BigTV English

Sleep: ఎలా నిద్రపోతే మంచిది ? చాలా మందికి తెలియని సీక్రెట్ !

Sleep: ఎలా నిద్రపోతే మంచిది ? చాలా మందికి తెలియని సీక్రెట్ !
Advertisement

Sleep: నిద్ర అనేది మన శరీరానికి చాలా ముఖ్యం. ఇది మనస్సుకు రీఛార్జింగ్ స్టేషన్ లాంటిది. మనం మేల్కొని ఉన్నప్పుడు జరిగే శారీరక, మానసిక పనుల నుంచి కోలుకోవడానికి గాఢ నిద్ర చాలా అవసరం. నిద్ర సరిగా లేకపోతే ఏకాగ్రత్త తగ్గడం, మానసిక ఒత్తిడి పెరగడం అంతే కాకుండా రోగ నిరోధక శక్తి బలహీనపడటం వంటి సమస్యలు కూడా ఎదురవుతాయి. ఈ నేపథ్యంలో.. మీ విశ్రాంతిని పెంచడానికి అంతే కాకుండా ఆరోగ్యంగా ఉండటానికి మీరు పాటించాల్సిన ఆరోగ్యకరమైన నిద్ర అలవాట్లను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.


1. నిద్ర సమయాన్ని స్థిరంగా పాటించండి:
మీ అంతర్గత శరీర గడియారం సరిగ్గా పని చేయడానికి నిద్ర లేచే సమయాన్ని, పడుకునే సమయాన్ని క్రమం తప్పకుండా పాటించాలి. వారాంతాల్లో కూడా ఈ సమయాల్లో ఎక్కువ మార్పు లేకుండా చూసుకోవడం ముఖ్యం. దీని ద్వారా మీ శరీరం అలవాటు పడి మీరు సహజంగా నిద్రించడానికి అంతే కాకుండా మేల్కొనడానికి సహాయపడుతుంది. పెద్దలకు కనీసం 7-8 గంట నిద్ర తప్పకుండా అవసరం ఉంటుంది.

2. నిద్రకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించండి:
మీ బెడ్‌రూమ్‌ను నిద్రకు మాత్రమే కేటాయించండి. గదిని చల్లగా, చీకటిగా, నిశ్శబ్దంగా ఉంచండి. లైట్లు, టీవీ లేదా ఫోన్ నుంచి వచ్చే కాంతి మెదడు నిద్రను ప్రేరేపించే మెలటోనిన్ అనే హార్మోన్‌ను ఉత్పత్తి చేయకుండా అడ్డుకుంటుంది. పడుకునేటప్పుడు రూమ్ ఉష్ణోగ్రత కాస్త చల్లగా ఉండేలా చూసుకోవడం గాఢ నిద్రకు సహాయ పడుతుంది.


3. రాత్రి పడుకునే ముందు విశ్రాంతి తీసుకోండి:
నిద్రకు కనీసం ఒక గంట ముందు విశ్రాంతి తీసుకోవడం ప్రారంభించండి. టీవీ చూడటం, మొబైల్ ఫోన్లు లేదా ల్యాప్‌టాప్‌లు ఉపయోగించడం మానుకోండి. స్క్రీన్‌ల నుంచి వచ్చే బ్లూ లైట్ నిద్రకు భంగం కలిగిస్తుంది. బదులుగా.. పుస్తకం చదవడం, సంగీతం వినడం, గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం లేదా ధ్యానం వంటి ప్రశాంతమైన పనులను ఎంచుకోవడం చాలా మంచిది.

4. ఆహారం, డ్రింక్స్‌పై శ్రద్ధ వహించండి:
పడుకోవడానికి కనీసం 2-3 గంటల ముందు ఎక్కువగా భోజనం చేయడం మానుకోండి. నిద్రపోయే ముందు కెఫీన్, నికోటిన్, ఆల్కహాల్ తీసుకోవడం పూర్తిగా నివారించాలి. కెఫీన్ ఉద్దీపనగా పనిచేసి నిద్రను దూరం చేస్తుంది. ఆల్కహాల్ తాత్కాలికంగా నిద్రను కలిగించినప్పటికీ.. రాత్రి సమయంలో తరచుగా నిద్రకు భంగం కలిగిస్తుంది.

Also Read: వావ్.. డైలీ బ్రోకలీ తింటే.. ఆశ్చర్యపోయే లాభాలు !

5. పగటిపూట నిద్రను నియంత్రించండి:
పగటిపూట ఎక్కువ సేపు నిద్రపోవడం వల్ల రాత్రి నిద్రకు అంతరాయం కలుగుతుంది. మీకు తప్పనిసరి అయితే.. మధ్యాహ్నం 3 గంటలలోపు 20-30 నిమిషాలకు మించకుండా చిన్న కునుకు వేయడం ఉత్తమం.

6. క్రమం తప్పకుండా వ్యాయామం:
రోజువారీ వ్యాయామం రాత్రిపూట నిద్ర నాణ్యతను మెరుగు పరుస్తుంది. అయితే.. పడుకోవడానికి మూడు గంటల ముందు అధిక తీవ్రత కలిగిన వ్యాయామాలు చేయడం మానుకోవాలి. ఎందుకంటే అవి శరీర ఉష్ణోగ్రతను పెంచి నిద్ర పట్టకుండా చేస్తాయి.

ఈ ఆరోగ్యకరమైన నిద్ర అలవాట్లను మీ దినచర్యలో చేర్చుకోవడం ద్వారా మీరు మెరుగైన విశ్రాంతిని పొందడమే కాకుండా.. మీ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని గణనీయంగా మెరుగు పరుచుకోవచ్చు.

Related News

Sugar: చక్కెర లేకుండా టీ, కాఫీ తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?

Muscle Growth Food: ఇలాంటి ఫుడ్ తింటే.. తక్కువ టైంలోనే సిక్స్ ప్యాక్

Water: రోజుకు ఎంత నీళ్లు తాగాలి ? అతిగా తాగితే ఏమవుతుంది ?

Broccoli: వావ్.. డైలీ బ్రోకలీ తింటే.. ఆశ్చర్యపోయే లాభాలు !

Yellow Watermelon: ఎల్లో వాటర్‌ మిలన్‌.. తింటే ఆరోగ్యానికి ఇంత మంచిదా?

Health Benefits: మీకు తెలియని ఆరోగ్య రహస్యాలు.. రోజూ ఇవి తింటే హుషారుగా ఉంటారు

Back Pain: నడుము నొప్పా.. ఈ హోం రెమెడీస్ ట్రై చేయండి

Big Stories

×