కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వివిధ వర్గాలకు చెందిన ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను రూపొందించారు. ఈ పథకాలన్నీ కూడా పలు కార్పొరేషన్ల ఆధ్వర్యంలో అందుబాటులో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో పాటు కేంద్ర ప్రభుత్వం సైతం ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూలు తెగలకు సంబంధించి అభ్యున్నతి కోసం అనేక రకాల ప్రభుత్వ పథకాలను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ఎస్సీ కులాలకు చెందినటువంటి విద్యార్థిని విద్యార్థులు విదేశాలలో ఉన్నత విద్యా అభ్యసించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఎడ్యుకేషన్ లోన్ స్కీం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ స్కీం ద్వారా ఎస్సీ కులాలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు అతి తక్కువ వడ్డీ రేటుకే విదేశీ విద్య కోసం 40 లక్షల వరకు రుణం పొందే అవకాశం ఉంటుంది. ఈ స్కీం గురించి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
కేంద్ర సామాజిక న్యాయ మరియు సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ షెడ్యూల్డ్ కులాల ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NSFDC) ఎస్సీ కులాలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు ఎడ్యుకేషన్ లోన్ స్కీం ప్రారంభించింది. ఈ స్కీం కింద ఎస్సీ వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య చదువుకునేందుకు గరిష్టంగా 30 లక్షల వరకు రుణం పొందే అవకాశం ఉంది. దీంతో పాటు దేశీయంగా కూడా ఉన్నత విద్య చదువుకునేందుకు 20 లక్షల రూపాయల వరకు రుణం అందించనున్నారు.
వడ్డీ రేటు ఎంత..?
ఈ స్కీం కింద విద్యార్థులకు సంవత్సరానికి 6.5 శాతం వడ్డీ చొప్పున వసూలు చేస్తున్నారు.
తిరిగి చెల్లింపు వ్యవధి ఎంత ?
గరిష్టంగా 10 సంవత్సరాల్లో తిరిగి చెల్లింపు చేయాల్సి ఉంటుంది. అయితే మీకు ఉద్యోగం లభించిన ఆరు నెలల తర్వాత తిరిగి చెల్లింపు ఈఎంఐ మొదలవుతుంది.
విదేశీ విద్యకు ఇది ఎలా సహాయపడుతుంది..?
ఎవరైతే విదేశీ విద్యకు అప్లై చేసుకున్నారో వారికి ముందుగా మీరు ఎంపిక చేసుకున్న దేశంలోని యూనివర్సిటీ నుంచి అడ్మిషన్ లెటర్ మీ దరఖాస్తు తో పాటు చూపించాల్సి ఉంటుంది. దీంతోపాటు కోర్సు ఫీజు వివరాలు, పుస్తకాల ఖర్చు, యూనివర్సిటీకి సంబంధించిన అధికారిక డాక్యుమెంట్స్ మీ అప్లికేషన్ తో పాటు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
తెలంగాణలో ఈ రుణం కోసం ఎలా అప్లై చేసుకోవాలి..?
NSFDC – Education Loan Scheme తెలంగాణలో నేరుగా కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా కాకుండా స్టేట్ ఛానల్ ఏజెన్సీగా ఉన్నటువంటి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఈ పథకం అమల్లో ఉంది. అందుకే ఈ స్కీం కోసం అప్లై చేసుకునే వారు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం మీ ఆదాయ సర్టిఫికెట్, అలాగే కుల ధ్రువీకరణ పత్రము, దీంతోపాటు మీ అడ్మిషన్ లెటర్ వంటివి అప్లికేషన్ తో పాటు జత చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ఈ వివరాలను NSFDC కార్పొరేషన్ కు పంపుతుంది. తద్వారా NSFDC నుంచి ఆమోదం లభించినట్లయితే, విద్యార్థికి రుణం మంజూరు అవుతుంది. సాంక్షన్ లెటర్ అందుకున్న తర్వాత నేరుగా విద్యార్థి అకౌంట్లోకి రుణ మొత్తం విడుదల అవుతుంది.
పూర్తి వివరాల కోసం వెబ్ సైట్ లింక్ క్లిక్ చేయాలి.