక్ లవ్ అండ్ కామెడీ వస్తున్న ఈ చిత్రం యూత్ని బాగా ఆకట్టుకునేలా ఉంది. ఇక ఇందులో ముద్దు సీన్లకు కొదవే లేదు. సినిమా మొత్తం దాదాపు 18 లిప్ లాక్ సీన్స్ ఉన్నాయని సమాచారం. రొమాంటిక్, కామెడీ లవ్ స్టోరీ యూత్ని టార్గెట్గా వస్తున్న ఈ సినిమా హైప్ కూడా బాగానే ఉంది. ఈ క్రమంలో కె–ర్యాంప్ మూవీ బిజినెస్ ఊహింఇచన దానికట్టే ఎక్కువే అయినట్టు తెలుస్తోంది.
ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కులు చూస్తుంటే మేకర్స్ ఇప్పటికే పెట్టిన సగం డబ్బులు వచ్చేశాయంటే. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తగ్గింది. కానీ, ఇది కిరణ్ బ్రేక్ ఈవెన్ కొట్టగలడా లేడా అనే సందేహాలు వస్తున్నాయి. ఇంతకి కె–ర్యాంప్ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం! జైన్స్ నాని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తోంది. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యుటాయిడ్ పతాకాలపై రాజేశ్ దండా, శివ బొమ్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 18న థియేటర్లలోకి రానుంది. నిజానికి ముందు నుంచి ఈ సినిమాకు పెద్దగా హైప్ లేదు. కానీ, ప్రచార పోస్టర్స్, గ్లింప్స్తో ఒక్కసారిగా హైప్ పెరిగింది. ఇక టీజర్, ట్రైలర్తో మూవీపై బజ్ పెరిగింది. దీనికి కారణం సినిమాలో ఎక్కువగా లిప్ కిస్‌లు, కామెడీ సీన్స్. యూత్ టార్గెట్ చేస్తూ టీజర్, ట్రైలర్ కట్ చేసి వదిలారు.
Also Read: Saife Ali Khan: ఆ రోజు నా కొడుకుపై కూడా కత్తితో దాడి చేశాడు, ఆ తర్వాత.. సైఫ్ షాకింగ్ కామెంట్స్
ఊహించినట్టుగానే యూత్ నుంచి మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో మూవీపై హైప్ పెరగడంతో విడుదలకు ముందే మూవీ ఓటీటీ, శాటిలైట్ రైట్స్ కూడా అయిపోయాయట. ఫ్యాన్సీ రేట్కి ప్రముఖ ఓటీటీ సంస్థ ఈ మూవీ ఓటీటీ హక్కులను తీసుకుంది. శాటిలైట్ బిజినెస్ కూడా బాగానే జరిగిందట. సుమారు రెండు కోట్లకు శాటిలైట్ హక్కులకు అమ్మినట్టు తెలుస్తోంది. అలాగే థియేట్రికల్ బిజినెస్ కూడా భారీగానే జరిగిందట. ఆంధ్రలో రూ. 3 కోట్లు, నైజాంలో రూ. 2 కోట్లు, సీడెడ్ రూ. 1.25 కోట్లు రెస్టాఫ్ ఇండియా రూ. 50 లక్షలు జరిగినట్టు తెలుస్తోంది. థియేట్రికల్ అండ్ శాటిలైట్, ఓటీటీ హక్కులతో ఇప్పటికే కె–ర్యాంప్ మంచి బిజినెస్ చేసిందట. పెట్టిన బడ్జెట్లో సగం డబ్బులు వెనక్కి వచ్చాయట. ఇక ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రిలీజ్ తర్వాత రూ. 6.75 కోట్ల బిజినెస్. రూ. 8 కోట్ల నెట్ కలెక్షన్స్ వస్తే సరిపోతుంది. కానీ, దీపావళికి ఉన్న పోటీ, కిరణ్ అబ్బవరం మార్కెట్కి ఇది పెద్ద టార్గెట్ అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. మరి ఈ చిన్న టార్గెట్ అయినా కిరణ్ కొట్టగలడా? అని చర్చించుకుంటున్నారు.