Venkatesh Trivikram : చాలామంది ఎంతోకాలంగా ఎదురు చూస్తున్నా కాంబినేషన్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు విక్టరీ వెంకటేష్. విక్టరీ వెంకటేష్ కు త్రివిక్రమ్ శ్రీనివాస్ రచయితగా రాసిన సినిమాలో చాలా ప్రత్యేకమైన చెప్పాలి. ఆ సినిమాల్లో వెంకటేష్ కామెడీ టైమింగ్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఇప్పటికీ కూడా ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు నువ్వు నాకు నచ్చావ్ సినిమా. ఈ సినిమాలో త్రివిక్రమ్ రాసిన ఫన్ చాలా కొత్తగా అనిపిస్తుంది. మామూలు మాటలతో బూతులు లేకుండా నవ్వించొచ్చు అని ప్రూవ్ చేసిన అతి తక్కువ మంది రచయితలలో త్రివిక్రమ్ కూడా ఒకరు.
అయితే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుంది అని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. గతంలో కూడా నాని విక్టరీ వెంకటేష్ హీరోలుగా త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా వస్తుంది అని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన ఆ సినిమా ఆగిపోయింది. వీరిద్దరూ కలిసి ఇప్పుడు సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని తెలుస్తుంది.
కే జి ఎఫ్ సినిమాతో విపరీతమైన గుర్తింపు సాధించుకుంది శ్రీనిధి శెట్టి. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత సక్సెస్ సాధించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అలానే నాని నటించిన హిట్ 3 సినిమా కూడా మంచి సక్సెస్ సాధించింది. హిట్ 3 సినిమాకి సంబంధించిన ఇంటర్వ్యుస్ బాగా పాపులర్ అయ్యాయి. కొన్ని ఇంటర్వ్యూస్ లో శ్రీనిధి మాటలు విపరీతంగా ఆకట్టుకున్నాయి.
ఇక రీసెంట్గా తెలుసు కదా సినిమాతో కూడా మంచి డీసెంట్ సక్సెస్ అందుకుంది శ్రీనిధి శెట్టి. ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ చేస్తున్న సినిమాలో హీరోయిన్ గా శ్రీనిధి శెట్టిని ఫిక్స్ చేశారు. దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు. ఈ సినిమాలో నటిస్తుండడంతో ఒక ప్రత్యేకమైన పోస్టర్ తో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇక త్రివిక్రమ్ సినిమాలను బాగా గమనిస్తే ప్రతి సినిమాలోని ఇద్దరు హీరోయిన్స్ ఉంటుంటారు. శ్రీనిధి శెట్టి తో పాటు ఇంకో హీరోయిన్ ఉంటారా అని అందరికీ ఒక రకమైన సందేహం మొదలైంది. ఒకవేళ అలా ఉన్నా కూడా దాని గురించి అధికారిక ప్రక్కన త్వరలో వస్తుంది.
Also Read: Naga Vamsi: ఆ సినిమా నేను తెలుగులో తీసుకుంటే పచ్చి బూతులు తిట్టేవాళ్ళు