Ravi Teja Team Up With Kick Director: మాస్ మహారాజ రవితేజకు ఈ మధ్య పెద్దగా కలిపిరావడం లేదు. సినిమా సినిమాకు ప్రమోగాలు చేస్తున్న అవి వర్కౌట్ అవ్వడం లేదు. ఈ మధ్య ఆయన చిత్రాలన్ని బాక్సాఫీసు వద్ద బోల్తా కొడుతున్నాయి. ఆయన ఖాతాలో ఓ సాలిడ్ హిట్ పడి చాలా కాలం అవుతుంది. కొంతకాలంగా కొత్త డైరెక్టర్లనే నమ్ముకుంటున్న మాస్ మహారాజ పెద్దగా కలిసి రావడం లేదు. దీంతో గతేడాది హరీష్ శంకర్‌ని నమ్మి మిస్టర్ బచ్చన్ చేశాడు. హరీష్ శంకర్ మాస్ మహారాజకు మంచి కంబ్యాక్ ఇస్తాడనుకుంటే ఇది నిరాశ పరిచింది. అయినప్పటి ఈ మాస్ హీరో తగ్గేదే లే అంటున్నాడు. సినిమా ఫలితాల ఎలా ఉన్న వరసపెట్టి సినిమాలు చేస్తూనే ఉన్నాడు.
కానీ ఆయన సినిమాలే కిక్ ఇవ్వడం లేదు. దీంతో తనకి బ్లాక్బస్టర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ మరోసారి జతకట్టేందుకు ప్లాన్ చేస్తున్నాడట. గతంలో రవితేజకు సాలీడ్ హిట్ అందించిన ఆయన ప్రస్తుతం ప్లాప్ లో ఉన్నాడు. ఇలాంటి టైంలో మాస్ మహారాజ ఆయనను నమ్ముకోని సాహసం చేస్తున్నాడని ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. ఇంతకి ఆ డైరెక్టర్ ఎవరంటే సురేందర్ రెడ్డి. గతంలో వీరిద్దరి కాంబోలో కిక్ సినిమా వచ్చింది. ఈ సినిమా ఎంతపెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రవితేజ కెరీర్లో కిక్ సినిమాలు మైల్స్టోన్ అని చెప్పాలి. మాస్ మహారాజ ఇమేజ్ అమాంతం పెంచిన కిక్ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇప్పటికీ ఈ సినిమాకు మంచి ఫాలోయింగ్ ఉంది ఇందులో రవితేజ మ్యానరిజం, మాస్ అవతార్ ఆడియన్స్ కి నెక్ట్స్ లెవెల్లో ఎంటర్టైన్మెంట్స్ అందించింది.
ఇది బ్లాక్ బస్టర్ అవ్వడంతో కిక్ కి సీక్వెల్ గా కిక్ 2 తీశారు. కానీ, ఇది పెద్దగా వర్కౌట్ కాలేదు. దీంతో ప్లాప్ అయ్యింది. ఇక కిక్ తర్వాత ఈ చిత్రాల తర్వాత డైరెక్టర్ సురేందర్ రెడ్డి కి చెప్పుకోదగ్గ హిట్ లేదు. చాలా గ్యాప్ తర్వాత అఖిల్ తో ఏజెంట్ సినిమా చేశాడు. ఇది ఎంత పెద్ద డిజాస్టర్ అయ్యిందో తెలిసిందే. కనీసం ఓటీటీలు కూడా ఈ సినిమాని కొనే సాహసం చేయలేదు. దీంతో ప్రస్తుతం ఈ డైరెక్టర్కి పెద్దగా ఆఫర్స్ రావడం లేదు. ఒక్క చాన్స్ ఇస్తే చాలు అని ఎదురుచూస్తే పరిస్థితిలో ఉన్న ఆయనకు రవితేజ ఒకే చెప్పాడట. ఇటీవల ఓ సందర్భం కలిసి రవితేజకు స్టోరీ లైన్ చెప్పాడట సురేందర్ రెడ్డి. కాన్సెప్ట్ నచ్చడంతో ఫుల్ స్టోరీ రెడీ చేసుకుని రమ్మన్నాడు మాస్ మహారాజ. ఒకవేళ స్క్రిప్ట్ ఒకే అయితే మాత్రం మళ్లీ కిక్ కాంబో రిపీట్ అవ్వడం ఖాయం అంటున్నారు.
Also Read: Telugu Director: రెండు సినిమాలను పక్కన పెట్టి… హీరోయిన్‌తో ప్రేమలో మునిగితేలుతున్న డైరెక్టర్
ప్రస్తుతానికి అంతమాత్రంగానే జరిగిన ఈ చర్చలు ముందుకు వెళతాయా? ఆదిలో ఆగిపోతాయా అనేది తెలియదు. అదంత సురేందర్ చేతిలోనే ఉంది. ఒకేవేళ ఫుల్ స్టోరీ మాత్రం రవితేజకు నచ్చితే సురేందర్ మరోసారి సినిమా చేసేందుకు రెడీ ఉన్నాడట ఈ మాస్ మహారాజ. అయితే దీనిపై ఇండస్ట్రీ వర్గాల నుంచి రకరకాల అభిప్రాయాలు వస్తున్నాయి. అసలే వరుస ప్లాప్స్ లో రవితేజ ఈ టైంలో సురేందర్ని నమ్మడం కరెక్ట్ కాదని, ఆయన సినిమా చేయడం సాహసమే అంటున్నారు. మరికొందరు మాత్రం మాస్ మహారాజ మ్యానరిజంపై సురేందర్ కి మంచి పట్టు ఉంది. కాబట్టి ఆయన ఇమేజ్ సరిపయే కథను రెడీ చేస్తాడని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. మరి ఈ హ్యట్రిక్ కాంబో సెట్ అయితే మళ్లీ కిక్ లాంటి హిట్ పడటం పక్కా అంటున్నారు. మరి దీనిపై క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.