Mirai: చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా అవతరించి అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా హీరోగా పేరు సొంతం చేసుకున్న తేజ సజ్జ (Teja Sajja) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తాజాగా ఈయన కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మిరాయ్ (Mirai ) అనే చిత్రాన్ని తెరకెక్కించారు. రితిక నాయక్ (Rithika Nayak) హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో మంచు మనోజ్ (Manchu Manoj)విలన్ గా నటించగా.. జగపతిబాబు, శ్రియ శరన్ , గెటప్ శ్రీను తదితరులు కీలకపాత్రలు పోషించారు. కథ, యాక్షన్ , థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషనల్ సన్నివేశాలను ఆస్వాదిస్తూ సూపర్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది.ముఖ్యంగా ఈ సినిమా కథ, పాటలు , యాక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ అన్ని కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి..
భారీ అంజనాల మధ్య సెప్టెంబర్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. అలా థియేటర్లలో సంచలనం సృష్టించిన ఈ సినిమా జియో హాట్ స్టార్ లో అక్టోబర్ 10వ తేదీ నుండి అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఓటీటీలో కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా అటు థియేటర్లలోనే కాదు ఇటు ఓటీటీ లో కూడా సంచలనం సృష్టించింది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..అక్టోబర్ 10వ తేదీ నుంచి జియో హాట్స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం విడుదలైన అతి తక్కువ సమయంలోనే 200 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ మినిట్స్ ను పూర్తి చేసుకుంది అని తాజాగా మూవీ మేకర్స్ ప్రకటించారు. ఏది ఏమైనా ఫాంటసీ అంశాలతో తెరకెక్కి.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈ చిత్రం.. ఇటు ఓటీటీలో కూడా రికార్డు సృష్టించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవని చెప్పవచ్చు.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. మహా రాజు అశోకుడు కళింగ యుద్ధం గెలిచిన తర్వాత జరిగిన విధ్వంసాన్ని తలుచుకొని పశ్చాత్తాపడతాడు. ఈ నష్టానికి తనలోని దైవ శక్తి ఒక కారణమని భావించి.. ఆ శక్తిని తొమ్మిది గ్రంథాలలో నిక్షిప్తం చేసి.. వాటి రక్షణ బాధ్యతను 9 మంది యోధుల చేతిలో పెడతాడు. అయితే కొన్ని శతాబ్దాల తర్వాత ఆ గ్రంథాలపై దుష్టశక్తి మహావీర్ లామా (మంచు మనోజ్) కన్ను పడుతుంది అతడు కోరుకున్నట్లుగా మృత్యుంజయుడుగా మారి.. ప్రపంచాన్ని శాసించే శక్తిగా ఎదగాలంటే 9వ గ్రంథం అవసరం. కానీ ఆ గ్రంధాన్ని సొంతం చేసుకోవడం అంత సులభం కాదు. ఎందుకంటే దానికి రక్షణగా అంబికా (శ్రియ) ఉంటుంది. అతడిని ఎదుర్కొనేందుకు తనకు పుట్టిన బిడ్డ వేద (తేజ సజ్జా)ను పసికందుగా ఉన్నప్పుడే దూరం చేసుకుంటుంది అంబికా. ఇక అనాధగా బ్రతికిన వేద తన బాధ్యతను ఎవరి ద్వారా తెలుసుకుంటాడు? తన తల్లి ఆశయాన్ని నెరవేర్చాడా? మహావీర్ లామా ఆశయాన్ని విచ్ఛిన్నం చేశాడా? లాంటివి తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.
also read: Srinu vaitla: కిరణ్ ను చూస్తుంటే ఆ స్టార్ హీరో గుర్తొస్తున్నాడు!