Tollywood: మడ్డీ సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన డైరెక్టర్ డాక్టర్. ప్రగభల్ (డా.Pragabhal) తాజాగా పీకే 7 స్టూడియో సమర్పణలో తెరకెక్కిస్తున్న చిత్రం జాకీ. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. భారతీయ సినిమాలో తొలిసారిగా మట్టి రేసింగ్ నేపథ్యంలో వచ్చిన మడ్డీ చిత్రం ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ సినిమా అందించిన సక్సెస్ తో ఇప్పుడు మరో ఆసక్తికరమైన కథాంశంతో ప్రేక్షకులకు థ్రిల్ పంచడానికి డాక్టర్ ప్రగభల్ జాకీ అంటూ మన ముందుకు రాబోతున్నారు.తాజాగా ఈ జాకీ చిత్రం నుండి పోస్టర్ ను రిలీజ్ చేశారు.వినూత్నమైన కథతో రాబోతున్న ఈ చిత్రంలో గోట్స్ ఫైట్ మరింత ఆసక్తికరంగా ఉండబోతుందని పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా మధురైలో సాంప్రదాయంగా కొనసాగుతున్న ఈ గోట్ ఫైట్ చుట్టూ అల్లుకున్న కథ అని సమాచారం.
ఇందులో ఫైట్స్ మాత్రమే కాకుండా అద్భుతమైన భావోద్వేగాలతో ప్రేక్షకులను కట్టిపడేసేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు మనకు ఫస్ట్ లుక్ చూస్తుంటేనే అర్థమవుతుంది. ఈ సినిమా కోసం డైరెక్టర్ ప్రగభల్ ఎంతో శ్రమించినట్టు సమాచారం. రియల్ లొకేషన్స్ లో చిత్రీకరించడమే కాకుండా 2022 నుంచే ఆయన అక్కడి సాంస్కృతిక సాంప్రదాయాలను అర్థం చేసుకోవడానికి అదే ప్రాంతంలో నివసిస్తున్నారట. ఈ విషయాన్ని స్వయంగా డైరెక్టర్ స్పష్టం చేయడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇది కదా డైరెక్టర్ కి కావాల్సిన లక్షణం. ఒక కథను తెరపై చూపించాలి అంటే ఆ కథ గురించి పూర్తి అవగాహన ఉండాలి. అప్పుడే ఇలాంటి కథలు కచ్చితంగా ప్రేక్షకుడిని మెప్పిస్తాయి అంటూ అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు.
also read:Bigg Boss 9 Promo: కట్టగట్టుకొని మరీ ఆమెను పంపించేశారుగా.. ఇది మిడ్ వీక్ ఎలిమినేషనా?
గత మూడు ఏళ్లుగా ప్రాంతీయవాసులతో చిత్ర బృందం సావాసం..
ఇకపోతే డైరెక్టర్ ఈ సినిమాను నేచురల్ గా తెరకెక్కించడానికి అక్కడి ప్రజలతో మమేకమై ప్రతిదీ తెలుసుకొని చాలా జాగ్రత్తగా షూట్ చేస్తున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమా చిత్రీకరణ పై మేకర్స్ మాట్లాడుతూ.. సినిమాకి కావలసిన ప్రతి అంశాన్ని కూడా ఇందులో జోడించి ఎంతో గ్రిప్పింగ్ గా స్క్రీన్ ప్లే ని సెట్ చేసారు. ఈ సినిమా కోసం నటీనటులు గోట్స్ సంరక్షకులతో కొద్దిరోజులు సావాసం చేసి మరీ, వారితో, గోట్స్ తో అనుబంధం పెంచుకున్నారు. ముఖ్యంగా నటీనటులు అద్భుతమైన ప్రదర్శన కోసం చాలా శిక్షణ తీసుకున్నారు . వీరు తమ నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తారు. అటు ఫైట్ సన్నివేశాల కోసం శారీరకంగా, మానసికంగా సిద్ధమయ్యారు కాబట్టే ప్రతి సన్నివేశం చాలా అద్భుతంగా వచ్చింది ” అని తెలిపారు. ఇక మధురై లో ఉన్న ఈ సంస్కృతి ప్రేక్షకులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని, ముఖ్యంగా గోట్ సంరక్షకుల భావోద్వేగాలు కట్టిపడేస్తాయని సమాచారం. మరి భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా నటీనటులకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
ఈ సినిమా తారాగణం విషయానికి వస్తే..
చిత్రం: జాకీ
నటీనటులు: యువన్ కృష్ణ, రిధాన్ కృష్ణన్ , అమ్ము అభిరామి, మధు సుధన్ రావు
రచన-దర్శకత్వం : డాక్టర్ ప్రగభల్
నిర్మాత: ప్రేమ కృష్ణదాస్, సీ దేవదాస్
సినిమాటోగ్రఫీ: ఉదయకుమార్
ఎడిటింగ్: శ్రీకాంత్.
సంగీతం: సక్తి బాలాజీ
ఆర్ట్ డైరెక్షన్: సి. ఉదయకుమార్
సౌండ్: రాజా కృష్ణన్
ఫైట్ మాస్టర్: జాకీ ప్రభు
కాస్ట్యూమ్స్: జోషువా మాక్స్‌వెల్