Ajith Kumar: కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు అజిత్ కుమార్ (Ajith Kumar)ఒకరు. హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించిన ఈయనకు రైడింగ్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలా బైక్ రైడింగ్ తో పాటు కార్ రేసింగ్(Car Racing) కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ ఇప్పటికే ఎన్నో రికార్డులను సృష్టించారు. ఇక ఇటీవల కాలంలో అజిత సినిమాలలో నటించడం కంటే కూడా కార్ రేసింగ్ లో ఎక్కువగా పాల్గొంటున్న సంగతి తెలిసిందే . అయితే అజిత్ కుమార్ ఈ కార్ రేస్ పాల్గొన్న సమయంలో ఎన్నోసార్లు ప్రమాదానికి గురయ్యారు. తాజాగా మరోసారి ఈయన కారు ప్రమాదానికి గురయ్యారని తెలుస్తోంది. ఇలా ఈయన కారు ప్రమాదానికి గురయ్యారనే విషయం తెలిసిన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రమాదం నుంచి బయటపడిన అజిత్…
తాజాగా అజిత్ కుమార్ ఇటలీలోని(Italy) మిసానో ట్రాక్ లో జరుగుతున్న GT4 యూరోపియన్ ఛాంపియన్షిప్ రేస్ 2 సమయంలో ఆయన కారుకు ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఈ రేస్ లో భాగంగా ట్రాక్ పై ఆగి ఉన్న కారును అజిత్ గమనించకపోవడంతోనే వెళ్లి ఆగి ఉన్న కారును ఢీ కొట్టినట్టు తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదంలో (Accident) హీరో అజిత్ కు ఎలాంటి గాయాలు కాలేదని ఎవరికి ఎలాంటి ప్రమాదం లేదని తెలుస్తోంది. ఇలా ఈయనకు ప్రమాదం జరిగిన ఎలాంటి గాయాలు లేవని తెలియడంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇకపోతే అజిత్ ఇలా ప్రమాదానికి గురి కావడం ఇది మొదటిసారి కాదు.
ముచ్చటగా మూడోసారి…
గతంలో ఎన్నోసార్లు ఈయన రేసింగ్ లో పాల్గొన్న సమయంలో ప్రమాదాలకు గురయ్యారు. గతంలో రెండు సార్లు ఇలా కార్ రేస్ లో పాల్గొన్న సమయంలోనే ప్రమాదానికి గురయ్యారు. ఇది మూడోసారి కావటం గమనార్హం. అయితే ఎప్పుడు ఈయనకు ఎలాంటి గాయాలు లేకపోవడంతో అభిమానులు సంతోషపడుతున్న ఈయన విషయంలో మాత్రం కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రేసింగ్ అంటే ఎంత ఇష్టమున్న అజిత్ మరిన్ని జాగ్రత్తలు తీసుకొని రేస్ లో పాల్గొనాలి అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. గతంలో దుబాయ్‌లో జరిగిన కార్ రేస్‌లో పాల్గొన్నారు. రేస్ మొదలు కాకముందే ప్రాక్టీస్‌లో బ్రేక్ ఫెయిలవ్వడంతో యాక్సిడెంట్ జరిగింది.
గుడ్ బాడ్ అగ్లీ…
ఇకపోతే పోర్చుగల్ లో జరిగిన కార్ రేస్ ఈవెంట్ లో కూడా ఈయన పాల్గొన్నారు. అయితే ఇక్కడ కూడా ప్రమాదానికి గురి అయ్యారు. ఇలా ప్రతిసారి ప్రమాదాల బారిన పడుతున్నప్పటికీ అదృష్టవశాత్తు ఈయనకి ఏమి జరగకపోవడం విశేషం. ఇక అజిత్ సినిమాల విషయానికి వస్తే ఈయన చివరిగా గుడ్ బ్యాడ్ అగ్లీ(Good Bad Ugly) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. అధిక్ రవి చంద్రన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో అజిత్ కు జోడిగా త్రిష నటించారు.
Also Read: Samantha: వెన్నెల కిషోర్ తో సమంత రొమాన్స్.. రష్మిక చూశావా?