Bahubali Prequel: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీని కీలక మలుపు తిప్పిన సినిమా ఏదైనా ఉంది అంటే అది బాహుబలి(Bahubali) సినిమా అని చెప్పాలి. రాజమౌళి (Rajamouli)దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్(Prabhas), రానా, అనుష్క, తమన్నా వంటి వారు ప్రధాన పాత్రలలో నటించారు అయితే అప్పటివరకు తెలుగు సినిమాలు కేవలం తెలుగు భాషకు మాత్రమే పరిమితమయ్యాయి కానీ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే విడుదలవుతున్నాయి.
రాజమౌళి బాహుబలి సినిమాని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే బాహుబలి మూడో భాగం కూడా ఉండబోతోంది అంటూ ఇదివరకు వార్తలు వినిపించాయి. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ సినిమా మూడో భాగం కాకుండా బాహుబలికి ఫ్రీక్వెల్(Bahubali Prequel) రాబోతుందని తెలుస్తోంది. బాహుబలి కథ రచయిత విజయేంద్ర ప్రసాద్(Vijayendra Prasad) ప్రస్తుతం బాహుబలి ఫ్రీక్వెల్ ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. త్వరలోనే ఈ ఫ్రీక్వెల్ స్క్రిప్ట్ పనులు కూడా ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది.
బాహుబలి రెండు భాగాలు మాహిష్మతి సామ్రాజ్యం గురించి ఎంతో వివరంగా తెలియజేశారు అయితే మాహిష్మతి సామ్రాజ్యంలో సైన్యాధిపతిగా ఉన్న కట్టప్ప(Kattappa) పాత్ర కూడా ఈ సినిమాలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఈ సినిమా ఇంత మంచి సక్సెస్ అందుకుంది అంటే కట్టప్ప పాత్ర కూడా అందుకు ప్రధాన కారణం అని చెప్పాలి. అయితే బాహుబలి ఫ్రీక్వెల్ లో అసలు ఈ కట్టప్ప ఎవరు? కట్టప్ప కుటుంబ నేపథ్యం ఏంటీ ?అనే విషయాలపై సినిమా చేస్తే బాగుంటుందనే ఆలోచనలో విజయేంద్ర ప్రసాద్ ఉన్నారని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా స్క్రిప్ట్ కూడా ప్రారంభించబోతున్నట్టు ఇండస్ట్రీ సమాచారం.
బాహుబలి ది ఎపిక్…
బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్ర ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నప్పటికీ ఆయన కుటుంబం గురించి ఎక్కడ ప్రస్తావనకు రాలేదు అందుకే కట్టప్ప కుటుంబం గురించే మరొక సినిమా చేయాలని ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది. ఇక కట్టప్ప పాత్రలో నటుడు సత్యరాజ్ ఎంతో అద్భుతమైన నటనను కనబరిచారు. మరి ఈ సినిమా గురించి ఇప్పటివరకు ఎలాంటి అధికారక ప్రకటన లేదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ అవుతుంది. ఇక ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి రెండు భాగాలను కలిపి బాహుబలి ది ఎపిక్(Bahubali The Epic) పేరిట ఓకే భాగంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా అక్టోబర్ 31వ తేదీ ప్రపంచవ్యాప్తంగా తిరిగి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.
Also Read: Sujeeth: పవన్ కోసం బడా ఆఫర్ వదులుకున్న సుజీత్…సరైన నిర్ణయమేనా?