SKN: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నిర్మాతగా మంచి సక్సెస్ అందుకున్న ఎస్కేన్ (SKN)పలు సినిమాలకు నిర్మాతగా డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరిస్తూ ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ ఇండస్ట్రీకి సంబంధించిన అంశాల గురించి మాట్లాడుతూ ఉంటారు. తాజాగా ఎస్కేఎన్ నటుడు కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) హీరోగా నటించిన కే ర్యాంప్ (K-Ramp)సక్సెస్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు ఇందులో భాగంగా ఈయన కిరణ్ అబ్బవరం గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా ఎస్ కే ఎన్ మాట్లాడుతూ.. కిరణ్ అబ్బవరం ఏ విధమైనటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు అయితే ఆయన ఎక్కడ నిలబడితే అది తన గ్రౌండ్ అని తెలిపారు. తను నాతో ఎప్పుడూ మాట్లాడినా అన్నా నేను సంవత్సరానికి రెండు మూడు సినిమాలు చేయాలన్న అవి మంచి సినిమాలు అయితే చాలు అంటూ చెప్పేవాడు. తను ఇప్పుడు కూడా ఒక సినిమాకు కమిట్ అయితే ఆ సినిమా కథ మాత్రమే చూస్తాడు ఆ సినిమా చేస్తే వచ్చే ఫైనల్ రిజల్ట్ మాత్రమే చూస్తాడు తప్ప డైరెక్టర్ ఎవరు? తన పాత్రకు ఎన్ని ఫైట్లు ఉన్నాయి ఎన్ని సాంగ్స్ ఉన్నాయనే విషయాల గురించి మాట్లాడరని ఎస్కేఎన్ తెలిపారు.
కిరణ్ లాంటి వాళ్ళ గురించి చెప్పడం ఇండస్ట్రీకి ఎంతో అవసరం ఇలాంటి హీరోలు ఇండస్ట్రీకి అవసరమని తెలిపారు. ఈయన సినిమాకు కమిట్ అయితే సినిమా రిజల్ట్ మాత్రమే ఆలోచిస్తారు అప్పట్లో అల్లు అర్జున్(Allu Arjun) ఇలా ఆలోచించేవారు ఇప్పుడు కిరణ్ అబ్బవరం అంటూ ఏకంగా తనని అల్లు అర్జున్ తో పోలుస్తూ నిర్మాత ఎస్కేఎన్ తనపై ప్రశంసలు కురిపించారు . ప్రస్తుతం ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కిరణ్ అబ్బవరం ఏ విధమైనటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ నేడు సక్సెస్ అందుకున్నారు.
నిర్మాతగా కూడా సక్సెస్..
ఇలా కిరణ్ అబ్బవరం నటుడిగా నిర్మాతగా కూడా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది క అనే సినిమాని సొంత బ్యానర్ లో నిర్మించిన కిరణ్ అబ్బవరం మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఈ ఏడాది కే ర్యాంప్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే ఈ చిత్రం యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహించగా, రాజేష్ దండు నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరంకి జోడిగా నటి యుక్తి తరేజా నటించారు. ఈ సినిమాలో సీనియర్ హీరోలైన సాయికుమార్, నరేష్ వంటి తదితరులు కీలకపాత్రలలో నటించారు. ఇదివరకు కిరణ్ నటించిన సినిమాల కంటే ఎంతో విభిన్నంగా తన నటనతో ప్రేక్షకులను మెప్పించి మంచి సక్సెస్ అందుకున్నారు.
Also Read: Renu Desai: మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రేణు దేశాయ్.. మొదట సారి ఆ పాత్రలో?