Sujeeth: రన్ రాజా రన్ సినిమా ద్వారా దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన సుజీత్(Sujeeth) మొదటి సినిమాతోనే ఉత్తమ దర్శకుడిగా సైమా అవార్డును అందుకున్నారు. ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సుజీత్ అనంతరం ప్రభాస్ హీరోగా సాహో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత సుజిత్ ఏకంగా పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ను లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ హీరోగా ఓజీ సినిమా(OG Movie) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.
ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో సుజిత్ ఓజి సీక్వెల్ గురించి ప్రకటించిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా సీక్వెల్ , ప్రీక్వెల్ కూడా రాబోతున్నట్లు తెలియజేశారు. అయితే ప్రస్తుతం సుజిత నాని(Nani)తో బ్లడీ రొమియో(Bloody Romeo) సినిమా షూటింగ్ పనులను ప్రారంభించారు. దసరా పండుగను పురస్కరించుకొని ఈ సినిమా పూజ కార్యక్రమాలు జరిగిన సంగతి తెలిసిందే. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా ప్రారంభం కానున్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది డిసెంబర్లో విడుదల చేయాలని సుజిత్ ప్లాన్ చేస్తున్నారు .ఈ సినిమా అనంతరం పవన్ కళ్యాణ్ తో ఓజి2(OG 2) సినిమా చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి.
తాజాగా ఈ సినిమా గురించి మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సుజిత్ ఓజి2 సినిమాని పక్కన పెట్టి బాలీవుడ్ బాట పడుతున్నారని తెలుస్తోంది. నాని బ్లడీ రొమియో సినిమా షూటింగ్ పూర్తి అయిన వెంటనే ఈయన బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తో కలిసి ఒక సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేస్తున్నారని తెలుస్తుంది. ఇక ఈ విషయం గురించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు కానీ ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నానికి జోడిగా పూజ హెగ్డే?
ఇలా షారుక్ ఖాన్ సినిమా కారణంగా పవన్ కళ్యాణ్ సినిమా మరింత ఆలస్యం అవుతుందని తెలియడంతో అభిమానులు కాస్త నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఓజి సీక్వెల్ గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. ఇటీవల కాలంలో బాలీవుడ్ హీరోలు కూడా సౌత్ డైరెక్టర్లతో పని చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది వరకే షారుఖ్ ఖాన్ అట్లీ డైరెక్షన్ లో జవాన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ క్రమంలోనే సుజిత్ తో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలి అంటే అధికారక ప్రకటన వచ్చేవరకు ఎదురు చూడాల్సిందే. ఇక నాని ప్రస్తుతం ది ప్యారడైజ్ సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తి కాగానే సుజిత్ సినిమాతో బిజీ కాబోతున్నారు. ఈ సినిమాలో నానికి జోడిగా పూజా హెగ్డే నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Also Read: SKN: అప్పుడు అల్లు అర్జున్..ఇప్పుడు కిరణ్ అబ్బవరం.. పొగడ్తలతో ముంచేత్తిన నిర్మాత!