BigTV English

Personal Finance: 45 సంవత్సరాలకే రిటైరయ్యి పెన్షన్ పొందుతూ లైఫ్ హాయిగా గడపాలని ఉందా..అయితే ఇలా ప్లాన్ చేసుకోండి..

Personal Finance: 45 సంవత్సరాలకే రిటైరయ్యి పెన్షన్ పొందుతూ లైఫ్ హాయిగా గడపాలని ఉందా..అయితే ఇలా ప్లాన్ చేసుకోండి..

ప్రస్తుత కాలంలో యువత అభివృద్ధిలో రోజురోజుకు మారిపోతున్నాయి. తమ జీవితంలో కొత్తదనాన్ని కోరుకుంటూ యువతరం ఆలోచిస్తోంది. ముఖ్యంగా సాంప్రదాయంగా గతంలో మాదిరిగా 60 సంవత్సరాలు వచ్చే వరకు ఉద్యోగం చేస్తూ ఆ తర్వాత పెన్షన్ పొందుతూ మిగతా జీవితాన్ని గడిపేయాలి అని యువతరం భావించడం లేదు. తమ కెరీర్ తో పాటు తమ జీవిత లక్ష్యాలను కూడా ఏర్పాటు చేసుకొని వాటిని నెరవేర్చుకునేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇందుకోసం తమ కెరీర్ ను తగ్గించుకొని, తమ పర్సనల్ లైఫ్ ను ఎంజాయ్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఐటీ సర్వీసెస్ వంటి ఒత్తిడి జాబ్స్ చేసేవారు 15 నుంచి 20 సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం పని చేయలేని పరిస్థితి ఏర్పడుతోంది.


ముఖ్యంగా టెక్నాలజీ మార్పు వల్ల లే ఆఫ్స్ కూడా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో చాలామంది యువతరం 40 నుంచి 45 సంవత్సరాల మధ్యలోనే తమ కెరీర్ కు మంగళం పాడి రిటైర్మెంట్ లైఫ్ ఎంజాయ్ చేసేందుకు ఇష్టపడుతున్నారు. అయితే 45 సంవత్సరాలకే రిటైర్మెంట్ అనేది సాధ్యం అవుతుందా.. మరి ప్రతినెల పెన్షన్ మాటేమిటి..? 45 సంవత్సరాల నుంచి జీవితాంతం వరకు కెరీర్ వదులుకొని ఎలా గడపాలి అనే సందేహం కలగవచ్చు. అయితే 45 సంవత్సరాలకే రిటైర్మెంట్ ఎలా ప్లాన్ చేసుకోవచ్చు తెలుసుకుందాం.

ముందుగా మీరు 45 సంవత్సరాలకు రిటైర్ అవ్వాలి అనుకున్నట్లయితే, అప్పటి నుంచి మీరు వృద్ధాప్యంలో జీవిత చరమాంకం వరకు ఎంత డబ్బు అవసరం అవుతుందో ముందుగా ప్లాన్ చేసుకొని ఉండాలి. అలాగే ద్రవ్యోల్బణం అంచనా వేసి మీరు సంపాదించిన డబ్బు భవిష్యత్తులో విలువ కోల్పోకుండా ఉండేలా కూడా ప్లాన్ చేసుకోవాలి. లేకపోతే ఈ సంవత్సరం ఒక లక్ష రూపాయలకు ఉన్న విలువ 10 సంవత్సరాల తర్వాత తగ్గిపోతుంది అన్న సంగతి గుర్తుంచుకోవాలి.


కెరీర్ పొదుపుతో ప్రారంభించాలి:
ఉదాహరణకు మీ వయస్సు 22 సంవత్సరాలు ఉన్నట్లయితే మీ కెరీర్ ప్రారంభం నుంచి పొదుపు చేయడం అనేది మొదలు పెట్టాలి. దీనికోసం బ్యాంకులో రికరింగ్ డిపాజిట్స్ ఆఫర్ చేస్తుంటాయి. వీటిలో అధిక వడ్డీ లభిస్తుంది. అలాగే పోస్ట్ ఆఫీస్ పథకాలు కూడా ఎక్కువ వడ్డీ ఆఫర్ చేస్తుంటాయి. మీ వేతనంలో కనీసం 50 నుంచి 70% కెరీర్ ప్రారంభంలో పొదుపు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే కెరీర్ ప్రారంభంలో మీరు ఇంకా వివాహం చేసుకోరు. కనుక బాధ్యతలు తక్కువగా ఉంటాయి. అనవసరమైన ఖర్చులు తగ్గించుకొని మీ జీవితంలో ఎక్కువ మొత్తం పొదుపు చేసినట్లయితే చక్కటి ఫండ్ అనేది తయారవుతుంది.

పొదుపుతో పాటు మదుపు కూడా ముఖ్యం:
మీరు జీవితాంతం ఎంత పొదుపు చేసినా ఆ మొత్తం బ్యాంకుల్లో ఉంచినట్లయితే కేవలం సాధారణ వడ్డీ మాత్రమే లభిస్తుంది. దీనివల్ల ఏ ప్రయోజనము ఉండదు. మీ ఆదాయంలో పొదుపుతో పాటు మోదుపు అంటే పెట్టుబడి కూడా పెట్టినట్లయితే మీ సంపద మార్కెట్ స్థితిగతుల రీత్యా పెరుగుతుంది. బ్యాంకులో దాచిపెట్టే డబ్బుపై మీకు ఇంట్రెస్ట్ లభిస్తుంది. కానీ మోదుపు చేయడం ద్వారా కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ లభిస్తుంది. అంటే మీ పెట్టుబడి అనేక రెట్లు పెరుగుతుంది దీనినే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అని పిలుస్తారు. మదుపు చేయడానికి సురక్షితమైన మార్గం SIP ద్వారా పెట్టుబడి పెట్టడమే అని చెప్పవచ్చు. ప్రతినెల సురక్షితంగా నిర్ణీత మొత్తం సిప్ ప్లాన్స్ లో ఇన్వెస్ట్ చేసినట్లయితే మీకు 45 సంవత్సరాలు వచ్చే నాటికి పెద్ద మొత్తంలో కార్పస్ ఫండ్ అనేది ఏర్పడుతుంది. ఈ మొత్తం మీ రిటైర్మెంట్ లైఫ్ సమయంలో ఉపయోగపడుతుంది.

ఈక్విటీ షేర్లలో పెట్టుబడి: ఇది కాస్త రిస్కీ వ్యవహారం అయినప్పటికీ లార్జ్ క్యాప్ షేర్లను ఎంపిక చేసుకొని కాస్త రిస్క్ తీసుకొని ఇన్వెస్ట్ చేసినట్లయితే మీ రిటైర్మెంట్ సమయానికి ఆ షేర్ల విలువ భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. మీడియం క్యాప్, స్మాల్ క్యాప్ కంపెనీలో కూడా రిస్క్ చేసి పెట్టుబడి పెట్టినట్లయితే పెద్ద మొత్తంలో రాబడి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈక్విటీ మార్కెట్లలో అవగాహన లేకుండా పెట్టుబడి పెట్టినట్లయితే డబ్బు నష్టపోయే ప్రమాదం ఉంది.

రియల్ ఎస్టేట్లో పెట్టుబడి:

మీ సంపాదనలో కొంత మొత్తాన్ని రియల్ ఎస్టేట్ పెట్టుబడిలో కూడా పెట్టవచ్చు. దీనివల్ల మీకు రిటైర్మెంట్ అనంతరం రెంటల్ రూపంలో ఆదాయం లభిస్తుంది.

NPS స్కీంలో పెట్టుబడి: మీరు ఉద్యోగంలో చేరినప్పటి నుంచి నేషనల్ పెన్షన్ స్కీంలో ఇన్వెస్ట్ చేసినట్లయితే మీ రిటైర్మెంట్ కాలానికి పెన్షన్ లభించే అవకాశం ఉంటుంది.

దీంతోపాటు బీమా పాలసీ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. తద్వారా భవిష్యత్తులో ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

నిజానికి 45 సంవత్సరాల వయసులో రిటైర్మెంట్ తీసుకోవడం వల్ల మీ జీవితం పైన ఎక్కువ ఫోకస్ పెట్టవచ్చు. అలాగే మీ కెరీర్ ఆప్షన్ కూడా మార్చుకొని మీకు నచ్చినట్టుగా జీవించవచ్చు. అయితే ఇలా చేయాలి అంటే ముందుగా మీరు ఆర్థికంగా స్థిరపడాల్సి ఉంటుంది దీనికోసం పైన పేర్కొన్నటువంటి టెక్నిక్స్ ద్వారా పెద్ద మొత్తంలో కార్పస్ ఫండ్ సృష్టించుకోవచ్చు. తద్వారా మీ రిటైర్మెంట్ జీవితాన్ని సమర్థవంతంగా గడపవచ్చు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందించబడింది. ఇది ఆర్థిక లేదా పెట్టుబడి సలహా కాదు. పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు, దయచేసి ఆర్థిక నిపుణుడిని సంప్రదించి, పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత మాత్రమే ముందుకు వెళ్లండి. మీ పెట్టుబడుల వల్ల వచ్చే లాభాలు లేదా నష్టాలకు బిగ్ టీవీ వెబ్ పోర్టల్ ఏ విధంగానూ బాధ్యులు కాదు.

Related News

Credit Score: సిబిల్ స్కోర్ అంటే ఏంటి? లోన్ ఇవ్వాలా వద్దా అని బ్యాంకు ఎలా నిర్ణయిస్తుంది ?

Bank Holidays: ఈ వారంలో 4 రోజులు బ్యాంకులు బంద్.. హాలిడేస్‌ లిస్ట్‌ ఇదే!

SBI Card New Rules: కార్డ్ యూజర్లకు ఎస్‌బీఐ ఝలక్.. కోటి ఆఫర్ పోయినట్టే

FMCG Sales: పండగలకు స్టాక్ పెంచిన FMCG.. సామాన్యులకు లాభమా? నష్టమా?

DMart: ఇక డి-మార్ట్ కు వెళ్లాల్సిన పని లేదు.. ఇలా చేస్తే నేరుగా ఇంటికే సరుకులు!

Big Stories

×