BigTV English

Sujeeth: పవన్ కంటే ముందు ఆ మెగా హీరోని లైన్ లో పెట్టిన సుజీత్…కథ కూడా సిద్ధం కానీ?

Sujeeth: పవన్ కంటే ముందు ఆ మెగా హీరోని లైన్ లో పెట్టిన సుజీత్…కథ కూడా సిద్ధం కానీ?

Sujeeth: టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడుగా కొనసాగుతున్న వారిలో సుజీత్(Sujeeth) ఒకరు. సినిమాలపై ఆసక్తితో 23 సంవత్సరాల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి శర్వానంద్ తో రన్ రాజా రన్ సినిమా ద్వారా దర్శకుడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. మొదటి సినిమాను ఎంతో మంచి సక్సెస్ అందుకోవడంతో ఈయన పేరు ఇండస్ట్రీలో మారుమోగిపోయింది ఏకంగా రెండో సినిమా ప్రభాస్ తో చేసే అవకాశాన్ని కూడా అందుకున్నారు. ప్రభాస్ హీరోగా సాహో(Sahoo) అనే సినిమాని పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఈ సినిమా దక్షిణాది రాష్ట్రాలలో కంటే ఉత్తరాది రాష్ట్రాలలోనే అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంది.


రామ్ చరణ్ తో సుజీత్ సినిమా?

ఇకపోతే ఈ సినిమా తర్వాత ఏకంగా పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా ఓజీ (OG)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాకు మంచి ఆదరణ వస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా సుజీత్ ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. దర్శకుడు సుజీత్ పవన్ కళ్యాణ్ కంటే ముందుగానే మరొక మెగా హీరోతో సినిమాకు కమిట్ అయ్యారని వెల్లడించారు. సాహో సినిమా తరువాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) తో కలిసి ఈయన సినిమా చేయాలని నిర్ణయం తీసుకున్నారట.

యూకే బ్యాడ్ డ్రాప్ లో..

రామ్ చరణ్ హీరోగా యూకే బ్యాక్ డ్రాప్ లో ఓ సినిమా చేయాలని అనుకున్నాను. స్టోరీ లైన్ కూడా సిద్ధం చేసుకున్నానని అయితే ఆ సమయంలో రామ్ చరణ్ గారిని కలిసి తనకు స్టోరీ లైన్ నెరేట్ చేద్దామనే లోపే కరోనా రావడంతో ఈ ప్రాజెక్టు ముందుకు కదలలేదని సుజిత్ ఈ సందర్భంగా వెల్లడించారు.ఇక ఈయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా కనుక వచ్చి ఉంటే సుజీత్, చరణ్ ఖాతాలో మరొక హిట్ వచ్చి ఉండేది అంటూ మెగా అభిమానులు భావిస్తున్నారు.


పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా చరణ్..

మరి గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ మిస్ అయినప్పటికీ భవిష్యత్తులో అయిన వీరిద్దరి కాంబోలో సినిమా వస్తుందేమో తెలియాల్సి ఉంది. ఇకపోతే సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి ఈ యూనివర్స్ లో భాగంగా ఏ ఏ హీరోలను భాగం చేస్తారో తెలియాల్సి ఉంది. ఇక రాంచరణ్ సినీ విషయానికి వస్తే ఈయన ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా మంచి సక్సెస్ అందుకొని వరుస పాన్ ఇండియా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో పెద్ది సినిమా (Peddi Movie)షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ సుకుమార్ డైరెక్షన్లో మరో సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే బుచ్చిబాబు సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ పెద్ద ఎత్తున అంచనాలను పెంచేసాయి. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాలో చరణ్ కి జోడిగా జాన్వీ కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే.

Also Read: Bahubali prequel: బాహుబలి ప్రీక్వెల్ ఆలోచనలో విజయేంద్ర ప్రసాద్.. స్టోరీ అదేనా?

Related News

Dharma Mahesh: మౌనం వీడిన హీరో ధర్మ మహేష్‌.. భార్య గౌతమిపై సంచలన కామెంట్స్‌..!

Actress Sudeepa: పెళ్లయిన 11 ఏళ్లకు బిడ్డకు జన్మనిచ్చిన నటి..ఖుషీ అవుతున్న ఫ్యాన్స్!

Idli Kadai : మీకు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయిరా బాబు? పర్ఫెక్ట్ ప్లానింగ్ ప్రమోషన్స్

Chandoo Mondeti : దారుణంగా అప్పులు చేసిన డైరెక్టర్, అప్పుల వాళ్ళని క్యూలో నిల్చబెట్టి క్లియర్ చేసిన ఫాదర్

Gautami Chowdary: గౌతమ్‌ చౌదరికి అంబర్‌పెట్‌ శంకర్‌ మద్దతు.. లైవ్‌లో అసలు నిజం బట్టబయలు..

Balakrishna: బాలకృష్ణ బహిరంగ క్షమాపణలు చెప్పాల్సిందే

Tollywood: మడ్డీ ఫేమ్ ప్రగభల్ చిత్రం ‘జాకీ’ ఫస్ట్ లుక్ రిలీజ్.. ఎవరు టచ్ చేయని పాయింట్ తో..

Big Stories

×