New Movie in TV : ఎంచక్కా ఫ్యామిలీ అంతా కలిసి చూస్తూ ఎంజాయ్ చేయగలిగే సినిమా కోసం వెతుకుతున్నారా? అయితే ఈ వీకెండ్ కు మూవీ సెట్టు. వీకెండ్ కు మూవీ అనగానే ఓటీటీ అనుకునేరు. దానికి మళ్ళీ సబ్స్క్రిప్షన్ ఉండాలి. అదేమీ అక్కర్లేకుండా ఈ వీకెండ్ టీవీలోనే హ్యాపీగా ఓ బ్లాక్ బస్టర్ తమిళ కామెడీ ఎంటర్టైనర్ ను టీవీలో చూసి ఎంజాయ్ చేయొచ్చు. థియేటర్లలో, తరువాత ఓటీటీలో దుమ్మురేపిన ఈ మూవీ ఎట్టకేలకు వరల్డ్ టీవీ ప్రీమియర్ కు సిద్ధమైంది. మరి ఇంతకీ ఆ మూవీ ఏ ఛానల్ లో ప్రసారం కానుంది? ఎప్పుడు చూడొచ్చు ? అనే వివరాలపై ఓ లుక్కేద్దాం పదండి.
ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది టూరిస్ట్ ఫ్యామిలీ మూవీ గురించి. ఓటీటీ ప్రియులను ఇప్పటిదాకా కితకితలు పెట్టిన ఈ సినిమా ఇక ఇప్పుడు టీవీలో కూడా సందడి చేయడానికి సిద్ధం అవుతోంది. స్టార్ మా ఛానల్ లో వచ్చే ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఈ మూవీ ప్రసారం కానుంది. తాజాగా దీనిపై అఫిషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ 2025లో వచ్చిన తమిళ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అబిషన్ జీవిన్త్ దర్శకత్వంలో ఎమ్. శశికుమార్, సిమ్రాన్, మిథున్ జై శంకర్, కమలేష్ జాగన్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. 2 గంటల 30 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాకు IMDbలో 8.2/10 రేటింగ్ ఉంది. ఈ సినిమా 2025న మే 1న థియేటర్లలో విడుదల అయింది. జూన్ 2వ తేదీ నుంచి జియో హాట్‌స్టార్‌లో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. వచ్చే వారం ఈ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తో టూరిస్ట్ ఫ్యామిలీ క్రేజీ ట్రిప్ ను ఇంట్లోనే ఎంజాయ్ చేయండి.
ధర్మదాస్ వసంతి అనే దంపతులు వాళ్ళ ఇద్దరు పిల్లలు నీతూ, ముల్లి శ్రీలంకలో నివసిస్తుంటారు. యుద్ధం కారణంగా భయంతో తమ సొంత ఊరు నుంచి బయలుదేరి అన్ అఫీషియల్ గా సముద్రమార్గాన శ్రీలంక నుంచి భారత్ కు చేరుకుంటారు. ధర్మదాస్ బామ్మర్ది సహాయంతో చెన్నైకి వెళ్లి కొత్త జీవితాన్ని మొదలెడతారు. తమకు సంబంధించిన ఫేక్ డాక్యుమెంట్స్ తో, యాస బయటపడకుండా జాగ్రత్త పడుతూ ఇరుగుపొరుగు వారితో ఇట్టే కలిసి పోతారు. నిజానికి ధర్మదాస్ ఫ్యామిలీ చాలా మంచిది. పొరుగు వాళ్ళు కష్టమంటే చాలు టక్కున వాలిపోతారు. కానీ రామేశ్వరం బాంబ్ బ్లాస్ట్ తర్వాత శ్రీలంక నుంచి వచ్చిన టెర్రరిస్టులే ఇది చేశారని అనుమానం వస్తుంది. దీంతో ఈ ఫ్యామిలీని శ్రీలంక నుంచి వస్తున్నప్పుడు చూసి చూడనట్టు వదిలేసిన పోలీస్ కు అనుమానం మొదలవుతుంది. ఇంకేముంది పోలీసులంతా ఈ కుటుంబం ఎక్కడుందో వెతికే పనిలో పడతారు. మరోవైపు ధర్మదాస్ ఫ్యామిలీ తమ మంచితనంతో ఇరుగుపొరుగు మెప్పును పొందుతారు. ఈ క్రమంలోనే పోలీసులు ఆ ఫ్యామిలీ చెన్నైలో నివాసం ఉంటున్న ఇంటికి వస్తారు. ఇన్వెస్టిగేషన్లో ఏం జరిగింది? రామేశ్వరం బాంబ్ బ్లాస్ట్ కి ఈ ఫ్యామిలీకి సంబంధం ఉందా? చివరికి ఏం జరిగింది? ఈ జర్నీలో చోటు చేసుకున్న కామెడీ ఏంటి? అనేది స్టోరీ.
Love, chaos & laughter….all packed in one crazy trip!👨👩👧👦😂
Watch World Television Premiere #TouristFamily, This Sunday at 6pm on #StarMaa#TouristFamilyWorldTelevisionPremiere#TouristFamilyOnStarMaa#Sasikumar #Simran #MithunJaiSankar #Yogalakshmi pic.twitter.com/qN1Ytw3E2x
— Starmaa (@StarMaa) October 21, 2025
Read Also : ఆడవాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ పై పన్ను… ఫ్యామిలీతో చూడకూడని సీన్లున్న హిస్టారికల్ మూవీ