BigTV English

Samantha: వెన్నెల కిషోర్ తో సమంత రొమాన్స్.. రష్మిక చూశావా?

Samantha: వెన్నెల కిషోర్ తో సమంత రొమాన్స్.. రష్మిక చూశావా?

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha)గత కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ప్రస్తుతం మాత్రం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఒకవైపు నిర్మాతగా మారి సినిమాలో నిర్మిస్తూనే మరోవైపు నటిగా సినిమాలలోను, వెబ్ సిరీస్ లలోను నటిస్తున్నారు. ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న సమంత సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా సమంతకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో భాగంగా సమంత మరొక నటుడు వెన్నల కిషోర్(Vennela Kishore) తో కలిసి రొమాంటిక్ పర్ఫామెన్స్ చేశారు.


నదివే సాంగ్ …

ఇటీవల నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రష్మిక (Rashmika)దీక్షిత్ శెట్టి(Deekshith Shetty) జంటగా నటించిన చిత్రం ది గర్ల్ ఫ్రెండ్. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఇటీవల ఫస్ట్ సాంగ్ విడుదల చేశారు. నదివే (nadhive song)అంటూ సాగే ఈ పాటలో రష్మిక దీక్షిత్ సెట్టింగ్ రొమాంటిక్ పర్ఫామెన్స్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుందని చెప్పాలి. సోషల్ మీడియాలో ఈ సాంగ్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. ఈ సాంగ్ మంచి పాపులారిటీ సొంతం చేసుకోవడంతో నటి సమంత కూడా ఈ పాటకు వెన్నెల కిషోర్ తో కలిసి రొమాన్స్ చేశారని తెలుస్తుంది.


వెబ్ సిరీస్ లపై ఫోకస్..

సరదాగా వెన్నెల కిషోర్ తో కలిసి సమంత ఈ పాటకు డాన్స్ చేసిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియో పై నెటిజన్స్ విభిన్నంగా కామెంట్లు చేస్తున్నారు. రష్మిక సమంత డాన్స్ చూసావా అంటూ కొంతమంది కామెంట్ చేయగా మరికొందరు మాత్రం చాలా అద్భుతంగా ఉంది అంటూ కామెంట్ లు చేస్తున్నారు. మొత్తానికి సమంత, వెన్నెల కిషోర్ కి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక కెరియర్ విషయానికి వస్తే సమంత ఇటీవల నిర్మాతగా శుభం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం ఈమె రక్త బ్రహ్మాండ్ అనే సిరీస్ లో నటిస్తున్నారు. దీనితోపాటు ది ఫ్యామిలీ మెన్ 3 ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

?igsh=MWlxcnhkdG9zcDRhNw%3D%3D

ఇటీవల కాలంలో సమంత సినిమాలను కాస్త తగ్గించి ఎక్కువగా వెబ్ సిరీస్ ల పైన ఫోకస్ పెడుతున్న సంగతి తెలిసిందే. ఇకపోతే సమంత చివరిగా ఖుషీ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా తర్వాత ఈమె తదుపరి తెలుగు సినిమాలను ప్రకటించలేదు. ఇకపోతే సమంత ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. నాగచైతన్య నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత సమంత డైరెక్టర్ రాజ్ నిడుమోరి(Raj Nidumori)తో రిలేషన్ ఉన్నారని పెద్ద ఎత్తున వార్తలు బయటకు వస్తున్నాయి. ఈ వార్తలకు అనుగుణంగానే వీరిద్దరు ఎక్కడికి వెళ్లిన జంటగా కలిసి కనిపిస్తున్న నేపథ్యంలో ఈ రూమర్లు నిజమేనని అందరూ భావిస్తున్నారు. అయితే ఇప్పటివరకు సమంత కానీ డైరెక్టర్ రాజ్ కానీ ఈ విషయాలను ఖండించకపోవడం గమనార్హం.

Also Read: Rashmika Mandanna: బిగ్ సర్ ప్రైజ్ ప్లాన్ చేసిన రష్మిక… రేపటి వరకు వేచి చూడాలంటూ?

Related News

Fauji: ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. రిలీజ్ డేట్ లాక్.. త్వరలో అఫీషియల్ ప్రకటన!

Akhanda 2 Update : బాలయ్య పని అయిపోయింది… ఇక మిగిలింది పవన్‌తో ఫైటింగే

Kantara Chapter1: ‘కాంతారా చాప్టర్ :1 ‘ కనకవతి లుక్ వచ్చేసింది.. ఆకట్టుకుంటున్న పోస్టర్..

Jatadhara Teaser : సుధీర్ బాబు జటాధర… ఇది హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీనా ఏంటి?

Book My Show Tickets: గంటలోనే లక్ష టికెట్లు… బాక్సాఫీస్‌పై ఊచకోత ఇది!

The paradise : ‘ది ప్యారడైజ్’ అప్డేట్ వచ్చేసింది.. రెండు జడలతో నాని లుక్ అదుర్స్..

Big Stories

×