Hyderabad:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ప్రముఖ డైరెక్టర్ తేజ(Teja ) తాజాగా హైదరాబాదులోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో అత్యధిక సాంకేతికతతో 9 హెల్త్ కేర్ రిహాబిలిటేషన్ సెంటర్ ను గురువారం రోజు ఘనంగా ప్రారంభించారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మల్టీ మాడ్యులర్గా ప్రారంభించిన ఈ రిహాబిలిటేషన్ సెంటర్ విశేషాల గురించి ప్రతినిధులు పంచుకున్నారు. రిహాబిలిటేషన్ సెంటర్ ప్రారంభించిన తర్వాత డైరెక్టర్ తేజ మీడియాతో మాట్లాడుతూ.. “జై సినిమా తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు నేను సినీనటి సంతోషి(Santhoshi) ని కలిశాను. చాలా సంతోషంగా ఉంది. శ్రీకర్ , సంతోషిని కలిసి సెంటర్ పెట్టారు. హాస్పిటల్లో చికిత్స అందిస్తారు కానీ ఆ తర్వాత అందించాల్సిన సేవల్ని ఇంట్లో అందించలేము. ఇలాంటి సెంటర్లు చాలా అవసరం” అంటూ ఆయన తెలిపారు.
నటి సంతోషిని మాట్లాడుతూ.. “ఈ రిహాబిలిటేషన్ సెంటర్ ఆలోచన నా భర్త నుంచి వచ్చింది.మా ఇంట్లోనే పెద్దవాళ్లను చివరి రోజుల్లో మేము చూసుకోలేకపోయాము. అందుకే ఇలాంటి సెంటర్లు ఉంటే బాగుంటుంది అని మేము ఆలోచించాము. మా ఆలోచనకు డాక్టర్ శివ, డాక్టర్ నాగరాజు ప్రాణం పోశారు. ఇక్కడ అన్ని రకాల సేవలను 24 గంటల పాటు అందిస్తాము. మా సెంటర్లో చాలా తక్కువ ధరలకే అన్ని రకాల సేవలు లభిస్తాయి” అంటూ ఆమె తెలిపారు.
అలాగే రిహాబిలిటేషన్ సెంటర్ నిర్వాహకులు మాట్లాడుతూ.. “నైన్ హెల్త్ కేర్ రిహాబిలిటేషన్ సెంటర్ ను మల్టీ మాడ్యులర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొదలుపెట్టాము. ఇది ఇండియాలో ఇప్పుడిప్పుడే ట్రెండ్ గా మారింది. అయితే వెస్ట్రన్ కంట్రీస్ లో మాత్రం ఎలాంటి ప్రమాదం జరిగినా.. మానసికంగా, శారీరకంగా దెబ్బతిన్నా కూడా రోగులకు ప్రభుత్వమే అక్కడ రిహాబిలిటేషన్ సెంటర్లో చికిత్స అందిస్తారు. మనిషి బాధను తగ్గించే పూర్వస్థితిలోకి తీసుకురావడానికి ఈ సెంటర్లు ఎంతగానో ఉపయోగపడతాయి” అంటూ వారు తెలిపారు.
“డాక్టర్ శివ, డా.నాగరాజు ఆధ్వర్యంలో ఈ సెంటర్ ను మేము ప్రారంభించాము. స్క్వీజ్ థెరపీ, స్వాలోయింగ్ థెరపీ, న్యూరో ఫిజియోథెరపీ, ఆర్థో ఫిజియోథెరపీ, జనరల్ ఫిజియోథెరపీ, జీరియాట్రిక్ ఫిజియోథెరపీ, చెస్ట్ ఫిజియోథెరపీ ఇలా అన్నింటికీ ఇక్కడ సేవలు అందిస్తాము. ముఖ్యంగా పేషెంట్ కండిషన్ ని బట్టి ఛార్జ్ చేస్తాము. అందరికీ అందుబాటులో ఉండే ధరలతోనే సేవలను అందిస్తున్నాము. సమాజంలోనే రుగ్మతలను తొలగించేందుకే మేము చేస్తున్న ప్రయత్నం ఇది. మా దగ్గర ఎమర్జెన్సీ సేవలు తప్ప మిగిలిన అన్నింటిని అందుబాటులోకి తీసుకొచ్చాము” అంటూ నిర్వహకులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ రిహాబిలిటేషన్ సెంటర్ కి సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ALSO READ:Ananya Nagalla: ప్రేమలో పడ్డ అనన్య నాగళ్ల.. ఎవరితోనో తెలిస్తే షాకవుతారేమో?