Paytm Gold Coins: పేటీఎం డిజిటల్ చెల్లింపులపై మరో ఆఫర్ ప్రకటించింది. ఆన్ లైన్ లావాదేవీల ద్వారా వచ్చే రివార్డులను బంగారు నాణేలుగా మార్చే కొత్త ప్రోగ్రామ్‌ను ప్రకటించింది. పేటీఎంలో చేసే ప్రతి చెల్లింపును కస్టమర్లు డిజిటల్ గోల్డ్ గా మార్చుకునే అవకాశం కల్పించింది. దసరా, దీపావళి, ధనత్రయోదశి పండుగలు వరుసగా వస్తుండడంతో.. ‘గోల్డ్ కాయిన్స్’ అనే రివార్డ్ ప్రోగ్రామ్ ను పేటీఎం ప్రారంభించింది.
పేటీఎం స్కాన్ & పే, ఆన్‌లైన్ కొనుగోళ్లు, డబ్బు బదిలీలు, రీఛార్జ్ లు, బిల్లులు, ఇతర చెల్లింపులతో పాటు ప్రతి లావాదేవీపై 1 శాతం విలువైన బంగారు నాణేలను రివార్డుగా పొందవచ్చు. ఇలా 100 డిజిటల్ బంగారు నాణేలను పొందితే అది రూ.1 రియల్ గోల్డ్ గా రిడీమ్ చేయవచ్చు.
UPI, డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసే అన్ని చెల్లింపులతో గోల్డ్ కాయిన్స్ పొందవచ్చు. క్రెడిట్ కార్డులు, రూపే క్రెడిట్ కార్డుల ద్వారా UPI చెల్లింపులు చేసే కస్టమర్లు డబుల్ బంగారు నాణేలను పొందుతారు.
పేటీఎంలో క్రెడిట్ కార్డ్ లేదా రూపే క్రెడిట్ కార్డ్ ద్వారా యూపీఐ చెల్లింపులు చేస్తే, వారు రెట్టింపు గోల్డ్ కాయిన్స్ రివార్డులు పొందవచ్చు. ఈ లావాదేవీలు ఇతర చెల్లింపులతో పోలిస్తే అధిక రివార్డులను సంపాదించడంలో సహాయపడతాయి.
పేటీఎం బంగారు నాణేలను నిజమైన బంగారంగా రిడీమ్ చేసుకునేందుకు.. పేటీఎం యాప్ హోమ్ స్క్రీన్‌లో ‘గోల్డ్ కాయిన్స్’ విడ్జెట్‌పై నొక్కండి. లావాదేవీల నుండి సంపాదించిన మీ బంగారు నాణేల బ్యాలెన్స్‌ను వీక్షించండి. మీ బ్యాలెన్స్ 1,500 నాణేలకు చేరుకున్న తర్వాత, ‘కన్వర్ట్ టు రియల్ గోల్డ్’ ఎంపిక అందుబాటులో ఉంటుంది. మీ బంగారు నాణేలను డిజిటల్ గోల్డ్‌గా సులభంగా మార్చుకోవచ్చు (100 బంగారు నాణేలు = రూ. 1 విలువైన డిజిటల్ బంగారం).
Also Read: PMAY Home Loan: అతి తక్కువ వడ్డీకే హోం లోన్.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
పేటీఎం డిజిటల్ గోల్డ్ అనేది ఒక ఆధునిక పెట్టుబడి. కస్టమర్లు భౌతికంగా బంగారాన్ని కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా డిజిటల్ మార్గంలో బంగారాన్ని కొనుగోలు చేయడానికి, దాచుకోవడానికి, విక్రయించడానికి అనుమతిస్తుంది. 24K 99.99% స్వచ్ఛమైన బంగారాన్ని 1 రూపాయి నుండి కొనుగోలు చేయవచ్చు.