E-Paper
Advertisement

Director Radha Krishna: ప్రభాస్ డైరెక్టర్ ఇంట్లో విషాదం.. అంతా శూన్యం అంటూ ఎమోషనల్!

Director Radha Krishna: ప్రభాస్ డైరెక్టర్ ఇంట్లో విషాదం.. అంతా శూన్యం అంటూ ఎమోషనల్!
Advertisement

Director Radha Krishna: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటీవల వరుస విషాద సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇండస్ట్రీకి సంబంధించిన సెలెబ్రెటీలు మరణించడం లేదా వారి కుటుంబ సభ్యులు మరణించడంతో చిత్ర పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. నిన్నటికి నిన్న ప్రముఖ నటి హేమ తల్లి అనారోగ్య సమస్యలతో మరణించిన సంగతి తెలిసిందే. ఇక ఈ విషయం మర్చిపోకముందే మరొక దర్శకుడు తల్లి కన్నుమూయడంతో అందరిని దిగ్బ్రాంతికి గురిచేస్తుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా కొనసాగుతున్న వారిలో రాధాకృష్ణ (Radha Krishna)ఒకరు. ఈయన ప్రభాస్(Prabhas) హీరోగా నటించిన రాధే శ్యామ్(Radhe Shyam) సినిమాకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.

రాధాకృష్ణ తల్లి రమణి మరణం..

ఇలా దర్శకుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న రాధాకృష్ణ తల్లి రమణి మరణించడంతో ఈయన సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. రాధాకృష్ణ తల్లి రమణి నవంబర్ 15వ తేదీ మరణించినప్పటికీ ఆయన ఈ విషయాన్ని తాజాగా సోషల్ మీడియా వేదికగా తెలియ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. తన తల్లి ఫోటోని షేర్ చేస్తూ..”ఈ ప్రపంచంలో నాకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చావు.. నా మనసులో మాత్రం శూన్యతను మిగిల్చి వెళ్లిపోయావు అమ్మ అంటూ” ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు.. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు అభిమానులు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు ఈ పోస్ట్ పై స్పందిస్తూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

జిల్ సినిమాతో దర్శకుడిగా పరిచయం..

Advertisement

ఇక రాధాకృష్ణ ఇండస్ట్రీలో స్క్రీన్ రైటర్ గా దర్శకుడిగా పనిచేస్తున్నారు. ఈయన మొదటిసారి గోపీచంద్ హీరోగా నటించిన జిల్ అనే సినిమా ద్వారా దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 2014లో విడుదలైన ఈ సినిమా పర్వాలేదు అనిపించుకున్నప్పటికీ తదుపరి ప్రభాస్ తో సినిమా చేసే అవకాశాన్ని అందుకున్నారు. ప్రభాస్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటించిన రాధే శ్యామ్ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా 2020వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

Advertisement

ఈ సినిమా అనంతరం రాధాకృష్ణ తదుపరి సినిమాలను ఇప్పటివరకు ప్రకటించలేదు. అయితే ఈయన ఈ రెండు సినిమాల కంటే ముందుగా సాహసం, ప్రయాణం అనే సినిమాలకు డైలాగ్ రైటర్ గా కూడా పనిచేశారు. మరి రాధాకృష్ణ దర్శకుడిగా ఇప్పటివరకు తదుపరి సినిమాలను ప్రకటించకపోవడంతో ఈయన దర్శకుడుగా ఇండస్ట్రీకి దూరమైనట్టేనా? లేదా తదుపరి సినిమా పనులలో బిజీగా ఉన్నారా? అనే విషయాలు తెలియాల్సి ఉంది. సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్ గా ఉండని రాధాకృష్ణ తాజాగా తన తల్లి మరణం గురించి పోస్ట్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది.

Also Read: Karthi New Movie : అన్నగారు వస్తారు… కార్తీ కొత్త సినిమా టైటిల్ రివీల్

Related News

‘విక్రమ్ 1’ ర్యాకెట్ ప్రయోగంలో జబర్దస్త్ సత్యశ్రీ చెల్లి కీలక పాత్ర.. ఆ ఫొటోలు షేర్ చేస్తూ నటి ఎమోషనల్!

నటిగా పీవీ సింధు.. ఆసక్తిని రేకెత్తిస్తున్న పోస్ట్!

చిన్న వయసులోనే గొప్ప మనసు చాటుకున్న సితార.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

Big Stories

Advertisement
×